ఆసక్తికరమైన నిజాలు!

|

10 curious cell phone facts
చేతిలో ఇమడగలిగే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఫోన్‌ను తొలిగా ఎవరు డిజైన్ చేశారు..?, టెక్స్ట్ సందేశాల పరధి 160 పదాలకు ఏలా ఏర్పడింది ..?, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఏది..? ఏ దేశస్థులు మొబైల్ ఫోన్‌ల ద్వారా ఎక్కువుగా టెక్స్ట్ సందేశాలను పంపుతారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మీ వద్ద ఉందా..? పైన పేర్కొన్న ప్రశ్నలకు గిజ్‌బాట్ వద్ద ఆసక్తికర సమాధానాలు ఉన్నాయి. వాటిని స్లైడ్‌షో రూపంలో మీ ముందుంచుతున్నాం. మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వాస్తవాలను తెలుసుకోవల్సి అవశ్యకత ఎంతైనా ఉంది.

లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్', కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యవసరమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ‘బ్టూటూత్ హెడ్ సెట్లు' ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికి ప్రస్తుత తరానికి పొసగటం లేదు. ఈ నేపధ్యంలో రెట్రో రకం హెడ్ సెట్లు తెరపైకి వస్తున్నాయి. వీటిని వినియోగించటం ద్వారా రేడియేషన్ నుంచి 98% వరకు విముక్తి పొందవచ్చు.

ప్రపంచపు తొలి చేతి వినియోగ మొబైల్ ఫోన్ ‘మోటరోలా డైనా‌టాక్ 8000ఎక్స్’ (DynaTAC 8000X):

ప్రపంచపు తొలి చేతి వినియోగ మొబైల్ ఫోన్ ‘మోటరోలా డైనా‌టాక్ 8000ఎక్స్’ (DynaTAC 8000X):

ప్రపంచపు తొలి చేతివినియోగ మొబైల్ ఫోన్ ‘మోటరోలా డైనా‌టాక్ 8000ఎక్స్'ను మోటరోలా ఉద్యోగి మార్టిన్ కూపర్ 1973లో తయారు చేశారు. 11 సంవత్సరాల తరువాత అంటే 1984లో ఈ ఫోన్‌ను వాణిజ్యపరంగా విడుదల చేశారు. అప్పటి ధర $3,995.

పేపర్ తయారీతో నోకియా అరంగ్రేటం (Nokia manufactured paper in 1865):

పేపర్ తయారీతో నోకియా అరంగ్రేటం (Nokia manufactured paper in 1865):

మొబైల్ తయారీ బ్రాండ్‌గా మనందరికి సుపరిచితమైన నోకియాకు పెద్ద చరిత్రే ఉంది. నోకియా సంస్థను 1865లో ప్రారంభించారు. అప్పట్లో ఈ కంపెనీ ప్రధాన వర్తకం ‘పేపర్ తయారీ'. ఆ తరువాతి క్రమంలో రబ్బర్ ఉత్పత్తులు, టెలీగ్రాఫ్ వైర్‌లను తయారు చేయటం మొదలుపెట్టింది. 19వ శతాబ్ధం మధ్య దశకంలో ఆర్మీకి అవసరమైన పరికరాలను నోకియా సమకూర్చేది. 1980 నుంచి మొబైల్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

160 - పదాల టెక్స్ట్ సందేశాలు (160-character text messages):

160 - పదాల టెక్స్ట్ సందేశాలు (160-character text messages):

45ఏళ్ల సమాచార పరిశోధకుడు ఫ్రైడ్ హిల్మ్ హిల్లీబ్రాండ్ 1985వ సంవత్సరంలో మొబైల్ టెక్స్ట్ సందేశానికి సంబంధించి ప్రామాణిక పొడవును వివరించారు. తొనినాళ్లలో సాంకేతిక లోపాల కారనంగా టెక్స్ట్ సందేశం పొడవు 128 పదాలకు మించేది కాదు. తరువాతి క్రమంలో లోపాలను సవరించి టెక్స్ట్ సందేశం పొడవును 160 పదాలకు పెంచారు.

