Huawei P9 కెమెరా క్వాలిటీ.. 10 శాంపిల్ ఫోటోలు

|

అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం రేపిన Huawei P9 ఇటీవల ఇండియన్ మార్కెట్ల్ విడుదలైన విషయం తెలిసింది. Leica సంస్థ అందించిన శక్తివంతమైన కెమెరా వ్యవస్థతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.39,999. ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ క్వాలిటీ పరంగా సామ్‌సంగ్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్‌లకు సైతం సవాళ్లను విసరుతోంది. ఫోటో కెమెరాల తయారీ విభాగంలో అంతర్జాతీయ శ్రేణి గుర్తింపును సొంతం చేసుకున్న Leica సంస్థ Huawei P9 ఫోన్‌కు కెమెరా లెన్స్‌ను సమకూర్చటమనేది స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ రంగంలోనే విప్లవాత్మక మార్పుగా చెప్పుకొవచ్చు.

 
Huawei P9 కెమెరా క్వాలిటీ.. 10 శాంపిల్ ఫోటోలు

Huawei P9 స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, . స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920× 1080పిక్సల్స్, 423 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కైరిన్ 955 సాక్ విత్ ఆక్టా‌కోర్ 2.5గిగాహెర్ట్జ్ 64 బిట్ ఆర్మ్ బేసిడ్ ప్రాసెసర్‌, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా పెంచుకునే అవకాశం, ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్.

Huawei P9 కెమెరా క్వాలిటీ.. 10 శాంపిల్ ఫోటోలు

Huawei P9 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ కెమెరా Leica lensతో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ అద్బుతమైన ఇమెజ్ క్వాలిటీతో తక్కువ వెళుతురులోని హై క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరాలో Leica SUMMARIT H 1:2.2/27 aspherical లెన్స్‌తో పాటు 1.25 మైక్రాన్ పిక్సల్ వ్యవస్థను నిక్షిప్తం చేసారు. ఈ కెమెరాలో పొందుపరిచిన సెలక్టివ్ ఫోకస్ టెక్నాలజీ ఫీల్డ్ డెప్త్‌ను నేర్పుగా ఉపయోగించుకుని హైక్వాలిటీ ఫోటోగ్రఫీ రిజల్ట్స్‌ను చేరువచేస్తుంది. ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా తరహాలో Bokeh effectsతో ఈ కెమెరా ఫోటోలను క్యాప్చుర్ చేయగలదు. అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను Huawei P9 కెమెరా ఆఫర్ చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. Huawei P9 కెమెరాతో క్లిక్ చేయబడిన పలు శాంపిల్ ఫోటోలను ఇప్పుడు చూద్దాం..

లో లైట్ షాట్

లో లైట్ షాట్

Huawei P9 కెమెరా ద్వారా తక్కువ వెళుతురు కండీషన్‌లో చిత్రీకరించబడిన ఫోటో ఇది.

లాంగ్ షాట్

లాంగ్ షాట్

Huawei P9 కెమెరా వైడర్ ప్రేమ్‌లను కవర్ చేస్తూ లాంగ్ షాట్‌లను అద్భుతంగా క్యాప్చర్ చేయగలదు. 

క్లోజప్ షాట్స్..

క్లోజప్ షాట్స్..

ప్రొఫెష్‌నల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా తరహా ఇమేజ్ క్వాలిటీతో Huawei P9 కెమెరా క్లోజప్ షాట్‌లను క్యాప్చర్ చేయగలదు.

మాక్రో షాట్
 

మాక్రో షాట్

Huawei P9 కెమెరాతో క్యాప్చుర్ చేయబడిన ఈ మాక్రో షాట్‌లో సబ్జెక్ట్ మొత్తం స్పష్టంగా కనిపించటాన్ని మీరు చూడొచ్చు. మాక్రో షాట్ క్యాప్చుర్ చేసేందుకు అవసరమైన కలర్ రిప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా షార్ప్‌నెస్ వంటి అంశాలు P9 కెమెరాలో సమృద్థిగా ఉన్నాయి.

బ్లాక్ అండ్ వైట్ షాట్స్

బ్లాక్ అండ్ వైట్ షాట్స్

Huawei P9 కెమెరా బెస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందుకు ఉదాహరణ ఈ ఫోటోనే..

తక్కువ వెళుతరులో మోనోక్రోమ్ షాట్

తక్కువ వెళుతరులో మోనోక్రోమ్ షాట్

డిమ్ లైటింగ్ కండీషన్‌లోనూ అద్బుతమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను Huawei P9 కెమెరా చిత్రీకరించగలదు.

ఫీల్డ్‌లో మరింత డెప్త్

ఫీల్డ్‌లో మరింత డెప్త్

Huawei P9 కెమెరాలో పొందుపరిచిన రెండు శక్తవంతమైన సెన్సార్లలో ఒకటి సెలెక్టడ్ ఆబ్జెక్ట్‌ను మరింత డెప్త్‌గా మెజర్ చేస్తూ ఇమేజ్ క్వాలిటీని ఏమాత్రం దెబ్బతినకుండా చూస్తుంది.

 Bokeh effect

Bokeh effect

హైప్రొఫైల్ డీఎస్ఎల్ఆర్ కెమెరాలలో ఉండే Bokeh effectలను Huawei P9 కెమెరా మీకు అందించగలదు.

అద్భుతమైన కలర్ రీప్రొడక్షన్

అద్భుతమైన కలర్ రీప్రొడక్షన్

Huawei P9 కెమెరాలో పొందుపరిచిన కలర్ రీప్రొడక్షన్ వ్యవస్థ ఫోటోలను రియలాస్టిక్ అనుభూతులతో మీకు అందిస్తుంది.

పర్‌ఫెక్ట్ సెల్ఫీ షాట్

పర్‌ఫెక్ట్ సెల్ఫీ షాట్

ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అందకు ఉదాహరణే ఈ పర్‌ఫెక్ట్ సెల్ఫీ షాట్.

Best Mobiles in India

English summary
10 Photos show Huawei P9 with dual Leica lense is the best camera phone. Read More in Telugu Gizbot....
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X