ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. గూగుల్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్ ప్ర్రాథమిక దశలో భాగంగా లెటెస్ట్ వర్షన్ నెక్సూస్ అలానే గూగుల్ ప్లే ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్ ద్వారా అందుతోది. సామ్‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ, సోనీ వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ అప్‌డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆస్తికర ఫీచర్లను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ ఇన్‌బుల్ట్ ఫ్లాష్‌లైట్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో లోపించింది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన టెక్నాలజీ ఫోన్ బ్యాటరీ మార్పులకు సంబంధించి ఓ నిర్థిష్టమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ‘ఫోన్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ చార్జింగ్ ఎంత సేపు వస్తుంది'. ‘బ్యాటరీ చార్జ్ అవటానికి ఎంత టైమ్ పడుతుంది', తదితర బ్యాటరీ సంబంధిత సమచారాన్ని మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై చూసుకోవచ్చు. ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో లోపించింది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ విండోస్ తరహాలోనే గెస్ట్ యూజర్ మోడ్‌ను ప్రవేశపెట్టింది. గెస్ట్ యూజర్ మోడ్‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు ఎంత వరకు వీక్షించాలో కూడా నిర్ధేశించుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో కొత్త గెస్ట్‌ను జత చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి - యూజర్స్ - యాడ్ గెస్ట్‌లోకి వెళ్లండి.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ తమ యూజర్లకు నవీకరించబడిన ఫ్లాపీబర్డ్ ఈస్టర్ ఎగ్ గేమ్‌ను అందిస్తోంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో కిట్‌క్యాట్ కంటే భిన్నమైన నోటిఫికేషన్ ప్యానల్‌ను డిజైన్ చేసారు. ఈ సరికొత్త నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా ఫోన్ స్ర్కీన్ లాక్ చేసి ఉన్నప్పటికి వివరణాత్మక నోటిఫికేషన్లను తెర పై చూడొచ్చు. పని ప్రాంగణాల్లో ఈ ఫీచర్ ఇబ్బంది అనుకుంటే Settingsలోని Sound and Notificationలోకి ప్రవేశించి When device is Locked - Don't show notifications at allను సెలక్ట్ చేసుకుంటే లాక్ చేసి ఉన్న మీ ఫోన్ స్ర్కీన్ ఏ విధమైన స్పెసిఫికేషన్‌లు కనిపించవు.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
Trusted Places పేరుతో సరికొత్త స్మార్ట్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌లో ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేసిన లోకేషన్‌లను ఎవరికంటాపడకుండా సురిక్షితంగా ఉంచుకోవచ్చు. Trusted Places ఫీచర్‌లో భాగంగా లొకేషన్‌ను సెట్ చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ఆప్షన్‌లోకి ప్రవేశించి స్మార్ట్‌లాక్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లోని ఆసక్తికర ఫీచర్లు
బరస్ట్ మోడ్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్‌ను ఈ ఓఎస్‌లో ఏర్పాటు చేసారు. అంటే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచినంత సేపూ ఫోటోలను చిత్రీకరిస్తూనే ఉంటుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications