లెనోవో ‘Project Tango’ ఫోన్ ఇదే, ప్రత్యేకతలేంటి..?

Written By:

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ అత్యాధునిక 3డీ మోషన్ సెన్సింగ్ ఆధారంగా, గూగుల్ 'ప్రాజెక్ట్ ట్యాంగో' ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

లెనోవో ‘Project Tango’ ఫోన్ ఇదే, ప్రత్యేకతలేంటి..?

ఈ టెక్నాలజీ పై రన్ అయ్యే మొదటి స్మార్ట్‌ఫోన్ 'ఫాబ్ 2 ప్రో' (Phab 2 Pro)ను లెనోవో ప్రపంచానికి పరిచయం చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కొలో జరుగుతోన్న టెక్ వరల్డ్ 2016 కాన్ఫిరెన్స్‌లో భాగంగా లెనోవో ఈ ఫోన్'కు సంబంధించిన వివరాలను వెల్లడించింది..

Read More : సిమ్ కార్డ్ క్లోన్ చేసి రూ.11 లక్షలు దోచేసారు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రాజెక్ట్ ట్యాంగో అంటే ఏంటి..?

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

గూగుల్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన ప్రాజెక్ట్ ట్యాంగో ప్లాట్‌ఫామ్.. అడ్వాన్సుడ్ కంప్యూటర్ విజన్, లోతైన సెన్సింగ్ ఇంకా మోషన్ ట్రాకింగ్ సాంకేతికతలను ఉపయోగించుకుని ఆన్ స్ర్కీన్ 3జీ అనుభూతులను సృష్టించగలదు. తద్వారా యూజర్ తన చుట్టూ ఉన్న వాటిని క్షుణ్ణంగా పరీశీలించగలడు.

ప్రాజెక్ట్ ట్యాంగో ఎలా పనిచేస్తుంది..?

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

ప్రత్యేకంగా రూపొందించిబడిన హార్డ్‌వేర్ పై పని చేయగలిగే ఈ ట్యాంగో సాఫ్ట్‌వేర్, యూజర్ ప్రతి కదలికను పసిగట్టి అందుకు అనుగుణంగా రియాక్ట్ అవుతుంది. ట్యాంగో ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఫోన్‌లు ప్రదేశాలను సులువుగా గుర్తించగలవు.

గదులకు సంబంధించిన 3డీ కొలతలను ఇవ్వగలదు

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

ట్యాంగో ఫోన్‌లలో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన సెన్సార్, గదుల చుట్టుకొలతలను రియల్ టైమ్‌లో క్యాప్చూర్ చేసి 3డీ కొలతలను ఇవ్వగలదు. ఈ చుట్టుకొలతలను సేవ్ చేసుకుని ఫర్నిచర్ లేదా డెకరేషన్ సామాగ్రిని కొనుగోలు చేసేటపుడు ఉపయోగించుకోవచ్చు.

లెనోవో ఫాబ్ 2 ప్రో స్పెసిఫికేషన్స్

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 2560 × 1440పిక్సల్స్, క్వాల్కమ్ అందిస్తోన్న ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. అడ్రినో 501 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

ఫోన్ స్టోరేజ్ ఇంకా ర్యామ్

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకున అవకాశం.

ఫోన్ కెమెరా

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

ఫోన్ కెమెరా ఆప్షన్స్ పరిశీలించినట్లయితే ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డెప్త్ సెన్సార్, మోషన్ ట్రాకింగ్ ఫర్ ట్యాంగో వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. హ్యాండ్‌సెట్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా f/2.2 అపెర్చర్‌తో వస్తోంది.

డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

ఫోన్‌‍లో ఏర్పాటు చేసిన డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం 5.1 ఆడియో క్యాప్చుర్, ట్రిపుల్ Array మైక్రోఫోన్స్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది.

కనెక్టువిటీ ఫీచర్లు:

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఈ ఏడాది చివరి నాటికి 100కు పైగా ప్రత్యేకమైన యాప్స్‌ను ఈ ఫోన్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు లెనోవో తెలిపింది.

కాన్సెప్ట్ ఇదే

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

ఇన్‌‌ఫ్రారెడ్ ఎమిటర్ అలానే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఆధారంగా ప్రాజెక్ట్ ట్యాంగో కాన్సెప్ట్ పనిచేస్తుంది. ఈ రెండు వ్యవస్థలు రేంజ్ ఫైండర్‌లా వ్యవహరించి డివైస్‌కు ఆబ్జెక్ట్‌కు మధ్య దూరాన్ని కొలుస్తాయి. ఇదే సమయంలో వైడ్ యాంగిల్ కెమెరా లోకేషన్‌కు సంబంధించిన వివరాలను యాడ్ చేస్తుంది.

సెప్టంబర్ నుంచి మార్కెట్లోకి

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్, షాంపైన్ గోల్డ్ ఇంకా గన్ మెటల్ గ్రే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. సెప్టంబర్ నుంచి ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతుంది. ధర 499 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.33,300.

ప్రచార వీడియో

లెనోవో ‘Project Tango’ ఫోన్ వచ్చేసింది, ప్రత్యేకతలేంటి..?

ఫోన్ ప్రచార వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Things to Know About Lenovo Tango Smartphone Phab 2 Pro Smartphone Launched Recently. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting