వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

Posted By:

స్మార్ట్‌ఫోన్ ఉందంటే అందులో వాట్సాప్ అకౌంట్ ఉండాల్సిదే. ప్రపంచవ్యాప్తంగా విస్తృత యూజర్ బేస్‌ను కలిగి ఉన్న ఈ ఉచిత చాటింగ్ మైబైల్ యాప్ ద్వారా నిత్యం కోట్లాది మంది చాట్ చేస్తుంటారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ తరహా పోకడ కేవలం వాట్సాప్‌కు మాత్రమే కాదు వాట్సాప్ తరహాలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్నో అప్లికేషన్‌లకు నెటిజనుల నుంచి ఆదరణ లభిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అచ్చం వాట్సాప్ తరహాలోనే అదరహో అనిపిస్తోన్న పలు ఉచిత మెసేజింగ్ యాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసకున్నప్పటికి, ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌కు అంతే స్థాయిలో ఆదరణ లభిస్తోండటం విశేషం. నేటి తరం స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ప్రత్యేకంగా చేప్పవల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేస్తున్నారు.

వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఐపీ అప్లికేషన్ వైబర్ (Viber) తమ యాప్‌కు సంబంధించి ఇటీవల ప్రముఖ అప్‌డేట్‌ను ప్రకటించింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా తమ వైబర్ యాప్ ద్వారా ఉచిత మెసేజింగ్ అలానే హైడెఫినిషన్ క్వాలిటీ వాయిస్ కాల్స్ నిర్వహించుకోవచ్చని కంపెనీ తెలిపింది. అదనంగా జత చేసిన మరో కొత్త ఫీచర్ ‘పబ్లిక్ చాట్స్' ద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కమ్యూనిటీలు అలానే సెలబ్రెటీలతో చాట్ చేసుకోవచ్చు.

 

 

వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

వివిధ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను వుయ్‌చాట్ (WeChat) అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. లైవ్‌చాట్, గ్రూప్‌చాట్, వీడియో కాలింగ్, పుష్ - టూ -టాక్ వంటి సౌలభ్యతలను ఈ అప్లికేషన్ అందిస్తోంది. సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్స్: ఐఓఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్, విండోస్‌ఫోన్, వెబ్

 

 

వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

వాయిస్ కాన్ఫిరెన్స్ నిర్వహించుకునేందకు స్కైప్ చక్కటి సదుపాయం. ఈ అప్లికేషన్ ద్వారా టెక్స్ట్, వాయిస్ ఇంకా వీడియో ఛాటింగ్‌లను ఉచితంగా నిర్వహించుకోవచ్చు. సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్స్: ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్, మ్యాక్

Read more at: https://telugu.gizbot.com/how-to/5-apps-cut-down-your-phone-bill-008230.html

 

వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

ఈ నిఫ్టి అప్లికేషన్ ద్వారా ఉచితంగా వీడియో చాటింగ్, వాయిస్ కాల్స్, టెక్స్ట్ సందేశాలు, ఫోటో షేరింగ్, గేమ్స్ తదితర అంశాలను నిర్వహించుకోవచ్చు. ట్యాంగో అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌ను వాకీ-టాకీలా మార్చగలదు. సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్స్: ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్7, విండోస్

 

 

వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడకైనా మెసేజ్ ను ఉచితంగా షేర్ చేసుకోవచ్చు

వాట్సాప్ లాంటివే ఇవి కూడా..!

 సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ గూగుల్ హ్యాంగవట్స్ పేరుతో ఉచిత వీడియో చాటింగ్ సర్వీసును అందిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఒకేసారి 10 మంది సభ్యులతో ఉచిత వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
WhatsApp Alternatives For Your Smartphone. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot