లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

Posted By:

నోకియా బ్రాండ్‌ను పక్కన పెట్టి మొట్టమొదటి సారిగా మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన విండోస్ స్మార్ట్‌ఫోన్ ‘మైక్రోసాఫ్ట్ లుమియా 535'. నోకియా లుమియా 530 మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన ఈ సెల్ఫీ ప్రధాన బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ఫోన్ 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఆకట్టుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లుమియా 535 ఫోన్ 1జీబి ర్యామ్‌తో కూడిన క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ క్లాక్ వేగం 1200 మెగాహెట్జ్. లుమియా 530తో పోలిస్తే 535 మోడల్ మరింత స్లిమ్‌గా ఉంటుంది.

 

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లుమియా 535 డెనిమ్ అప్‌డేట్‌తో కూడిన మైక్రోసాఫ్ట్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఆఫీస్, వన్‌డ్రైవ్, కార్టానా, స్కైప్, వన్‌నోట్ వంటి ఉపయోగకరమైన మైక్రోసాఫ్ట్ సర్వీసులను ఈ ఫోన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేసారు. డబల్ - టాప్ టూ వేక్, వాయిస్ కమాండ్స్, వర్డ్ ఫ్లో కీబోర్డ్, యాక్షన్ సెంటర్ నోటిఫికేషన్స్ హబ్, లైవ్ ఫోల్డర్స్, టాక్టైల్ ఫీడ్‌బ్యాక్, వైబ్రేటింగ్ అలర్ట్స్ వంటి యూజర్ ఇంటర్‌ఫేస్ ఫీచర్లు లుమియా 535కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

 

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లుమియా 535 క్యూహెచ్‌డి డిస్‌ప్లే‌‌తో లభ్యమవుతోంది. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్, 220 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో). ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్ ఆకట్టుకుంటుంది.

 

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లుమియా 535 8జీబి ఇంటర్నల్ మెమరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

 

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లుమియా 535 ముందు వెనుక భాగాల్లో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటంది. వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫీచర్ ద్వారా అత్యుత్తమ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

 

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లుమియా 535 విండోస్ ఫోన్‌లో 1950 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఏర్పాటు చేసారు. మైక్రోసాఫ్ట్ వెల్లిండించిన వివరాల మేరకు ఈ బ్యాటరీ ద్వారా 11 గంటల టాక్‌టైమ్, 23 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను పొందవచ్చు.

 

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లుమియా 535 విండోస్ స్మార్ట్‌ఫోన్ సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చిన సమాచారం మేరకు లుమియా 535 డిసెంబర్ 1 నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యంకానుంది.

 

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

ధర రూ.8,990. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ధర అందని ద్రాక్షేమి కాదు.

లుమియా 535 ఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు

5 కలర్ వేరియంట్‌లలో మైక్రోసాఫ్ట్ లుమియా 535ను ఆఫర్ చేస్తోంది. సియాన్, బ్రైట్ గ్రీన్, బ్రైట్ ఆరెంజ్, వైట్, డార్క్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Things you must know about Microsoft Lumia 535. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot