Home
Mobile

2018లో స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయమైన 10 విప్లవాత్మక ఫీచర్లు..

ఆకాశమే హద్దుగా దూసుకుపోతోన్న స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి 2018 మరో మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాదికిగాను అనేక మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త ఫీచర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యాయి.

ఆకాశమే హద్దుగా దూసుకుపోతోన్న స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి 2018 మరో మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాదికిగాను అనేక మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త ఫీచర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యాయి. వాటిలో 10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రిట్రాక్టబుల్ కెమెరాతో వికో నెక్స్ ఎస్ (Vivo NEX S with Retractable camera)

రిట్రాక్టబుల్ కెమెరాతో వికో నెక్స్ ఎస్ (Vivo NEX S with Retractable camera)

2018కి గాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లలో వికో నెక్స్ ఎస్ (Vivo NEX S) ఒకటి. హయ్యర్-స్ర్కీన్ బాడీ రేషియోతో వస్తోన్న ఈ డివైస్‌ డిస్‌ప్లే పై ఎటువంటి నాట్చ్ ఉండదు. ఇదే సమయంలో ఫ్రంట్ కెమెరా కూడా ఉండదు. సెల్ఫీ షూట్‌లను క్యాప్చుర్ చేసుకునే సమయంలో మాత్రమే కెమెరా పైకి వస్తుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్ హై-క్వాలిటీ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఒప్పో ఆర్ 17 ప్రో విత్ సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ (Oppo R17 Pro with SuperVOOC Flash charging)

ఒప్పో ఆర్ 17 ప్రో విత్ సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ (Oppo R17 Pro with SuperVOOC Flash charging)

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఒప్పో ఆర్ 17 ప్రో ఒకటి. సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని 40 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అయి పోతుంది.

 

 

హువావే పీ20 ప్రో విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ (Huawei P20 Pro with 3x optical zoom)

హువావే పీ20 ప్రో విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ (Huawei P20 Pro with 3x optical zoom)

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో హువావే పీ20 ప్రో. ఈ ఫోన్ లో ఎక్విప్ చేసిన 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ జూమ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయటంతో పాటు హై-క్వాలిటీ ఫోటోగ్రాఫ్‌లను చిత్రీకరించుకునేందుకు దోహదపడుతుంది.

 

 

నాలుగు కెమెరాలతో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 (2018)

నాలుగు కెమెరాలతో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 (2018)

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 (Samsung Galaxy A9 2018) ఒకటి. ఈ ఫోన్ వెనుక భాగంలో మొత్తం నాలుగు కెమెరాలు అమర్చబడి ఉంటాయిగెలాక్సీ ఏ9 వెనుక భాగంలో ఎక్విప్ చేసిన నాలుగు కెమెరాలు వేరువేరు సెన్సార్లను కలిగి ఉంటాయి. అల్ట్రావైడ్, టెలీఫోటో, మెయిన్ ఇంకా డెప్త్ సెన్సార్లను ఈ నాలుగు కెమెరాలలో సామ్‌సంగ్ నిక్షిప్తం చేసింది. ఈ నాలుగు కెమెరాలు ఒకే ఆర్డర్‌లో ప్లేస్ అయి ఉంటాయి. వీటిలో అల్ట్రావైడ్ లెన్స్ మరిన్ని అబెక్ట్స్‌ను ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చి వాటిని క్యాప్చుర్ చేయగలుగుతుందని సామ్‌సంగ్ చెబుతోంది. పానోరమా షాట్స్‌ను చిత్రీకరించే సమయంలో అల్ట్రావైడ్ లెన్స్ ఫ్రేమ్‌ను మరింత డిటెయిల్డ్‌గా అందించగలుగుతుందట.

 

 

షావోమి ఎంఐ మిక్స్ 3 (Xiaomi Mi MIX 3)

షావోమి ఎంఐ మిక్స్ 3 (Xiaomi Mi MIX 3)

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో షావోమి ఎంఐ మిక్స్ 3 (Xiaomi Mi MIX 3) ఒకటి. స్లైడర్ మెకనిజం ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మెకనిజం కారణంగా డివైస్‌ డిస్‌ప్లే పై ఎటువంటి నాట్చ్ కనిపించదు. ఇదే సమయంలో ఫ్రంట్ కెమెరా కూడా ఉండదు. ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్ హై-క్వాలిటీ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఐఫోన్ ఎక్స్‌ఎస్ విత్ ఈ-సిమ్

ఐఫోన్ ఎక్స్‌ఎస్ విత్ ఈ-సిమ్

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఐఫోన్ ఎక్స్‌ఎస్ (iPhone XS) ఒకటి.ఈ ఫోన్‌ e-SIM టెక్నాలజీతో కూడిన నేటివ్ డ్యుయల్ సిమ్ కార్డ్ లను సపోర్ట్ చేస్తుంది.ఈ e-SIMను ఐఫోన్ ఎక్స్ఎస్‌తో పాటు ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ ఇంకా ఐఫోన్ ఎక్స్ఆర్ డివైసెస్‌లో ఉపయోగించుకోవచ్చు.

 

 

హువావే మేట్ 2 ప్రో (Huawei Mate 20 Pro)

హువావే మేట్ 2 ప్రో (Huawei Mate 20 Pro)

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో హువావే మేట్ 2 ప్రో (Huawei Mate 20 Pro) ఒకటి.ఈ స్మార్ట్‌ఫోన్ రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైస్‌లో లోడ్ చేసిన 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 40వాట్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ ఇంకా 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ఇతర క్యూఐ వైర్‌లెస్ డివైస్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టును ఈ ఫోన్‌లో కల్పించారు.

 

 

ఆసూస్ రోగ్ ఫోన్ (Asus ROG Phone)

ఆసూస్ రోగ్ ఫోన్ (Asus ROG Phone)

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఆసూస్ రోగ్ ఫోన్(Asus ROG Phone). ఈ గేమింగ్ ఫోన్ లో కస్టమైజ్ చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్ ఏకంగా 2.96 GHz క్లాక్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ అందించగలిగే అదనపు పవర్ గేమింగ్‌ను మరింత మెరుగుపరస్తుంది.

 

 

రెడ్ హైడ్రోజెన్ వన్ (Red Hydrogen One)

రెడ్ హైడ్రోజెన్ వన్ (Red Hydrogen One)

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో రెడ్ హైడ్రోజెన్ వన్ (Red Hydrogen One) ఒకటి. హోలోజెనిక్ డిస్ ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ 3డీ గ్లాసెస్ అవసరం లేకుండా కంటెంట్‌ను 3డీ ఫార్మాట్‌లో ప్రదర్శిస్తుంది.

 

 

మోటో జెడ్ 4 (Moto Z4 )

మోటో జెడ్ 4 (Moto Z4 )

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మోటో జెడ్ 4. మోటరోలా సంస్థ తాజాగా ఈ ఫోన్ కు సంబంధించి 5G MODను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మోడ్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలుగుతుంది.

 

 

Best Mobiles in India

English summary
10 smartphones with unique innovations launched in 2018.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X