ఐఫోన్ ఎక్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు..

|

యాపిల్ ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 సంవత్సరాల పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ iPhone X పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను ఫోన్‌ను గతేడాది మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 10గా పిలవబడుతోన్న ఈ ఫోన్, ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఇతర ఐఫోన్‌లతో పోలిస్తే అట్రాక్టివ్ ఫీచర్లను కలిగి ఉంది.

10 things you don't know about iPhone X

ఫుల్ విజన్ డిస్‌ప్లే, యానిమోజీ, సరికొత్త గెస్ట్యర్స్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఐఫోన్ ఎక్స్‌కు ప్రధానమైన హైలైట్స్‌గా నిలిచాయి. ఇవేకాకుండా ఈ ఫోన్‌లో మరిన్ని ఆసక్తికర ఫీచర్లు దాగి ఉన్నాయి. వాటి గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వైర్‌లెస్ ఛార్జింగ్

వైర్‌లెస్ ఛార్జింగ్

వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యంతో లాంచ్ అయిన మొట్టమొదటి ఐఫోన్ మోడల్‌గా ఐఫోన్ ఎక్స్ గుర్తింపు తెచ్చుకుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. యాపిల్ చెబుతోన్న దాని ప్రకారం ఈ ఫోన్ 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ కాగలదు.

Siri pronunciationను సరిచేసుకునే అవకాశం..

Siri pronunciationను సరిచేసుకునే అవకాశం..

యాపిల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అయిన ‘సిరి' ఉచ్చారణ విషయంలో చాలా సార్లు తప్పుగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఐఫోన్ ఎక్స్‌లో ఇలాంటి అనుభవం ఎదురైనట్లయితే వెంటనే దానిని సరిచేసుకునే వీలుంటుంది.

ఏ11 బయోనిక్ ప్రాసెసర్

ఏ11 బయోనిక్ ప్రాసెసర్

యాపిల్ ఐఫోన్ ఎక్స్ అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన ఏ11 బయోనిక్ ప్రాసెసర్ ఏ10 చిప్‌సెట్‌తో పోలిస్తే 35 శాతం అధిక స్పీడుతో స్పందిస్తుంది.

 షేక్ టు డిలీట్

షేక్ టు డిలీట్

ఐఫోన్ ఎక్స్‌తో ఇన్‌బిల్ట్‌గా వచ్చే యాప్స్‌లో టెక్స్ట్ లేదా మెయిల్‌ను మెసేజ్ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు దొర్లినట్లయితే హ్యాండ్‌సెట్‌‌ను షేక్ చేసినట్లయితే ఆ నోట్స్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది.

డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో Vivo X20 Plus UDడిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో Vivo X20 Plus UD

ఫేషియల్ రికగ్నిషన్

ఫేషియల్ రికగ్నిషన్

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని 5.8 అంగుళాల ఎడ్జ్-ట-ఎడ్జ్ ఓఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే క్రిస్ప్ క్వాలిటీతో వీడియోలను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్‌లో టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన ఫేస్ఐడీ ఫీచర్‌ను యాపిల్ పొందుపరిచింది. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.

హిడెన్ ట్రాక్‌ప్యాడ్

హిడెన్ ట్రాక్‌ప్యాడ్

ఐఫోన్ ఎక్స్‌లో కీబోర్డ్ పై ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచటం ద్వారా హిడెన్ ట్రాక్‌ప్యాడ్‌ ఎనేబుల్ అవుతుంది. ఇలా చేయటం వల్ల ఫోన్ కర్సర్ కాస్తా మౌస్ తరహా ట్రాక్‌ప్యాడ్‌లా మారిపోతుంది. బొటను వేలు లేదా ఫింగర్‌ను స్ర్కీన్ పై ఉంచటం ద్వారా కర్సర్‌ను ఎటువంటి కావాలంటే అటు డ్రాగ్ చేసుకునే వీలుంటుంది.

మీ ముఖంతోనే అలారమ్‌ను ఆఫ్ చేయవచ్చు

మీ ముఖంతోనే అలారమ్‌ను ఆఫ్ చేయవచ్చు

ఐఫోన్ ఎక్స్‌లో అలారమ్‌ను ఆఫ్ చేసేందుకు ఎటువంటి స్నూజ్ బటన్‌లను ప్రెస్ చేయవల్సిన అవసరం ఉండదు. అలారమ్ మోగుతున్నప్పుడు ఫోన్ వైపు చూస్తే చాలు ఫేస్ ఐడీ ఫీచర్ ఆటోమెటిక్‌గా అలారమ్‌ను నిలిపివేస్తుంది.

ట్యాప్ టు వేకప్

ట్యాప్ టు వేకప్

ఈ ఫీచర్ ఎప్పటి నుంచో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో లభ్యమవుతన్నప్పటికి యాపిల్ ఐఫోన్‌లలో అందుబాటులోకి తీసుకురావటం మాత్రం ఇదే మొదటి సారి.

యానీమోజీస్

యానీమోజీస్

యాపిల్ తన iPhone X స్మార్ట్‌ఫోన్‌ ద్వారా సరికొత్త animated emojisను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిని Animojisగా యాపిల్ అభివర్ణిస్తోంది. ఈ యానిమోజిస్ అనేవి యూజర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆధారంగా సృష్టించబడతాయి. ఇందుకు అవసరమైన కస్టమ్ 3డీ వర్షన్స్‌ను FaceID ఫీచర్ సమకూరుస్తుంది.

చెక్ సర్‌ఫేస్ లెవల్

చెక్ సర్‌ఫేస్ లెవల్

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన ఇన్‌బిల్ట్ కంపాస్ యాప్ ద్వారా ఖచ్చితమైన సర్‌ఫేస్ లెవల్‌ను తెలుసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
As a part of its 10th-anniversary celebration, Apple introduced iPhone X with a major overhaul in design language and an amazingly faster hardware. This article is going to discuss all the things about the iPhone X that you are not aware of till now.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X