రెడ్మీ నోట్ 3కి Honor 5C షాకిచ్చిందా..?

|

తన ఫీచర్ ప్యాకుడ్ స్మార్ట్‌ఫోన్‌లతో భారతీయుల హృదయాలను కొల్లగొట్టిన హువావే ఆన్‌లైన్ స్పెసిఫిక్ బ్రాండ్ honor, మరో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. Honor 5C పేరుతో కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫీచర్ రిచ్ హ్యాండ్‌సెట్ ధర రూ.10,999గా ఉంది.

రెడ్మీ నోట్ 3కి Honor 5C షాకిచ్చిందా..?

మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచిన హానర్ 5సీ తన ఆకట్టుకునే పనితీరుతో బడ్జెట్ ప్రెండ్లీ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డులను తిరిగిరాస్తోంది. రెడ్మీ నోట్ 3తో పోలిస్తే హానర్ 5సీ అదుర్స్ అనటానికి 10 ఆసక్తికర కారణాలు...

Read More : షాకింగ్: రూ.49,990 విలువ చేసే బ్లాక్‌బెర్రీ ఫోన్ రూ.15,490కే

హానర్ 5సీ... మెటల్ బ్యూటీ

హానర్ 5సీ... మెటల్ బ్యూటీ

హానర్ 5సీ పోన్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్ అలాయ్ బాడీతో డిజైన్ చేసారు. ఈ క్రాప్ట్ డిజైనింగ్ ఫోన్‌కు పూర్తిస్థాయి ప్రీమియమ్ లుక్‌ను తీసుకువస్తుంది. ఇదే సమయంలో షియోమీ రెడ్మీ నోట్ 3 కూడా మెటాలిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తోంది.

 

హానర్ 5సీ... నాణ్యమైన డిస్‌ప్లే

హానర్ 5సీ... నాణ్యమైన డిస్‌ప్లే

హానర్ 5సీ పోన్‌, నాణ్యమైన 5.3 అంగులాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x 1080పిక్సల్స్, 424 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. ఈ డిస్‌ప్లేను యూజర్ గొప్ప విజువల్ ట్రీట్‌గా భావించవచ్చు. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3, 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.

 

హానర్ 5సీ... శక్తివంతమైన హార్డ్‌వేర్
 

హానర్ 5సీ... శక్తివంతమైన హార్డ్‌వేర్

హానర్ 5సీ పోన్‌, కైరిన్ 650 SoCతో వస్తోంది. 16ఎన్ఎమ్ ప్రాసెసింగ్ పవర్, ఆక్టా-కోర్ సీపీయూ వంటి ఎలిమెంట్స్ ఈ SoCకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 SoCలతో పోలిస్తే కైరిన్ 650 SoC వేగవంతమైన పనితీరును కనబర్చగలదని కంపెనీ చెబుతోంది. కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని అందిస్తుంది. తద్వారా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మరింత స్మూత్‌గా ఉంటుంది. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3 హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 801 SoCతో వస్తోంది.

 

హానర్ 5సీ... ర్యామ్ ఇంకా స్టోరేజ్

హానర్ 5సీ... ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్ స్పేస్ విషయానికి వచ్చే సరికి హానర్ 5సీ పోన్‌ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3 కూడా 2జీబి, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్స్‌తో వస్తోంది.

 

 

హానర్ 5సీ... గ్రేట్ కెమెరా క్వాలిటీ

హానర్ 5సీ... గ్రేట్ కెమెరా క్వాలిటీ

హానర్ 5సీ పోన్‌ కెమెరా ఫీచర్లను పరిశీలించినట్లయితే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి. ఎల్ఈడి ప్లాష్ లైట్, పీడీఏఎఫ్, ప్రంట్ ఫేసింగ్ వైడ్ యాంగిల్ విత్ ఎఫ్ 2.0 అపెర్చుర్ వంటి ప్రత్యేకతలను ఈ కెమెరాలలో పొందుపరిచారు. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3 ఫోన్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

 

హానర్ 5సీ... మెరుగుపరచబడిన సెక్యూరిటీ

హానర్ 5సీ... మెరుగుపరచబడిన సెక్యూరిటీ

హానర్ 5సీ పోన్‌, శక్తివంతమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్‌తో వస్తోంది. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3 ఫోన్ కూడా ఫింగర్ ప్రింట్ ఆప్షన్‌తో వస్తోంది. హానర్ 5సీ పోన్‌లో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఫింగర్ ఇంప్రెషన్‌లను వేగవంతంగా రిజిస్టర్ చేసుకోవటంతో పాటు నమ్మకమైన పనితీరును కనబరుస్తుంది.

హానర్ 5సీ... ఆపరేటింగ్ సిస్టం

హానర్ 5సీ... ఆపరేటింగ్ సిస్టం

హానర్ 5సీ పోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన నేటివ్ EMUI 4.1 ద్వారా యూజర్ అదనపు ఫీచర్లు ఆస్వాదించవచ్చు. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3 ఫోన్ MIUI 7 టాపింగ్‌తో కూడిన పాత వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై రన్ అవుతోంది.

 

హానర్ 5సీ... బ్యాటరీ బ్యాకప్

హానర్ 5సీ... బ్యాటరీ బ్యాకప్

హానర్ 5సీ పోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వస్తోంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ బ్యాటరీ శక్తిని మాత్రమే ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని అందించటంతో బ్యాటరీ బ్యాకప్ మరింత రెట్టింపు అవుతుంది. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3, 4000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. అయితే, చెప్పుకోదగిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ అంశాలు ఈ బ్యాటరీలో లేవు.

 

హానర్ 5సీ... కనెక్టువిటీ ఫీచర్లు

హానర్ 5సీ... కనెక్టువిటీ ఫీచర్లు

డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, యూఎస్బీ టైప్-సీ వంటి స్టాండర్డ్ కనెక్టుకవిటీ ఆప్షన్ లను హానర్ 5సీలో చూడొచ్చు. సరిగ్గా ఇలాంటి స్పెసిఫికేషన్సే రెడ్మీ నోట్ 3లో కూడా ఉన్నాయి.

హానర్ 5సీ... తక్కువ బరువు

హానర్ 5సీ... తక్కువ బరువు

156 గ్రాముల బరువుతో వస్తోన్న హానర్ 5సీ చేతిలో మరింత హ్యాండీగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
10 ways Honor 5C is better than Xiaomi Redmi Note 3. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X