Home
Mobile

ఆండ్రాయిడ్ ఫోన్‌కు 10 సంవత్సరాలు, మీకు తెలియని షాకింగ్ నిజాలు..

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్లో 10 వసంతాలను పూర్తిచేసుకుంది.

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్లో 10 వసంతాలను పూర్తిచేసుకుంది. సెప్టంబర్ 23, 2008 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో లోడ్ అయి ఉన్న మొట్టమొదటి ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటంగ్ సిస్టంకు ఎటువంటి కోడ్ నేమ్‌ను గూగుల్ పెట్టలేదు. దీంతో ఆండ్రాయిడ్ 1.0 పేరుతో ఈ ఆపరేటింగ్ సిస్టంను పిలిచేవారు. ఆ తరువాత పెటిట్ ఫోర్ పేరుతో ఆండ్రాయిడ్ 1.1 వెర్షన్‌ను గూగుల్ అందుబాటులోకి వచ్చింది.

నాటి నుంచి నేటి వరకు..

నాటి నుంచి నేటి వరకు..

2008లో మొదలైన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ప్రస్థానం.. కప్‌కేక్ (ఆండ్రాయిడ్ 1.5)‌, డోనట్ (ఆండ్రాయిడ్ 1.6), ఇక్లెయర్ (ఆండ్రాయిడ్ 2.0 - 2.1), ఫ్రోయో (ఆండ్రాయిడ్ 2.2 - 2.2.3), జింజర్ బ్రెడ్ (ఆండ్రాయిడ్ 2.3 - 2.3.7), హనీకూంబ్ (ఆండ్రాయిడ్ 3.0 - 3.2.6), ఇస్‌క్రీమ్ శాండ్విచ్ (ఆండ్రాయిడ్ 4.0 - 4.0.4), జెల్లీబీన్ (ఆండ్రాయిడ్ 4.1 - 4.3.1), కిట్‌క్యాట్ (ఆండ్రాయిడ్ 4.4 - 4.4.4), లాలీపాప్ (ఆండ్రాయిడ్ 5.0 - 5.1.1), మార్ష్‌మల్లో (ఆండ్రాయిడ్ 6.0 - 6.0.1), నౌగట్ (ఆండ్రాయిడ్ 7.0 - 7.1.2), ఓరియో (ఆండ్రాయిడ్ 8.0 - 8.1), Pie (ఆండ్రాయిడ్ 9.0) వెర్షన్స్ వరకు విస్తరించింది.

 

 

7 ఆసక్తికర విషయాలు..

7 ఆసక్తికర విషయాలు..

గూగుల్ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకని ఆ ఫోన్ గురించిన 7 ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది. గూగుల్ తన మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌ను ‘జీ1' (G1) పేరుతో అందుబాటులో తీసుకువచ్చింది. గూగుల్, హెచ్‌టీసీ ఇంకా టీ-మొబైల్ కాంభినేషన్‌లో ఈ ఫోన్ రూపుదిద్దుకుంది. యాపిల్ ఐఫోన్‌కు రియల్ కాంపిటీటర్‌గా లాంచ్ అయిన డివైస్‌ను 399 డాలర్లకు కంపెనీ విక్రయించింది.

 

 

టచ్‌స్క్రీన్  సపోర్ట్ లేదు..

టచ్‌స్క్రీన్ సపోర్ట్ లేదు..

ఆండ్రాయిడ్ మొదటి ఫోన్ అయిన ‘జీ1'లో టచ్‌స్ర్కీన్ సపోర్ట్ లేదు. స్లైడర్ కీబోర్డుతో డిజైన్ కాబడిన ఈ డివైస్‌లో టైపింగ్ ఇంకా నేవిగేషన్‌ కోసం ట్రాక్ బాల్‌ను హెచ్‌టీసీ ఏర్పాటు చేసింది.

హెచ్‌టీసీ డ్రీమ్ (HTC Dream) పేరుతో లభ్యం..

హెచ్‌టీసీ డ్రీమ్ (HTC Dream) పేరుతో లభ్యం..

గూగుల్ తన ఆండ్రాయిడ్ ఫోన్‌ను యూఎస్ మార్కెట్లో జీ1 పేరుతో విక్రయించినప్పటికి, బయట మార్కెట్లలో మాత్రం హెచ్‌టీసీ డ్రీమ్ పేరుతో విక్రయించింది. ఈ ఫోన్ సెప్టంబర్ 23, 2008న అఫీషియల్‌గా అనౌన్స్ కాబడినప్పటికి అమ్మకాలు మాత్రం జనవరి 2009 నుంచే ప్రారంభమయ్యాయి.

 

 

హెడ్‌ఫోన్ జాక్ సౌకర్యం లేదు..

హెడ్‌ఫోన్ జాక్ సౌకర్యం లేదు..

గూగుల్ లాంచ్ చేసిన మొదటి ఆండ్రాయిడ్ డివైస్‌లో వర్చువల్ కీబోర్డ్, 3.5ఎమ్ఎమ్ హెచ్‌సెట్ జాక్ వంటి ఫీచర్లు లేవు. దీంతో అడాప్టర్ సహాయంతో హెడ్‌ఫోన్‌లను కనెక్ట్ చేసుకోవల్సి వచ్చేది.

 

 

గూగుల్ ప్లే స్టోర్ సదుపాయం లేదు..

గూగుల్ ప్లే స్టోర్ సదుపాయం లేదు..

గూగుల్ లాంచ్ చేసిన మొదటి ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగల్ ప్లే స్టోర్ అందుబాటులో లేదు. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, జీమెయిల్ వంటి యాప్స్ మాత్రం ఈ ఫోన్‌లో లోడై ఉన్నాయి.

 

 

 

6 నెలల్లో 10 లక్షల ఫోన్‌లు..

6 నెలల్లో 10 లక్షల ఫోన్‌లు..

గూగుల్ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లను టీ-మొబైల్ సంస్థ యూఎస్ మార్కెట్లో విక్రయించింది. మొదటి 6 నెలల్లో ఏకంగా 10 లక్షల G1 ఫోన్లను ఈ సంస్థ విక్రయించగలిగింది. 2010లో ఈ ఫోన్ డిస్కంటిన్యూ అయ్యింది.

 

 

2009లో హెచ్‌టీసీ డ్రీమ్ (HTC Magic)

2009లో హెచ్‌టీసీ డ్రీమ్ (HTC Magic)

గూగుల్ తన రెండవ ఆండ్రాయిడ్ ఫోన్‌ను గూగుల్ మ్యాజిక్ పేరుతో 2009లో లాంచ్ చేసింది. ఆ తరువాత సంవత్సరం సామ్‌సంగ్, ఎల్‌జీ, మోటరోలా వంటి సంస్థలు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

ఐఫోన్‌కు రియల్ కాంపిటీషన్..

ఐఫోన్‌కు రియల్ కాంపిటీషన్..

గూగుల్ తన మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసే నాటికి యాపిల్ తన సెకండ్ జనరేషన్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో యాపిల్ ఐఫోన్‌కు రియల్ ఛాలెంజర్‌గా గూగుల్ జీ1 నిలిచింది. ప్రస్తుతం మన చూస్తున్నట్లయితే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల విభాగంలో మైక్రోసాఫ్ట్ విండోస్, ఆపిల్ ఐవోఎస్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టంలకు ధీటుగా గూగుల్ తన ఆండ్రాయిడ్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది.

Best Mobiles in India

English summary
10 years of the first Android phone: 7 things you didn’t know.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X