 జేబ్స్ బాండ్ తొలి సెల్‌ఫోన్ ఎరిక్సన్ జేబి988 (James Bond's first cell phone Ericsson JB988):

జేబ్స్ బాండ్ తొలి సెల్‌ఫోన్ ఎరిక్సన్ జేబి988 (James Bond's first cell phone Ericsson JB988):

జేబ్స్ బాండ్ తొలి సారిగా సెల్‌ఫోన్‌ను ఏజెంట్ 007చిత్రంలో ఉపయోగించారు. మోడల్ పేరు ‘ఎరెక్సన్ జేబీ988'.ఫింగర్ ప్రింట్ స్కానర్, హై వోల్టోజ్‌తో కూడిన సెక్యూరిటీ సిస్టం, రిమోట్ కంట్రోల్ వంటి ప్రత్యేక అదనపు ఫీచర్లును ఈ ఫోన్ కలిగి ఉంది.

ఫోన్ ద్వారా ఫోటో షేరింగ్ ప్రక్రియ మొదలైన రోజు (First photo sent from a phone):

ఫోన్ ద్వారా ఫోటో షేరింగ్ ప్రక్రియ మొదలైన రోజు (First photo sent from a phone):

కెమెరా ఫోన్ సృష్టికర్త ఫిలిప్పి ఖాన్ తన ఫోటోను జూన్11, 1997ను మొదటిసారిగా తన కూతురు సోఫీ జన్మించిన మెటర్నిటీ వార్డ్‌కు ఫోన్ ద్వారా షేర్ చేశారు. అప్పటి నుంచి మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో షేరింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన పోన్ (World's best-selling phone):

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన పోన్ (World's best-selling phone):

నోకియా నుంచి 2003లో విడుదలైన మొబైల్‌ఫోన్ ‘నోకియా 1100'. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ యూనిట్‌ల పై చిలుకు అమ్ముడుపోయి సరికొత్త రికార్డును నెలకొల్పింది. మార్కెట్లో నోకియాకున్న విశ్వసనీయత ఇంకా ఖచ్చితత్వమే ఇందుకు కారణమని పలువురు భావిస్తారు.

ప్రపంచపు గట్టి ఫోన్ (World's toughest phone):

ప్రపంచపు గట్టి ఫోన్ (World's toughest phone):

‘సోనిమ్ ఎక్స్ పి3300 ఫోర్స్' ప్రపంచపు ధృడమైన ఫోన్‌గా రికార్డు నమోదు చేసింది. ఈ ఫోన్ 25 మీటర్ల ఎత్తు నుంచి పడినప్పటికి చెక్కు చెదరదు. రెండు మీటర్ల లోతైన నీటిలో మునిగినప్పటికి సేఫ్‌గా ఉంటుంది.

ప్రపంచపు తొలి మ్యూజిక్ ఫోన్ (World's first music phone) :

ప్రపంచపు తొలి మ్యూజిక్ ఫోన్ (World's first music phone) :

ప్రపంచపు మొట్టమొదటి మ్యూజిక్ ఫోన్‌గా ముద్రపడిన సైమెన్స్ ఎస్ఎల్45ను 2001లో విడుదల చేశారు. ఎంప్రీ3 ప్లేబ్యాక్, ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ హ్యాండ్‌సెట్‌లో పొందుపరిచారు. ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్‌తో 5గంటల మ్యూజిక్‌ను అందిస్తుంది.

టెక్స్ట్ మెసేజింగ్ (Text Messaging):

టెక్స్ట్ మెసేజింగ్ (Text Messaging):

మొబైల్ ద్వారా టెక్స్ట్ సందేశాలను అత్యధికంగా పంపేవారిలో ఫిలిప్పిన్ దేశస్ధులు మొదటి స్థానాన్ని ఆక్రమించారు. ఈ దేశస్ధులు రోజువారి పంపుకునే సందేశాల సంఖ్య 1.4 మిలియన్‌లు. దింతో ఈ దేశానిక ‘టెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్' అనే బిరుదు లభించింది.

ప్రపంచపు ఖరీదైన ఫోన్ (World's most expensive phone):

ప్రపంచపు ఖరీదైన ఫోన్ (World's most expensive phone):

ఐఫోన్4 డైమండ్ రోజ్ ప్రపంచపు ఖరీదైన ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఖరీదైన వజ్రాలను కలిగి పసడి పూతతో డిజైన్ కాబడిన ఈ ఫోన్ ధర అక్షరాలా $5 మిలియన్‌లు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X