సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ, ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నెమ్మదిగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ శక్తివంతమైన బ్రాండ్‌గా అవతరిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి తాజాగా విడుదలైన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జెడ్3' అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

ఎక్స్‌పీరియా జెడ్2 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఎక్స్‌పీరియా జెడ్3 డిజైనింగ్, ప్రాసెసింగ్, కెమెరా, బ్యాటరీ బ్యాకప్ ఇలా అన్ని విభాగాల్లో శక్తివంతమైన పనితీరును కనబరుస్తూ పోటీ స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాళ్లను విసురుతోంది.

ఎక్స్‌పీరియా జెడ్3లో పొందుపరిచిన డ్యూయల్ లెన్స్ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఆధునిక మనిషి స్మార్ట్ మొబైలింగ్ అవసరాలను సమృద్థిగా తీర్చగలవు. మార్కెట్లో లభ్యమవుతోన్న యూపిల్ ఐఫోన్ 6తో పోలిస్తే ఎక్స్‌పీరియా జెడ్3 తక్కువ ధరకే లభ్యమవుతోంది. సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ధరను ఐఫోన్ 6 ప్లస్‌ ధరతో అంచనావేసినట్లయితే జెడ్3 ధర రూ.11,900 తక్కువగా ఉంటుంది. దేశీ మార్కెట్లో ఎక్స్‌పీరియా జెడ్3 ధర రూ.50,000.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3: కీలక స్పెసిఫికేషన్‌లు

5.2 అంగుళాల డిస్‌ప్లే (1920x1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో), స్ర్కీన్ రూపకల్పనలో భాగంగా ట్రైల్యూమినస్ డిస్‌ప్లే సాంకేతికతను సోనీ వినియోగించింది. 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సాక్ క్వాడ్‌కోర్ సీపీయూ, 4జీ ఎల్టీఈ మోడెమ్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, ఏజీపీఎస్/గ్లోనాస్, బ్లూటూత్ 4.0, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ సింక్రనేజేషన్, యూఎస్బీ హైస్పీడ్ 2.0 కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (19 గంటల టాక్‌టైమ్, 740 గంటల స్టాండ్‌బై టైమ్).

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 డివైస్‌లోని 10 బెస్ట్ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

అద్భుతమైన నిర్మాణ శైలి

ఎక్స్‌పీరియా జెడ్2‌కు తరువాతి వర్షన్‌గా విడుదలైన ఎక్స్‌పీరియా జెడ్3 ఆకట్టుకునే నిర్మాణ శైలిని కలిగి ఉంది. గాజు ఇంకా ఆల్యూమినియమ్ కలయకతో ఫోన్ ముందు భాగం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఫోన్ మందం కేవలం 7.3 మిల్లీమీటర్లు. పూర్తి స్టైలిష్ లుక్‌తో తయారుకాబడిన ఎక్స్‌పీరియా జెడ్3 చేతికి ఇంపుగా ఉంటుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

ఆకట్టుకునే డిస్‌ప్లే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం 1,920 x 1,080పిక్సల్స్. గెలాక్సీ ఎస్5, ఐఫోన్6లతో పోలిస్తే ఎక్స్‌పీరియా జె3 స్ర్కీన్ ఆకర్షణీయంగాను అదే సమయంలో పెద్దదిగాను ఉంటుంది. ఎక్స్‌పీరియా జెడ్3లో ఏర్పాటు చేసిన ఆడాప్టివ్ డిస్‌ప్లే వ్యవస్థ స్ర్కీన్ బ్రైట్నెస్‌ను స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకుంటుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే ఫోన్ ప్రస్తుతానికి గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్‌ను అందుకోనుంది. ఎక్స్‌పీరియా జెడ్3 సోనీ ప్రొప్రైటరీ యూజర్ ఇంటర్‌ఫేస్ పై స్పందిస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

