ఐఫోన్ 7 చేయలేని పనులు, ఆ చిన్న ఫోన్ చేసేస్తుంది!

డ్యుయల్ లెన్స్ కెమెరా ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో హువావే తన honor 8 ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది. యాపిల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ అయిన ఐఫోన్ 7ను హానర్ 8 10 విభాగాల్లో అధిగమించటం విశేషం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్‌...

డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్‌లో ఐఫోన్ 7కు మించిన ప్రతిభను హానర్ 8 ఫోన్ కనబరుస్తుంది. హానర్ 8 ఫోన్‌లో పొందుపరిచిన 5.2 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే 1080x1920 పిక్సల్ రిసల్యూషన్‌తో వస్తుంది. మరోవైపు 4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఐఫోన్ 7, 1,334 x 720పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో వస్తోంది. టెక్స్టింగ్, ఇమేజెస్, వీడియోస్, గేమ్స్ వంటి అంశాలు ఐఫోన్ 7లో పోలిస్తే హానర్ 8 ఫోన్‌‌లో మరింత షార్ప్‌గా కనిపిస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్ 8 ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సిక్స్ లెన్స్, వైడ్ యాంగిల్ డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ రెండు 12 మెగా పిక్సల్ సోనీ సెన్సార్‌లను ఉపయోగించుకుని తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తుంది. మరోవైపు ఐఫోన్ మోనో 12 మెగా పిక్సల్ కెమెరాతో వస్తోంది.

3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జా

3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తోన్న హానర్ 8 ఫోన్‌లో మ్యూజిక్‌ను సౌకర్యవంతంగా ఆస్వాదింవచ్చు. ఇదే సమయంలో ఐఫోన్ 7లో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ కనిపించదు. ఐఫోన్ 7లో పాటలు వినాలంటే బ్లుటూత్ హెడ్‌సెట్‌తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేజర్ ఆటోఫోకస్ టెక్నాలజీ

హానర్ 8 ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ లేజర్ ఆటోఫోకస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఫోటోలను మరింత అద్భుతంగా క్యాప్చుర్ చేస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 కెమెరాలో లేజర్ ఆటోఫోకస్ టెక్నాలజీ మిస్ అయ్యింది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ షార్ట్ కట్స్

ఐఫోన్ 7 తరహాలోనే హానర్ 8 ఫోన్ కూడా స్మార్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తోంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయటమే కాకుండా ఫోటోలు తీసుకునేందుకు, డిస్‌ప్లే నోటిఫికేషన్ ప్యానల్‌లోకి వెళ్లేందుకు, అలారమ్‌ను డిస్మిస్ చేసేందుకు, ఇన్‌కమింగ్ ఫోన్ కాల్‌ను అంగీకరించేందుకు షార్ట్ కట్స్ సెట్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ..

హైబ్రీడ్ సిమ్‌కార్డ్‌ స్లాట్‌తో వస్తోన్న హానర్ 8 ఫోన్‌లో ఒకే సమయంలో రెండు సిమ్
కార్డ్‌లను ఉపయోగించుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో బెలెడన్ని పనులు

హానర్ 8 ఫోన్‌లోని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ డిస్‌ప్లేను టచ్ చేయకుండా గ్యాలరీలోని ఫోటోలను బ్రౌజ్ చేయవచ్చు. సెన్సార్ కుడి, ఎడమ భాగాలను స్వైప్ చేయటం ద్వారా ఫోటో గ్యాలరీని మేనేజ్ చేయవచ్చు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

32జీబి ఇంటర్నల్ స్టోరేజ్...

హానర్ 8 ఫోన్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం కల్పించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4జీబి ర్యామ్, వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌

హానర్ 8 ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 4జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది. 30 యాప్స్‌ను ఫోన్‌లో హ్యాండిల్ చేయవచ్చు. ఇదే సమయంలో ఐఫోన్ 7 కేవటం 2 జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోంది.

ప్రో వీడియో మోడ్‌

హానర్ 8 ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ లెన్స్ కెమెరా ‘ప్రో వీడియో మోడ్‌'ను ఆఫర్ చేస్తుంది. ఈ మోడ్‌లో ఫోన్, W/B, ISO, Shutter Speed వంటి అంశాలను మాన్యువల్‌గా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 things that Honor 8 can do but an Apple iPhone 7 can’t. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot