ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

Written By:

ప్రపంచపు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసి ఇజ్రాయెల్‌కు చెందిన సిరిన్ ల్యాబ్స్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. ఆధునిక హంగులతో ఈ సంస్థ పరిచయం చేసిన 'సొలారిన్'ఫోన్ ధర ఏకంగా 14,000 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా రూ.9 లక్షలు. ఈ కాస్ట్లీ ఆండ్రాయిడ్ ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

Read More : పోయిన ఫోన్‌ను నిమిషాల్లో ట్రేస్ చేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెక్యూరిటీ ప్రధాన అంశంగా...

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

సెక్యూరిటీ ప్రధాన అంశంగా రూపొందించబడిన ఈ ఫోన్ లో ఇప్పటి వరకు అందుబాటులో లేని అడ్వాన్సుడ్ ప్రైవసీ టెక్నాజీని సిరిన్ ల్యాబ్స్ పొందుపరిచింది. 256 బిట్ లెవల్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థతో వస్తున్న ఈ ఫోన్ బలోపేతమైన రక్షణ సాంకేతిక వ్యవస్థలను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

సొలారిన్ ఫోన్ 2గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2015లో విడుదలైన ఈ ప్రాసెసర్ పలు హీటింగ్ అలానే లాగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు యూజర్లు చెబుతున్నారు. సోలారిన్ ఫోన్ అందుబాటులో ఉన్న 24 బ్యాండ్ లకు సంబంధించిన 4జీ ఎల్టీఈని సపోర్ట్ చేస్తుంది.

 

పొదునైన కెమెరా క్వాలిటీ

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

సొలారిన్ ఫోన్ శక్తివంతమైన 23.8 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్‌తో వస్తోంది. లేజర్ ఆటో ఫోకస్, ఫోర్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, HDR మోడ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో పొందుపరిచారు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బెస్ట్ క్వాలిటీ పనితీరును కనబరుస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లాష్, ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ప్రత్యేకతలను ఈ కెమెరాలో పొందుపరిచారు.

 

దృఢమైన శరీరతత్వం

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

250 గ్రాముల బరువు, 78 మిల్లీ మీటర్ల వెడల్పుతో సొలారిన్ ఫోన్  బల్కీగా కనిపిస్తోంది.

డిస్‌ప్లే విషయానికొస్తే...

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

సొలారిన్ ఫోన్ 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం2560x 1440పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 డిస్‌ప్లేకు రక్షణ కవచంలా ఉంటుంది.

 

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

సొలారిన్ ఫోన్ 128జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. 4జీబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ వంటి ఫీచర్లు హ్యాండ్‌సెట్ దమ్మును చూపెడతాయి.

 

నాలుగు కలర్ వేరియంట్‌లలో

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

సొలారిన్ ఫోన్ డీఫాల్ట్‌గా నాలుగు కలర్ష్ ఆప్షన్‌లతో రానుంది. వాటి వివరాలు.. బ్లాక్ కార్బన్ లెదర్ విత్ టైటానియమ్, ఫైర్ బ్లాక్ కార్బర్ లెదర్ విత్ ఎల్లో గోల్డ్, క్రిస్టల్ వైట్ కార్బన్ లెదర్ విత్ డైమండ్ కార్బన్, ఫైర్ బ్లాక్ కార్బన్ లెదర్ విత్ డైమండ్ కార్బన్.

 

వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆధారంగా రూపొందించబడిన కస్టమైజిడ్ స్కిన్‌తో వస్తోన్న సొలారిన్ ఫోన్ వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ తత్వాలతో వస్తోంది. ఈ సౌలభ్యత ఫోన్ మన్నికను మరింత బలోపేతం చేస్తుంది.

 

సిరిన్ ల్యాబ్స్‌ ఎవరిది..?

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

ఇజ్రాయిలీ స్టార్టప్ సిరిన్ ల్యాబ్స్‌ను 2013లో కజఖ్ పెట్టుబడిదారు Kenges Rakishev ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ సీఈఓ ఇంకా అధ్యక్షులుగా Tal Cohen, Moshe Hogegలు కొనసాగుతున్నారు.

 

ఫోన్ ధర ఇంకా అందుబాటు

ఫోన్‌లలో రోల్స్‌రాయిస్‌ ఇదే!

అంతర్జాతీయ మార్కెట్లో సొలారిన ఫోన్ ధర 14000 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ ఇంచుమించుగా రూ.9 లక్షలు. ప్రస్తుతం ఈ ఫోన్ కంపెనీకి చెందిన లండన్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Things to Know about Solarin, the World’s Most Expensive Smartphone. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting