ఈ సంవత్సరం లాంచ్ అయిన 10 సంచలన స్మార్ట్‌ఫోన్‌లు!

|

టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటోన్న విప్లవాత్మక ఆవిష్కరణలు స్మార్ట్‌ఫోన్‌లను మరింత ట్రెండీగా మార్చేస్తున్నాయి. వెలుగులోకి వస్తోన్న కొత్తకొత్త ఫీచర్లు స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత క్రియాశీలకం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకున్న పోటీ మార్కెట్ నేపథ్యంలో ఆయా కంపెనీలు అత్యాధునిక సౌకర్యాలతో స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా 2018కుగాను మార్కెట్లో లాంచ్ అయిన 10 సంచలన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఆకట్టుకునే ఫీచర్లతో Vivo Nex, జూలై19న లాంచ్ఆకట్టుకునే ఫీచర్లతో Vivo Nex, జూలై19న లాంచ్

వివో ఎక్స్20 ప్లస్ యూడి (Vivo X20 Plus UD)

వివో ఎక్స్20 ప్లస్ యూడి (Vivo X20 Plus UD)

ఈ ఏడాదికి గాను మార్కెట్లో లాంచ్ అయి పెను సంచలనం రేపిన స్మార్ట్‌ఫోన్‌లలో Vivo X20 Plus UD ఒకటి. ఇన్-స్ర్కీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సౌకర్యంతో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా వివో ఎక్స్20 ప్లస్ యూడి గుర్తింపు తెచ్చుకుంది.

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ (Apple iPhone X)

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ (Apple iPhone X)

ఆపిల్ ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 సంవత్సరాల పూర్తయిన సందర్బాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ లాంచ్ చేసిన స్పెషల్ ఎడిషన్ ఫోన్ ఐఫోన్ ఎక్స్ ఓ సరికొత్త ఫీచర్‌తో సందడి చేస్తోంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన యానిమోజీ (Animoji) అనే ఫీచర్ మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ను బట్టి ఓ యానిమేటెడ్ ఐకాన్‌ను రీక్రియేట్ చేయగలుగుతుంది.

హువాయి పీ20 ప్రో (Huawei P20 Pro)
 

హువాయి పీ20 ప్రో (Huawei P20 Pro)

హువాయి సంస్థ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో పీ20 ప్రో ఒకటి. ట్రిపుల్ రేర్ కెమెరా సపోర్ట్‌తో లాంచ్ అయిన ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఈ డివైస్ గుర్తింపుతెచ్చుకుంది. ఈ పోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన ట్రిపుల్ కెమెరా 40 మెగా సెన్సార్ + 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

హెచ్‌టీసీ యూ11 (HTC U11)

హెచ్‌టీసీ యూ11 (HTC U11)

హెచ్‌టీసీ బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో హెచ్‌టీసీ యూ11 ఒకటి. స్క్వీజబుల్ సైడ్స్ (Squeezable sides)తో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఈ డివైస్ గుర్తింపుతెచ్చుకుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎడ్జ్ సెన్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసకోవటం స్క్వీజబుల్ సైడ్స్ ఎనేబుల్ అవుతాయి. ఆ తరువాత నంచి చేతులతో ఫోన్ సైడ్ భాగాల పై ఒత్తిడి పెంచటం ద్వారా యాప్ప్ యాక్టివేట్ అవుతాయి.

 ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ (Asus Zenphone AR)

ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ (Asus Zenphone AR)

ఆసుస్ బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ (Asus Zenphone AR) ఒకటి. గూగుల్ ట్యాంగో అనుబంధ వాస్తవికత టెక్నాలజీ వస్తోన్న ఈ ఫోన్ కు 8జీబి ర్యామ్ అదనపు సపోర్టుగా నిలుస్తుంది.

ఎల్‌జీ జీ6 (LG G6)

ఎల్‌జీ జీ6 (LG G6)

ఎల్‌జీ బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో ఎల్‌జీ జీ6 ఒకటి. డాల్బీ విజన్ వ్యూవింగ్ టెక్నాలజీతో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్‌‌గా ఈ డివైస్ గుర్తింపు తెచ్చుకుంది. 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ‘ఫుల్ విజన్' డిస్‌ప్లే ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది.

హువాయి పీ10 ప్లస్ (Huawei P10 Plus)

హువాయి పీ10 ప్లస్ (Huawei P10 Plus)

Huawei బ్రాండ్ నుంచి ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో హువాయి పీ10 ప్లస్ ఒకటి. 4.5G ఎల్టీఈ కనెక్టువిటీ సపోర్ట్‌తో వచ్చిన మొట్టమొదటి మొట్టమొదటి ఫోన్‌‌గా ఈ డివైస్ అవతరించింది. 4జీబి ఇంకా 6జీబి ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

జెడ్‌టీఈ జిగాబైట్ ఫోన్ (ZTE Gigabit Phone)

జెడ్‌టీఈ జిగాబైట్ ఫోన్ (ZTE Gigabit Phone)

జెడ్‌టీఈ బ్రాండ్ నుంచి ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో జెడ్‌టీఈ జిగాబైట్ ఫోన్ ఒకటి. 5G కనెక్టువిటీ సపోర్ట్‌తో వచ్చిన మొట్టమొదటి మొట్టమొదటి ఫోన్‌‌గా ఈ డివైస్ గుర్తింపుతెచ్చుకుంది. మొదటి తరం 4జీ సర్వీసులతో పోలిస్తే 10 రెట్లు వేగంగా ఈ 5జీ నెట్‌వర్క్ స్పందిస్తుంది.

 సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియమ్ (Sony Xperia XZ Premium)

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియమ్ (Sony Xperia XZ Premium)

సోనీ బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లోకి అడుగుపెట్టిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియమ్ ఒకటి. 4కే హెచ్ డీఆర్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ ట్రేడ్ షోలో భాగంగా సోనీ ఆవిష్కరించింది.

బ్లాక్‌బెర్రీ కీవన్ (BlackBerry KEYone)

బ్లాక్‌బెర్రీ కీవన్ (BlackBerry KEYone)

బ్లాక్‌బెర్రీ బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లోకి అడుగుపెట్టిన సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో బ్లాక్‌బెర్రీ కీవన్ ఒకటి. ఈ కీప్యాడ్ ఫోన్‌లో మొత్తం 54 షార్ట్‌కట్స్ అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
10 smartphones with the ‘world’s-first’ features launched this year more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X