షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

Posted By:

యాపిల్, గూగల్.. సిలికాన్ వ్యాలీకి చెందిన ఈ రెండు దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు చైనా కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురువుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో యాపిల్‌కు చైనా‌కు చెందిన షియోమీ గట్టిపోటీనిస్తోంది. అనతికాలంలోనే ప్రపంచపు మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌‌ల తయారీ కంపెనీగా అవతరించిన షియోమీ, యాపిల్ ఐఫోన్ 6 ప్లస్‌కు పోటీగా ‘ఎంఐ నోట్' పేరుతో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌ను గురువారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
తమ ‘ఎంఐ నోట్' ఫోన్‌ను ఈ ఏడాదికిగాను అత్యుత్తమ డివైస్‌‍గా షియోమీ అభివర్ణించుకుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో అత్యుత్తమ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి ఏ మాత్రం సందేహం లేదు!. షియోమీ ఎమ్ఐ నోట్, ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

డిజైన్

షియోమీ ఎమ్ఐ నోట్ ఏ మాత్రం కాపీ డివైస్‌లా కనిపించదు. మెటల్ ఫ్రేమ్‌తో ఫోన్ ఒరిజినల్ డిజైన్, గ్లాస్‌తో తయారు కాబడిన బ్యాక్ కవర్ కొత్త ఫీలింగ్‌కు లోను చేస్తాయి.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

బిల్డ్ క్వాలిటీ

షియోమీ ఎమ్ఐ నోట్ ఫోన్ మందం కేవలం 6.95 మిల్లీమీటర్లు, బరువు 161 గ్రాములు. ఇదే సమయంలో యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ 7.1మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన కాబడింది. బరువు 172 గ్రాములు.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

డిస్‌ప్లే

షియోమీ ఎమ్ఐ నోట్ 5.7 డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్. షియోమీ ఎమ్ఐ నోట్ ప్యానల్‌ను జపాన్ డిస్‌ప్లే సమకూర్చింది. యాపిల్ ఐఫోన్ 6ప్లస్ పూర్తి రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

ప్రాసెసర్

షియోమీ ఎమ్ఐ నోట్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 3జీబి ర్యామ్ వేరియంట్ 2.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 2జీబి వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరోవైపు యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ 1జీబి ర్యామ్‌తో కూడిన యాపిల్ ఏ8 డ్యుయల్ కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

4జీ ఎల్టీఈ

షియోమీ ఎమ్ఐ నోట్‌లో ఏర్పాటు చేసిన 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్‌లను ఆఫర్ చేస్తుంది. ఇదే కమ్రంలో యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ఎల్టీఈ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

కెమెరా

షియోమీ ఎమ్ఐ నోట్ ఫోన్‌లో 13 మెగా పిక్సల్ రేర్ కెమెరాతో పాటు 4 మెగా పిక్సల్ ప్రంట్ అల్ట్రా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు. సోనీ ఐఎమ్ఎక్స్ 214 సెన్సార్, ఆప్టికల్ స్టెబిలైజేషన్, ఫిలిప్స్ టూ టోన్ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలను ఈ కెమెరా కలిగి ఉంటుంది. యాపిల్ ఐఫోన్ 6 ప్లస్‌లో ఏర్పాటు చేసిన కెమెరా ఓఐఎస్, డ్యుయల్ ఎల్ఈడి ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

స్టోరేజ్

షియోమీ ఎమ్ఐ నోట్ 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌకర్యంతో ఫోన్ మెమరీని మరింతగా పెంచుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ 16, 64 ఇంకా 128జీబి మెమరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

సాఫ్ట్‌వేర్

షియోమీ ఎమ్ఐ నోట్ తన సొంత యూఐ ఎమ్ఐయూఐ స్కిన్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారం)తో పనిచేస్తుంది. ఇదే క్రమంలో యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

బ్యాటరీ

షియోమీ ఎమ్ఐ నోట్‌లో క్విక్‌చార్జ్ 2.0 సాంకేతికతతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీని ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ 2915 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.

షియోమీ ఎమ్ఐ నోట్: ఐఫోన్ 6 ప్లస్‌కు బెస్ట్ పోటీ అనటానికి 10 కారణాలు

ధరలు

చైనా మార్కెట్లో షియోమీ ఎమ్ఐ నోట్ 16జీబి వేరియంట్ ధర ¥2299 (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.22,917), 64జీబి వేరియంట్ ధర ¥2799 (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.27,901). భారత్ మార్కెట్లో ఐఫోన్ 6 ప్లస్ రూ.62,000 ప్రారంభ ధర నుంచి లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Reasons Xiaomi Mi Note is the Best iPhone 6 Plus Alternative. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot