Home
Mobile

ఆండ్రాయిడ్ పై గూగుల్ పట్టు కోల్పోతుందా..?

మాల్వేర్లు నిత్యం ఈ ఓఎస్‌ను చుట్టుముడుతూనే ఉన్నాయి.

By Sivanjaneyulu Bommu

ప్రపంచపువ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఒకటి. నిత్యం సరికొత్త అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైలింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోన్న గూగుల్‌కు ముందుగా మనం హ్యాట్సాఫ్ చెప్పుకోవాలి. ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ OEMs అలానే developersకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Read More : రిలయన్స్ జియో, గూగుల్ కాంభినేషన్‌లో స్మార్ట్‌ఫోన్

నాణానికి ఒకవైపు మాత్రమే...

నాణానికి ఒకవైపు మాత్రమే...

అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. కన్స్యూమర్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై గూగుల్ నియంత్రణ కోల్పోవటానికి గల 10 కారణాలను ఇప్పుడు చూద్దాం...

ఇప్పటికి లాలీపాప్ వర్షనే వాడుతున్నారు..

ఇప్పటికి లాలీపాప్ వర్షనే వాడుతున్నారు..

Android N మార్కెట్లో లాంచ్ అయిన కొన్ని నెలల కావొస్తుంది.  ఈ ఓఎస్‌కు ముందు వర్షన్‌గా వచ్చిన Android Marshmallowను కేవలం 7.5శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే ఉపయోగించుకుంటున్నారట. చాలా వరకు ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికి లాలీపాప్ లేదా కిట్‌క్యాట్ వర్షన్‌నే ఉపయోగించుకుంటున్నారట.

పాతది వాడకముందే కొత్తది..

పాతది వాడకముందే కొత్తది..

చాలా వరకు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు కొత్త ఫోన్‌ల రిలీజ్ విషయంలో సందిగ్థతకు లోనవుతున్నాయట. తమ కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ ఆప్షన్ ఇచ్చే‌కంటే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్‌తోనే లాంచ్ చేస్తేనే బాగుంటుందని ఆలోచిస్తున్నాయట. దీంతో యూజర్లు పాత వర్షన్‌లు వాడకుండానే కొత్త వర్షన్‌కు జంప్ అవ్వాల్సి వస్తోంది.

అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి..

అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి..

గూగుల్ నెక్సుస్ బ్రాండ్ నుంచి విడుదలయ్యే ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌ను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. గూగుల్ తన ఆండ్రాయిడ్ సక్సెస్‌ను స్మార్ట్‌వాచ్‌లకు విస్తరింపచేసింది. ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టంతో మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌వాచ్‌లకు ప్రస్తుతం డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంది.

లుక్ ఇంకా ఫీల్ పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం..

లుక్ ఇంకా ఫీల్ పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం..

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌లలో లుక్ ఇంకా ఫీల్ పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం కారణంగా చాలా వరకు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమకంటూ ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ స్కిన్‌లను ఎంపిక చేసుకుంటున్నాయి.

ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ అంతగా సఫలం కాలేదు..

ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ అంతగా సఫలం కాలేదు..

గూగుల్ నెక్సుస్ ఐడియాను తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అమలు చేసే ఉద్దేశ్యంతో గూగుల్ తీసుకువచ్చిన ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ అంతగా సఫలం కాలేదు.

ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటంతో...

ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటంతో...

గూగుల్ ఆండ్రాయిడ్, ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటంతో ఎవరైనా దీనికి యాప్‌ను తయారు చేయవచ్చు. ఈ వెసలబాటును తమకు అనుగుణంగా మలచుకుంటున్న ముష్కర సంస్థలు ప్రత్యేకమైన యాప్స్ ద్వారా తమ ప్రచారాలను సాగించుకుంటున్నాయి.

సెక్యూరిటీ పెద్ద సవాల్‌

సెక్యూరిటీ పెద్ద సవాల్‌

ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సెక్యూరిటీ పెద్ద సవాల్‌గా మారింది. అనేక మాల్వేర్లు నిత్యం ఈ ఓఎస్‌ను చుట్టుముడుతూనే ఉన్నాయి.

Best Mobiles in India

English summary
10 reasons how Google is losing control on Android. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X