ఇవి పాటిస్తే, మీ ఆండ్రాయిడ్ ఫోన్ సేఫ్
ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లపై వైరస్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లపై వైరస్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదకర వైరస్‌ల నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను రక్షించుకునేందుకు పలు చిట్కాలు..
సామ్‌సంగ్ నుంచి లెనోవో వరకు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

టిప్ 1
ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

టిప్ 2
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన సమచారం ఉందనుకుందాం. ఇతరులు ఆ సమాచారాన్ని యాక్సెస్ చెయ్యకుండా ఆ డేటాని ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్థేశిత పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా సదరు డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారి డిక్రిప్ట్ అయి మీకు
కనబుడుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.

టిప్ 3
ఈ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి.

టిప్ 4
మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

టిప్ 5
మీ ఫోన్‌లోని ఇ-మెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి అప్లికేషన్‌లను పరిరక్షించుకునేందుకు ‘యాప్ లాక్' ‘App Lock' అనే అప్లికేషన్‌ను ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోండి. తద్వారా మీ అకౌంట్‌లను ఎవరు పడితే వాళ్ల ఓపెన్ చేసేందకు ఆస్కారం ఉండదు.

టిప్ 6
నెట్ బ్యాకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి లావాదేవీలను స్మార్ట్‌ఫోన్ ద్వారా నిర్వహిస్తున్న సమయంలో అప్రమత్తత ఎంతో అవసరం. ఆయా అకౌంట్‌ల పాస్ వర్డ్ లను తరచూ మార్చటం మంచిది.

టిప్ 7
అనధికారిక యాప్ స్టోర్ల నుంచి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. నమ్మకమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఫోన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి. వ్యక్తిగత సమచారాన్ని ఫోన్‌లోని ఎస్‌డి కార్డ్‌లలో స్టార్ చేయటం మంచిది కాదు. కాబట్టి ఆ అలవాటును మానుకోండి.


Click it and Unblock the Notifications








