కొత్త ఐఫోన్ కొంటున్నారా..? ఈ 10 విషయాలు గుర్తు పెట్టుకోండి

|

యాపిల్ సంస్థ నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయిన లేటెస్ట్ ఐఫోన్ మోడల్, iPhone 8 మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ అధునాతన ఐఫోన్ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నట్లయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే. యాపిల్ ఐఫోన్‌లను రెగ్యులర్‌గా యూజ్ చేసే వారు ఎలాంటి ఐఫోన్ మోడల్ ను అయినా సులువుగా హ్యాండిల్ చేయగలుగుతారు.

10 things to do first after buying an iPhone

అయితే ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగించి కొత్తగా ఐఫోన్‌కు స్విచ్ అవుతున్న వారు మాత్రం ఐఫోన్ వినియోగం విషయంలో కొన్ని మెళుకువలు తెలుసుకోవల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్లు చాలా భిన్నంగాను ఇదే సమయంలో చాలా ప్రొఫెషనల్‌గాను అనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా యాపిల్ ఐఫోన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న వారు, ఐఫోన్‌ కొనుగోలు చేసిన వెంటనే ప్రాథమికంగా చేయవల్సిన 10 ముఖ్యమైన పనులు..

Apple IDని క్రియేట్ చేయండి

Apple IDని క్రియేట్ చేయండి

కొత్త ఐఫోన్ చేతికందిన వెంటనే మీరు చేయవల్సిన మొదటి పని Apple IDని క్రియేట్ చేసుకోవటం. యాపిల్ ఐఫోన్‌లను వినియోగించే ప్రతిఒక్కరూ mandatoryగా యాపిల్ ఐడీని తమ పేరుమీద క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. యాపిల్ ఐడీని క్రియేట్ చేసుకోని పక్షంలో Apple Store నుంచి యాప్స్

డౌన్‌లోడ్ చేసుకోవటం కుదరదు. ఐట్యూన్స్ నుంచి మ్యూజిక్ అలానే సినిమాలను పొందటం కుదరదు. కాబట్టి తప్పనిసరిగా Apple IDని క్రియేట్ చేసుకోండి.

iTunesను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి

iTunesను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి

యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే Apple IDని క్రియేట్ చేసుకోవటంతో పాటు iTunes యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఫోన్‌ను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకుని మీ ఫోన్‌లోని మ్యూజిక్ అలానే వీడియో డేటాను కంప్యూటర్‌లో సేవ్ చేసుకునే వీలుంటుంది.

 System Settings ద్వారా ఫోన్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది

System Settings ద్వారా ఫోన్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది

పైన పేర్కొన్న రెండు పనులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మూడవ స్టెప్ క్రింద System Settings ద్వారా ఐఫోన్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. Fundamentals setting ద్వారా ఈ బేసిక్ సెటప్ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. ఫోన్ యాక్టివేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయటం ద్వారా FaceTime, Find My iPhone, IMessage తదిరత ఫీచర్లను మీరు వినియోగించుకోగలుగుతారు.

Synchronize చేయవల్సి ఉంటుంది

Synchronize చేయవల్సి ఉంటుంది

ఐఫోన్‌లో Apple ID, iTunes వ్యవస్థలను ఇన్‌స్టాల్ చేసిన తరువాత వాటిలో కంటెంట్ లోడ్ అవుతుంటుంది. ఈ క్రమంలో కంప్యూటర్‌కు కనెక్ట్ చేసిన వెంటనే ఫోన్‌ Synchronize అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవల్సి ఉంటుంది.

రోజుకి 1 జిబి కాదు, 4జిబి డేటా.. Airtel సరికొత్త ఆఫర్రోజుకి 1 జిబి కాదు, 4జిబి డేటా.. Airtel సరికొత్త ఆఫర్

Find My iPhone Optionను సెటప్ చేసుకోండి

Find My iPhone Optionను సెటప్ చేసుకోండి

Find My iPhone Optionను సెటప్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్ లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయబడుతుంది. పొరపాటున మీ ఫోన్ మిస్ అయినప్పటికి ఈ ఫీచర్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకునే వీలుంటుంది. ఫోన్ iCloud విభాగంలో Find My iPhone ఫీచర్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్, మీ ఫోన్ నిమిత్తం ఓ జీపీఎస్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తుంది. మ్యాప్ ద్వారా ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్ చేసుకునే వీలుంటుంది.

 iCloud ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసుకోండి

iCloud ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసుకోండి

మీ ఐఫోన్‌లోని iCloud ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటాను ఎప్పటికప్పుడు యాపిల్ సర్వర్‌లో భద్రపరుచుకునే వీలుటుంది.

Touch IDని క్రియేట్ చేసుకోండి

Touch IDని క్రియేట్ చేసుకోండి

మీ కొత్త ఐఫోన్‌కు సంబంధించి Touch ID (Fingerprint Scanner) ఫీచర్‌ను సెటప్ చేసకోవాలంటే ఫోన్ Settings> General> Touch ID & Passcode> Touch IDలోకి వెళ్లి ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ హోమ్ బటన్ ద్వారా ఈ ఫీచర్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది.

బ్యాకప్ డేటాను రీస్టోర్ చేసుకోండి

బ్యాకప్ డేటాను రీస్టోర్ చేసుకోండి

మీ పాత ఐఫోన్‌లోని డేటాను కొత్త ఐఫోన్‌లోకి బ్యాకప్ చేసుకోవాలంటే ఫోన్ Settings> iCloud> Backupను సెలక్ట్ చేసుకున్నట్లయితే పాత ఐఫోన్‌లోని డేటాను కొత్త ఐఫోన్‌లోకి బ్యాకప్ కాబడుతుంది.

కొత్త యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

కొత్త యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

Apple Storeలోకి వెళ్లటం ద్వారా మీకు కావల్సిన కొత్త యాప్‌లను పొందే వీలుంటుంది. వీటిలో కొన్ని యాప్స్ ఉచితంగా లభిస్తే, మరి కొన్నింటిని మాత్రం కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

 పాత ఐఫోన్ డేటాను డిలీట్ చేయాలంటే

పాత ఐఫోన్ డేటాను డిలీట్ చేయాలంటే

మీ పాత ఐఫోన్‌లోని డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నట్లయితే ఫోన్ Settings -> General -> Reset -> Erase all content optionను సెలక్ట్ చేయండి. పాత ఐఫోన్‌ తాలుకా డేటా మొత్తం డిలీట్ కాబడుతుంది.

Best Mobiles in India

English summary
10 Things To Do After Buying a iPhone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X