సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

Posted By:

సామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ వొంపు తిరిగిన డిస్‌ప్లేతో విశిష్టమైన ఫీచర్లను కలిగి ప్రపంచ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకర్షిస్తోంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో లేని అత్యాధునిక సౌకర్యాలను గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లో పొందుపరిచారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలను మీతో షేర్ చేసుకుంటున్నాం. ఈ 10 ఫీచర్లు యాపిల్ కొత్త వర్షన్ ఫోన్ ఐఫోన్6లో లోపించటం గమనర్హం.

బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఎ-2014 ప్రీ ఈవెంట్‌లో సామ్‌సంగ్ ఈ బెంట్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను హ్యాండ్‌సెట్ కలిగి ఉంది.

2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ అంచు పై మరో సన్నని తెర ఉంటుంది. ఈమెయిల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు పలు నోటిఫికేషన్‌లను ఈ సన్నని తెర పై చూసుకోవచ్చు.

గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన సెన్సార్ ద్వారా హార్ట్ రేట్‌ను చెక్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ ప్రధాన స్ర్కీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి ‘నైట్ క్లాక్' డిస్‌ప్లే అవుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

మీరు వినియోగిస్తోన్న యాప్ నుంచి నిష్క్రమించుకుండానే వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

బ్యాటరీని రిప్లేస్ చేయవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా అదనపు స్టోరేజ్‌ను ఫోన్‌కు జత చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

ఫోన్‌లో డ్రాయింగ్ ఇంకా నోట్స్ రాసుకునేందుకు స్టైలస్ ఫీచర్ ఉపయోగపడుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

స్ర్కీన్‌లోని వక్ర భాగాన్ని (కర్వుడ్ పోర్షన్)ను ఉపయోగించుకోవటం ద్వారా హోమ్ స్ర్కీన్‌కు వెళ్లకుండానే వివిధ యాప్‌లకు మారుతుండొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

 ఫోన్ స్ర్కీన్ పై ఒకే సారి రెండు యాప్‌లను రన్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

ఫోన్‌తో వచ్చిన చార్జర్‌ను ఉపయోగించటం బ్యాటరీ చాలా త్వరగా రీచార్జ్ అవుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకతలు (ఇవి ఐఫోన్ 6లో లేవు)

గెలాక్సీ నోట్ ఎడ్జ్‌లో కీబోర్డ్‌ను సింగిల్ హ్యాండెడ్ టైపింగ్‌కు కుదించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 things Samsung Galaxy Note Edge can do, but iPhone 6 can't. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot