Realme 2 Pro మోస్ట్ అడ్వాన్సుడ్ స్మార్ట్‌ఫోన్‌ అనటానికి 10 కారణాలు..

ఒప్పొ సబ్సిడరీ బ్రాండ్ రియల్‌మీ, Realme 2 Pro పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

|

ఒప్పొ సబ్సిడరీ బ్రాండ్ రియల్‌మీ, Realme 2 Pro పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.13,990), 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.15,990), 8జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.17,990). ఈ మూడు వేరియంట్‌లను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. అక్టోబర్ 11 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

రియల్‌మీ 2 ప్రో స్పెసిఫికేషన్స్..

రియల్‌మీ 2 ప్రో స్పెసిఫికేషన్స్..

6.3 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (2340 x 1080పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో అండ్ 409 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, అడ్రినో 512 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం.

 

 

కెమెరా ఇంకా కనెక్టువిటీ ఫీచర్స్..

కెమెరా ఇంకా కనెక్టువిటీ ఫీచర్స్..

16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ VoLTE, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, GLONASS, డ్యుయల్ సిమ్, మైక్రోఎస్డీ స్లాట్, మైక్రో యూఎస్బీ పోర్ట్), ఫోన్ చుట్టుకొలత 156.7 x 74 x 8.5 మిల్లీ మీటర్లు, బరువు 174 గ్రాములు. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ట్యాగ్‌లో మోస్ట్ అడ్వాన్సుడ్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకున్న Realme 2 Pro గురించి పలు ఆసక్తికర విషయాలు మీ కోసం...

 

 

నైట్ షీల్డ్(Night Shield) ఫీచర్..

నైట్ షీల్డ్(Night Shield) ఫీచర్..

రియల్‌మి 2 ప్రో యూజర్లు రాత్రి పూట ఫోన్‌లోని నైట్ షీల్డ్ (Night Shield) ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా డిస్‌ప్లే నుంచి వెలువడే బ్లూ లైట్ వెళుతురును తగ్గించుకుని కంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Display & Brightness → Night Shield ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫీచర్ ఆన్ అవుతుంది.

 

 

క్వైట్ టైమ్ (Quiet Time)

క్వైట్ టైమ్ (Quiet Time)

ఈ ఫీచర్ ఎటువంటి వైబ్రేషన్స్ లేకుండా ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లోకి పెట్టేస్తుంది. కేవలం అలర్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ ఫీచర్ యాక్టివేట్ అయిన వెంటనే చంద్రుడి ఐకాన్ ఒకటి స్టేటస్ బార్ పై డిస్‌ప్లే కాబడుతుంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికి అలారమ్ క్లాక్, కౌంట్‌డౌన్ టైమర్ వంటి ఫీచర్స్ మాత్రం యాక్టివ్ గానే ఉంటాయి. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు కొన్ని కాంటాక్ట్స్‌కు సంబంధించిన కాల్స్ అలానే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ వినిపించేలా సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

 

 

అసిస్టివ్ బాల్ (Assistive Ball)

అసిస్టివ్ బాల్ (Assistive Ball)

ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్ర్కీన్ పై ఎక్కడినుంచైనా నేవిగేట్ చేసుకోవచ్చు. ఏ యాప్‌తోనైనా ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునే క్రమంలో ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Smart & Convenient → Assistive Ballను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

నేవిగేషన్ గెస్ట్యర్స్ (Navigation Keys)

నేవిగేషన్ గెస్ట్యర్స్ (Navigation Keys)

iOS, Android 9 Pie తరహాలో రియల్‌మి 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో లోడ్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ నేవిగేషన్ గెస్ట్యర్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునే క్రమంలో ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Smart & Convenient → Navigation Keysను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

స్మార్ట్ స్లైడ్‌బార్ (Smart Slidebar)

స్మార్ట్ స్లైడ్‌బార్ (Smart Slidebar)

రియల్‌మి 2 ప్రో యూజర్లు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా డివైస్‌లోని యాప్స్ ఇంకా టూల్స్‌ను వేగంగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా మల్టిటాస్కింగ్ సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగడపడుతుంది.ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకునే యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Smart & Convenient → Smart Sliderను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.

 

 

స్క్రీన్ -ఆఫ్ గెస్ట్యర్స్ (Screen-off Gestures)

స్క్రీన్ -ఆఫ్ గెస్ట్యర్స్ (Screen-off Gestures)

రియల్‌మి 2 ప్రో యూజర్లు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే యాక్సిస్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫోన్‌లోని కెమెరా ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే స్క్రీన్ పై ‘O'ను డ్రా చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకునే యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Smart & Convenient → Gesture & Motion → Screen-off Gesturesను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.

 

 

స్మార్ట్ కాల్ (Smart Call)

స్మార్ట్ కాల్ (Smart Call)

రియల్‌మి 2 ప్రో యూజర్లు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే కాల్స్‌ను ఆటోమెటిక్‌గా లిఫ్ట్ చేసే వీలుంటుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకునే యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Smart & Convenient → Gesture & Motion →Smart Callను సెలక్ట్ చేసుకుంటు సరిపోతుంది.

 

 

Best Mobiles in India

English summary
10 Realme 2 Pro tips and tricks to get the most out of the smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X