కెమెరా పనితీరు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 డివైస్ వెనుక భాగంలో 20.7 మెగా పిక్సల్ సామర్థ్యం గల శక్తివంతమైన కెమెరాను ఏర్పాటు చేసారు. 1/2.3 అంగుళాల సెన్సార్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, వేగవంతమైన 25 ఎమ్ఎమ్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ప్రత్యేకతలను ఈ కెమెరా కలిగి ఉంది. ఐఎస్ఓ సామర్థ్యం 12800. ఈ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ అత్యుత్తమ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. నీటిలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 2.2 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ రెండు కెమెరా వ్యవస్థల ద్వారా వీడియోలను 1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

ప్రాసెసర్ ఇంకా ర్యామ్ పనితీరు

ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లో 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెస‌ర్‌ను ఉపయోగించారు. 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు సహకరిస్తుంది. హైక్వాలిటీ గేమింగ్‌‌ను ఎక్స్‌పీరియా జెడ్3 సాకారం చేస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

బ్యాటరీ

3,100 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసింది. గెలాక్సీ ఎస్5, హెచ్‌టీసీ వన్ (ఎమ్8)లతో పోలిస్తే ఈ బ్యాటరీ మరింత పెద్దది. ఈ బ్యాటరీ ద్వరా సగటున 13 గంటల టాక్‌టైమ్‌ను యూజర్ పొందవచ్చు. గెలాక్సీ ఎస్5తో పోలీస్తే ఈ సమయం కొన్ని గంటల ఎక్కువ.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

కఠినమైన స్వభావం

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ ఐపీ68 సర్టిఫికేషన్‌ను కలిగి కఠినమైన స్వభావంతో పని చేస్తుంది. దుమ్ము ఇంకా నీటీ వాతవరణాలను ఎక్స్‌పీరియా జెడ్3 ధీటుగా ఎదుర్కోగలదు. ఒక మీటర్ లోతైన నీటిలో ఉంచినప్పటికి ఎక్స్‌పీరియా జెడ్3 చెక్కుచెదరని పనితీరును కనబరుస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

కనెక్టువిటీ

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కనెక్టువిటీ ఫీచర్లు ... 4జీ ఎల్టీఈ, ఏజీపీఎస్/గ్లోనాస్, బ్లూటూత్ 4.0, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ సింక్రనేజేషన్, యూఎస్బీ హైస్పీడ్ 2.0 కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్. భారత్‌లో అందుబాటులో ఉన్న టీడీ-ఎల్టీఈ బ్యాండ్ 40 కనెక్టువిటీని ఎక్స్‌పీరియా జెడ్3 సపోర్ట్ చేస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

స్పీకర్ క్వాలిటీ

సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లో హైక్వాలిటీ స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేసింది. ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరిచిన స్పీకర్లతో పోలిస్తే ఎక్స్‌పీరియా జెడ్3 ఏర్పాటు చేసిన స్పీకర్ వ్యవస్థ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వీడియోలు ఇంకా సినిమాలను వీక్షించే సమయంలో క్వాలిటీని మీరు పరీక్షించవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

రిమోట్ ప్లే ఫంక్షన్

గేమింగ్ ప్రియులు ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎస్4 కన్సోల్‌కు కనెక్ట్ చేసుకుని టీవీ స్ర్కీన్‌ను ఉపయోగించుకుండానే అత్యుత్తమ గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

స్టోరేజ్

ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ మెమరీ స్టోరేజ్ విషయానికొస్తే స్వతహాగానే 16జీబి ఇంటర్నల్ మెమరీని ఫోన్‌లో అందుబాటులో ఉంచారు. కావాలనుకుంటే మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి అలానే 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3..10 ఆకట్టుకునే ఫీచర్లు

సోనీ స్మార్ట్‌వాచ్ 3కి జత చేసుకోవచ్చు

ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌ను సోనీ స్మార్ట్‌వాచ్ 3కి కనెక్ట్ చేసుకోవచ్చు. సోనీ స్మార్ట్‌వాచ్3 డిసెంబర్ నాటికి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Impressive Features of Sony Xperia Z3 Launched in India. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot