తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు..ఇదిగోండి జాబితా

Posted By:

కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు సమయం సమీపిస్తోన్న నేపధ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తామ పాత వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరల పై ఆఫర్ చేస్తున్నాయి. గెలాక్సీ నోట్ 4 ఆవిష్కరణ నేపథ్యంలో గెలాక్సీ నోట్ 3 ధర రూ.4000కు పైగా తగ్గింది. మరోవైపు గెలాక్సీ ఎస్5 సైతం రూ.5000 తగ్గింపు ధరతో లభ్యమవుతోంది. మరో వైపు యాపిల్ ఐఫోన్6 విడుదల నేపథ్యంలో ఐఫోస్ 5ఎస్, ఐఫోస్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరల పై విక్రయిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అనధికారిక తగ్గింపు ధరలతో ఆన్‌‍లైన్ మార్కెట్లో ప్రత్యేక డీల్స్ పై లభ్యమవుతోన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.40,098,
ప్రస్తుత ధర రూ.35,451 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రముఖ ఫీచర్లు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ వోక్టా‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎష్ ఎల్టీఈఏ కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

విడుదల సమయలో ఫోన్ వాస్తవ ధర రూ.43,250,
ప్రస్తుత ధర రూ.36,890 నుంచి ప్రారంభం
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ ఎస్5 డిస్‌ప్లే విషయానికొస్తే 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను గెలాక్సీ ఎస్5 ముందు భాగంలో ఏర్పాటు చేసారు ( రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్). ఫోన్ పరిమాణం 142.0 x 72.5 x 8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు. గెలాక్సీ ఎస్4‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్5 బరువు కాస్తంత ఎక్కువే. గెలాక్సీ ఎస్5 డస్ట్ రెసిస్టెంట్ అలానే వాటర్ ప్రూఫ్ ఫీచర్లను కలిగి ఉంది.గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ ఆపరేటింగ్ సిస్టంను కొత్త వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నారు. రెండు క్వాడ్‌ కోర్ (1.9గిగాహెట్జ్ + 1.3గిగాహెట్జ్) చిప్‌లతో కూడిన ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను గెలాక్సీ ఎస్5‌లో నిక్షిప్తం చేసారు. అలానే 2జీబి ర్యామ్ గెలాక్సీ ఎస్5 పనితీరును మరింత బలోపేతం చేస్తుంది. గెలాక్సీ ఎస్5లో 16జీబి ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ మెమెరీ స్థాయిని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2,800ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసారు.

గెలాక్సీ ఎస్5, 16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. అలానే, ఫోన్ ముందుగా భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ డివైస్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది. ఈ సెన్సార్ వ్యవస్థను ఫోన్ హోమ్ బటన్ పై భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. ‘హార్ట్-రేట్ సెన్సార్' పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసారు.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5S

విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.53,500 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.38,368 నుంచి ప్రారంభం
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5C

ఫోన్ వాస్తవ ధర రూ.41,990 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.24,999 నుంచి ప్రారంభం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

LG G Flex

ఫోన్ వాస్తవ ధర రూ.65,000 నుంచి ప్రారంభం,
ప్రస్తుత ధర రూ.41,000 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

6 అంగుళాల ఓఎల్ఈడి స్ర్కీన్ (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.42.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
3500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Blackberry Z30

ఫోన్ వాస్తవ ధర రూ.44,990,
ప్రస్తుత ధర రూ.27,869 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1520

ఫోన్ వాస్తవ ధర రూ.49,999,
ప్రస్తుత ధర రూ.38,000 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

ఫోన్ వాస్తవ ధర రూ.52,990,
ప్రస్తుత ధర రూ.41,250 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z

ఫోన్ వాస్తవ ధర రూ.35,999,
ప్రస్తుత ధర రూ.25,990 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One

ఫోన్ వాస్తవ ధర రూ.59,590,
ప్రస్తుత ధర రూ.35,200 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

LG G2

ఫోన్ వాస్తవ ధర రూ.41,500,
ప్రస్తుత ధర రూ.33,000 నుంచి ప్రారంభం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

తగ్గింపు ధరలతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core 2 Duos

విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.12,499
ప్రస్తుత ధర రూ.8,007
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Flagship Smartphones in India Get An Unofficial Price Cut: Complete List. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot