ఫోన్ కేక.. కెమెరా ఇంకా కేక

హువావే తన ఆన్‌‍లైన్ బ్రాండ్ హానర్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Honor 5C స్మార్ట్‌ఫోన్ రాకింగ్ స్పెసిఫికేషన్‌లతో ఆకట్టుకుంటోంది. రూ.10,999 ధర ట్యాగ్ తో లభ్యమవుతోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్ బస్టర్ ఫోన్ ప్రపంచపు శక్తివంతమైన Kirin 650 చిప్‌సెట్‌తో వస్తోంది. ఒక్క చిప్‌సెట్ మాత్రమే కాదు అనేక ఆసక్తికర స్పెసిఫికేషన్‌లు ఈ ఫోన్‌లో దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

 ఫోన్ కేక.. కెమెరా ఇంకా కేక

Read More: ఓటరు ఐడీతో ఆధార్ లింక్ చేయడం ఎలా..?

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. డిస్‌ప్లే రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x 1080 పిక్సల్స్, ట్రాన్స్‌లేట్ చేస్తే 424 పీపీఐ. ఈ డిస్‌ప్లేను గొప్ప విజువల్ ట్రీట్‌గా చెప్పుకోవచ్చు. మంచి రిసల్యూషన్, పిక్షర్ క్వాలిటీ, కలర్ రీప్రొడక్షన్, వ్యూవింగ్ యాంగిల్స్ వంటి అంశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఆక్టా కోర్ సీపీయూ ఇంకా 16ఎన్ఎమ్ ప్రాసెసింగ్ పవర్‌తో డిజైన్ చేసిన కైరిన్ 650 చిప్‌సెట్ ను హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు.

Read More: రూ.13,290కే పానాసోనిక్ Eluga Note

 ఫోన్ కేక.. కెమెరా ఇంకా కేక

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్ కంటే మెరుగైన పనితీరును 650 చిప్‌సెట్ కనబర్చలదని కంపెనీతో చెబుతోంది. కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగంతో పనిచేయగలదట. ఈ చిపెసెట్‌తో పెయిర్ చేసిన మాలీ - టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్ ప్రియులకు చక్కటి విందు. హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్.. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Read More: ఫోన్ మాట్లాడుతూనే నెంబర్ సేవ్ చేయటం ఎలా..?

 ఫోన్ కేక.. కెమెరా ఇంకా కేక

కెమెరా విషయానికొస్త ఫోన్ హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్, పీడీఏఎఫ్, నైట్ మోడ్, గుడ్ ఫుడ్ మోడ్, బ్యూటీ మోడ్, లైట్ పెయింటింగ్ మోడ్ వంటి పీచర్లు ఫోన్ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి. హానర్ 5సీ కెమెరా ద్వారా చిత్రీకరించబడిన 10 శాంపిల్ ఫోటోలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

అద్భుతమైన రంగులను ఉత్పత్తి చేసిన షార్ప్ ఫోటోలను చిత్రీకరించ గల సామర్థ్యంలో ఈ ఫోన్ కెమెరాలో ఉంది. 

#2

హానర్ 5సీ ఫోన్‌తో పూల మొక్కను చిత్రీకరించిన తీరు. 

#3

సూపర్ క్లారిటీ ఫోటోలు హానర్ 5సీ ఫోన్‌తో సాధ్యం

#4

అద్భుతమైన రంగులను ఉత్పత్తి చేసిన షార్ప్ ఫోటోలను చిత్రీకరించ గల సామర్థ్యంలో ఈ ఫోన్ కెమెరాలో ఉంది.

#5

తక్కువ వెళుతురలోనూ క్వాలిటీ ఫోటోగ్రఫీ

#6

తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

#6

నాణ్యమైన కెమెరా ఫోకస్,

#7

హానర్ 5సీ మైక్రో షాట్

#8

హానర్ 5సీ ఫోన్‌తో చిత్రీకరించిన లాంగ్ షాట్

#9

హానర్ 5సీ ఫ్రంట్ కెమెరాతో చిత్రీకరించిన portrait shot

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Sample Shots show Honor 5C's camera prowess. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot