ఒక్క రోజులో లక్ష ఫోన్‌ల అమ్మకం, దుమ్మురేపిన Moto E3 Power
తీవ్రమైన పోటీ వాతావరణంలోనూ మోటో ఇ3 పవర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు దుమ్ము రేపాయి. అమ్మకాలు ప్రారంభమైన తొలి రోజునే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా లక్ష మంది కొనుగోలు చేసినట్లు మోటరోలా మొబిలిటీ ఇండియా జనరల్ మేనేజర్ అమిత్ బోని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
Read More : 4జీబి ర్యామ్‌తో లెనోవో Z2 Plus ఫోన్ లాంచ్ అయ్యింది

మోటో ఇ3 పవర్ అమ్మకాలు రూ. 7,999 ధర ట్యాగ్‌తో సోమవారం అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. 3,500 ఎమ్ఏహెచ్ మాసివ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ జియో వెల్ కమ్ ఆఫర్ ను కూడా సూపోర్ట్ చేస్తుంది.

మోటో ఇ3 పవర్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 294 పీపీఐ, ఫోన్ నీటిలో తడవకుండా వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్ ,

ర్యామ్, ప్రాసెసర్
క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం,

కెమెరా
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, బరస్ట్ మోడ్, హెచ్‌డిఆర్, పానోరమా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, టాప్ టు ఫోకస్, టాప్ టు క్యాప్చుర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : బ్యూటిఫికేషన్ మోడ్),

ఆపరేటింగ్ సిస్టం
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,

కనెక్టువిటీ ఫీచర్లు
4G + VoLTEసపోర్ట్, 3జీ, వైఫై, బ్లుటూత్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ lOW రాపిడ్ చార్జ్

రూ.7000 వరకు స్పెషల్ ఎక్స్‌ఛేంజ్
తొలి రోజు సేల్‌లో భాగంగా Moto e3 Power ఫోన్ కొనుగోలు పై రూ.7000 వరకు స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను మోటరోలా, ఫ్లిప్‌కార్ట్‌లు అందించాయి.

రూ.599 విలువ చేసే 32జీబి Sandisk మైక్రోఎస్డీ కార్డు
మొదటి రోజు ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే యూజర్లకు రూ.599 విలువ చేసే 32జీబి Sandisk మైక్రోఎస్డీ కార్డుతో పాటు రూ.499 విలువ చేసే మోటో పల్స్ హెడ్‌సెట్‌ను ఉచితంగా అందించారు.

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లు
SBI క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ.800 స్పెషల్ డిస్కౌంట్‌తో పాటు 6 నెలల ప్రత్యేక EMI (నెలకు రూ.1334) పై ఫోన్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








