‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

|

భారత్‌లో పాగా వేసిన నోకియా, సామ్ సంగ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ లతో పాటు పాట బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తోన్న మైక్రోమాక్స్, కార్బన్ వంటి దేశవాళీ కంపెనీలకు ఘులక్ ఇస్తూ మోటరోలా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆండ్రాయిట్ కిట్ క్యాట్ వంటి అత్యాధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.6,999. మోటో ఇ స్మార్ట్‌ఫోన్‍‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (flipkart)ప్రత్యేకంగా విక్రయిస్తోంది.

మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది. మోటరోలా ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్ అనటానికి 10 కారణాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

పటిష్టమైన ఫోన్ నిర్మాణం

‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్ పటిష్టమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. 4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x 960పిక్సల్స్, 256పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, వాటర్ నానో కోటింగ్ వంటి అంశాలు ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌ను పటిష్టమైన స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌గా మార్చేసాయి. దుమ్ము ఇంకా నీటి నిరోధక సామర్ధ్యాలను మోటో ఇ స్మార్ట్‌ఫోన్ కలగి ఉండటం విశేషం.

 

 ‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

అత్యుత్తమ ఆడియో క్వాలిటీ:

‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌లో అత్యుత్తమ ఆడియో క్వాలిటీ వ్యవస్థను ఏర్పాటు చేసారు. పాటలు, యూట్యూబ్ వీడియోల అలానే ఎఫ్ఎమ్ రేడియోను అత్యుత్తమ ఆడియో అనుభూతులతో యూజర్ ఆస్వాదించవచ్చు. ఈ డివైస్‌లో నిర్మితం చేసిన ప్రత్యేకమైన స్పీకర్లు మెరుగుపరచబడిన ఆడియో అనుభూతులను చేరువచేస్తాయి.

 

 ‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

అత్యుత్తమ కెమెరా:

‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా ఫీచర్ ద్వారా యూజర్ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆశించవచ్చు. ఎల్ఈడి ఫ్లాష్ ఫీచర్ ఈ కెమెరాలో లోపించినప్పటికి  హెచ్‌డిఆర్, పానోరమా వంటి ప్రత్యేకతలు కెమెరా పనితీరు పై మరింత ప్రభావం చూపుతాయి.

 

 ‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

పటిష్టమైన బ్యాటరీ:

మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బలోపేతమైన 1980ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది. బ్యాటరీ పూర్తి చార్జ్ పై సూదూర టాక్ టైమ్‌ను యూజర్ పొందవచ్చు.

 

 ‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

గేమింగ్‌కు అనువైన ఫోన్:

1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ సామర్ధ్యం గల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 1జీబి ర్యామ్ ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. కాండీ క్రష్, టెంపుల్ రన్, మినియన్ రష్ వంటి గేమ్‌లను అత్యుత్తమ గ్రాఫిక్ అనుభూతులతో ఆస్వాదించవచ్చు.

 

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

కూల్ బ్యాక్ ప్యానల్

గిజ్‌బాట్ బృందం నిర్వహించిన అన్ని బెంచ్‌మార్క్ పరీక్షలను మోటో ఇ స్మార్ట్‌ఫోన్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఫోన్‌ను రోజంతా  ఉపయోగించినప్పటికి ఫోన్ బ్యాక్ ప్యానల్ ఏమాత్రం వేడెక్కలేదు. ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు.

 

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఇ' ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను యూజర్ ఆస్వాదించవచ్చు.

 

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

ఉపయుక్తమైన మోటో ఇ మ్యాప్స్ ఫీచర్:

మోటో ఇ డివైస్‌లో ఏర్పాటు చేసిన గూగుల్ మాప్స్ ఫీచర్ ద్వారా కచ్చితమైన సమాచారాన్నియూజర్లు పొందవచ్చు.

 

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

‘మోటో ఇ’ బెస్ట్ అనటానికి 10 కారణాలు

ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఫోన్:

ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం‌ను మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో లోడ్ చేసారు. ఈ సౌలభ్యతతో లెటేస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైలింగ్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X