సామ్‌సంగ్‌కు షాక్, 10 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇవే

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో 5 సంవత్సరాల పాటు టాప్ పొజీషన్‌లో కొనసాగిన సామ్‌సంగ్‌కు భారీ షాక్ తగిలింది. ఐఫోన్‌ల తయారీ కంపెనీ యాపిల్ మొట్టమొదటి సారిగా సామ్‌సంగ్‌కు షాకిచ్చి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ ర్యాకింగ్స్‌లో మొదటి స్దానానికి చేరుకుంది. దీంతో సామ్‌సంగ్ 2వ స్ధానానికి పరిమితమవ్వాల్సి వచ్చింది. 2016, 4వ క్వార్టర్‌కు గాను ప్రముఖ రిసెర్చ్ కంపెనీ IDC వెల్లడించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..

Read More : SIM క్లోన్ చేసి 10 లక్షలు కాజేసారు, ఆ కాల్స్ నమ్మకండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్

యాపిల్

ఐఫోన్ 7, ఐఫోన్ ప్లస్ మార్కెట్లో విజయం సాధించటంతో 2016, క్యూ4 ఫలితాలు యాపిల్ కంపెనీని మొదటి స్ధానంలో నిలబెట్టాయి. 2016, 4వ క్వార్టర్‌‌లో యాపిల్ 78.3 మిలియన్ ఐఫోన్ యూనిట్లను విక్రయించగలిగింది.

 

సామ్‌సంగ్

సామ్‌సంగ్

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సామ్‌సంగ్ రెండవ స్ధానానికి పడిపోయింది. 2016, 4వ క్వార్టర్‌‌లో సామ్‌సంగ్ 77.5 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇదే సమయంలో 2015 అమ్మకాలు 81.7 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. 2016 మొత్తం మీద సామ్‌సంగ్ విక్రయింయిన ఫోన్‌ల సంఖ్య 311.4 మిలియన్లుగా ఉంది.2015లో ఈ సంఖ్య 320.9 మిలియన్లు.

 

Huawei

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీ హువావే (Huawei)కు 3వ స్ధానం లభించింది. 2016 మొత్తం మీద హువావే విక్రయించిన ఫోన్‌ల సంఖ్య 139.3 మిలియన్ యూనిట్లుగా ఉంది. 2015లో ఈ సంఖ్య 107 మిలియన్లు మాత్రమే.

Oppo

ఒప్పో

2016లో ఒప్పో కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2016, 4వ క్వార్టర్‌‌లో ఒప్పో కంపెనీ 31.2 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగింది. 2015, క్యూ4లో ఈ సంఖ్య 14.4 మిలియన్‌గా ఉంది.

 

Vivo

వివో

2016లో వివో కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2016, 4వ క్వార్టర్‌‌లో ఒప్పో కంపెనీ 24.7 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగింది. 2015, క్యూ4లో ఈ సంఖ్య 12.1 మిలియన్‌గా ఉంది.

 

Oneplus

వన్‌ప్లస్

మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో Oneplus శక్తివంతమైన బ్రాండ్‌గా అవతరిస్తోంది. ఈ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న ‘flagship killers'కు మార్కెట్లో మంచి స్పందత లభిస్తోంది. నవంబర్ 2016లో వన్‌ప్లస్ కంపెనీ , OnePlus 3T పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది.

 

Xiaomi

షియోమీ

2016లో షియోమీ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు భారత్‌లో గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా రెడ్మీ నోట్ 3 ఫోన్ భారత్ లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

 

Lenovo

లెనోవో

టాప్ 5 గ్లోబల్ ర్యాకింగ్స్‌లో తన స్ధానాన్ని కోల్పొయినప్పటికి లెనోవో అమ్మకాలు భారత్‌లో బాగానే ఉన్నాయి. లెనోవో తాజగా Google Tango స్మార్ట్‌ఫోన్ లెనోవో ఫాబ్ 2 ప్రోను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. మరోవైపు లెనోవో సబ్సిడరీ బ్రాండ్ మోటరోలా కూడా భారత్‌లో దూసుకుపోతోంది.

 

LG

ఎల్‌జీ

దక్షిణకొరియా బ్రాండ్ ఎల్‌జీ సరికొత్త ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నప్పటికి మార్కెట్లో ఆశించిన స్ధాయిలో ఫలితాలను రాబట్టలేక పోతోంది.

Sony

సోనీ

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌‌ల తయారీ కంపెనీ సోనీ, భారత్‌లో ఇక పై ప్రీమియమ్ ఫోన్‌‍లను మాత్రమే విక్రయిస్తామని తెలిపింది. తాజాగా, Xperia XZ పేరుతో హై-ఎండ్ ఫోన్‌ను సోనీ లాంచ్ చేసింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 biggest smartphone companies of the world. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot