పాత మోడల్స్ అని పక్కన పెట్టేయకండి, వీటిలోనూ బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయ్!

ఇండియన్ మార్కెట్లో నిత్యం అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ నేపథ్యంలో పాత వాటికి పాధాన్యత తగ్గుతూ వస్తోంది.

|

ఇండియన్ మార్కెట్లో నిత్యం అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ నేపథ్యంలో పాత వాటికి పాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త ఫోన్‌ల మోజులో పడి చాలా మంది యూజర్లు అప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన ఉన్న అనేక మంచి మంచి మోడల్స్‌ను విస్మరించేస్తున్నారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా బెస్ట్ క్వాలిటీ ఫీచర్స్‌తో ప్రత్యేకమైన ధర తగ్గింపు పై మార్కెట్లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ (ప్రారంభ మోడల్ ధర రూ.55,000)

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ (ప్రారంభ మోడల్ ధర రూ.55,000)

మీరు రూ.50,000 బడ్జెట్‌లో బెస్ట్ ఐఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు iPhone 7 Plus (32GB) వెర్షన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.55,000 కంటే తక్కువ ధరకే లభ్యమవుతోంది. iOS 12 ఆపరేటింగ్ సిస్టంకు అపే‌డేట్ కాబడిన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కోర్ 2.37గిగాహెట్జ్ యాపిల్ ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్‌ను యాపిల్ పొందుపరించింది.

 

 

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (ప్రారంభ మోడల్ ధర రూ.17,999)

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (ప్రారంభ మోడల్ ధర రూ.17,999)

రూ.20,000లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఐఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు iPhone SE (32GB) వెర్షన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో ఈ డివైస్ రూ.17,999కే లభ్యమవుతోంది. iOS 12 ఆపరేటింగ్ సిస్టంకు అపే‌డేట్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో iPhone 6S తరహా స్పెక్స్ ఉన్నాయి.

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 (ధర రూ. 55,900)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 (ధర రూ. 55,900)

గెలాక్సీ నోట్ 9 విడుదల నేపథ్యంలో గెలాక్సీ నోట్ 8 ధర తగ్గుముఖం పట్టింది. ఈ హై-ఎండ్ డివైస్‌ను మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నట్లయితే రూ.56,000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది.

గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్ (ప్రారంభ వేరియంట్ ధర రూ.32,299)

గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్ (ప్రారంభ వేరియంట్ ధర రూ.32,299)

అదనపు వారంటీతో లభిస్తోన్న మొదటి జనరేషన్ గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్ బెస్ట్ క్వాలిటీ కెమెరాలతో హై-క్వాలిటీ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేస్తోంది. ఈ హై-ఎండ్ డివైస్ మీ సొంతమవ్వాలంటే రూ.32,299 వరకు వెచ్చించాల్సి ఉంటుంది.

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (ప్రారంభ వేరియంట్ ధర రూ.40,000)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (ప్రారంభ వేరియంట్ ధర రూ.40,000)

ఈ మధ్య కాలంలో లాంచ్ అయిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ఒకటి. గెలాక్సీ ఎస్9 (రూ.58,000) విడుదల నేపథ్యంలో ఈ డివైస్ భారీ ధర తగ్గింపును అందుకుంది. ఈ హై-ఎండ్ డివైస్‌ను మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నట్లయితే రూ.40,000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది.

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 ప్లస్ (ధర రూ.29,990)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 ప్లస్ (ధర రూ.29,990)

వన్‌ప్లస్ 5టీ, ఎల్‌జీ జీ6, హానర్ వ్యూ 10 వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా సామ్‌సంగ్ తన గెలాక్సీ ఏ8 ప్లస్ ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్లో లాంచ్ చేసిన విడుదల చేసింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.35,000గా ఉంది. తాజా తగ్గింపులో భాగంగా రూ.29,990కే ఈ డివైస్ లభ్యమవుతోంది.

 

 

ఎల్‌జీ జీ6 (ధర రూ.27,990)

ఎల్‌జీ జీ6 (ధర రూ.27,990)

మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచపు మొట్టమొదటి బిజిల్ లెస్ డిస్‌ప్లే ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన 5.7 ఇంచ్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, 1440x2880 పిక్సల్స్ రిసల్యూషన్‌తో హై-క్వాలిటీ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

వన్‌ప్లస్ 5టీ (ప్రారంభ వేరియంట్ ధర రూ.30,000)

వన్‌ప్లస్ 5టీ (ప్రారంభ వేరియంట్ ధర రూ.30,000)

మార్కెట్లో వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వన్‌ప్లస్ 5టీ మోడల్‌కు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 8జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.30,000గా ఉంది.

షావోమి రెడ్‌మి 5ఏ (ధర రూ.5,999)

షావోమి రెడ్‌మి 5ఏ (ధర రూ.5,999)

రూ.7,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే షావోమి రెడ్‌మి 5ఏ మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

 

 

షావోమి రెడ్ మి నోట్ 4 (ధర రూ.10,999)

షావోమి రెడ్ మి నోట్ 4 (ధర రూ.10,999)

రూ.11,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రెడ్‌మి నోట్ 4 మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై రన్ అవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని షావోమి ఏర్పాటు చేసింది.

Best Mobiles in India

English summary
10 old smartphones that are worth buying now.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X