Vivo V11 Pro బెస్ట్ అనటానికి 11 కారణాలు..

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వివో (Vivo), బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వివో (Vivo), బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన వివో వీ11 ప్రో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. టాప్-నాట్చ్ స్పెసిఫికేషన్స్‌తో వస్తోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ డివైస్ ధర రూ.25,990గా ఉంది. ఈ ఫోన్‌లోని పలు హైలైటెడ్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ

వివో తన వీ11 ప్రో డివైస్‌లో ఫోర్త్ జనరేషన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసింది. ఈ లేటెస్ట్ సెన్సార్ మునుపటి సెన్సార్స్‌తో పోలిస్తే సులువైన కాన్ఫిగరేషన్‌ను కలిగి 50 రెట్ల ఎక్కువ ఖచ్చితత్వంతో స్పందించగలుగుతుంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లో నిక్షిప్తం అధునాతన బయోమెట్రిక్ సెన్సార్ రెప్పపాటులో డివైస్‌ను అన్‌లాక్ చేసేస్తోంది. మునుపటి జనరేషన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్‌తో పోలిస్తే ఈ స్కానర్ మరింత ఖచ్చితత్వంతో స్పందించగలుగుతంది. ఇదే సమయంలో ఫ్యూచరిస్టిక్ ఫిల్‌ను కూడా ఈ టెక్నాలజీ చేరువ చేస్తోంది. వీ11 ప్రో రూపకల్పనలో భాగంగా విజబుల్ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌కు స్వస్తి పలికిన వివో దాని స్థానంలో హై-ఎండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

 

స్లీక్ డిజైనింగ్ అండ్ అట్రాక్టివ్ కలర్ వేరియంట్స్..

స్లీక్ డిజైనింగ్ అండ్ అట్రాక్టివ్ కలర్ వేరియంట్స్..

వివో తన వీ11 ప్రో డివైస్‌ను సొగసరి లుక్‌లో తీర్చిదిద్దింది. ఈ ఫోన్ కేవలం 1.76 మిల్లీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ రేర్ ప్యానల్ పై ఏర్పాటు చేసిన 3డీ కవర్ అసాధారణ ఫ్యూజన్ కలర్‌తో ఓ సరికొత్త లుక్ ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ స్టారీ నైట్ ఇంకా డాజ్లింగ్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అల్ట్రా ఇంప్రెస్సివ్ డిజైనింగ్‌కు ఈ కలర్ వేరియంట్స్ తోడవటంతో వివో వీ11 ప్రో ఓ మాస్టర్ పీస్‌లా అనిపిస్తుంది.

క్రిస్ప్ హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే

క్రిస్ప్ హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే

వివో తన వీ11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 6.4 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ హాలో ఫుల్‌వ్యూ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. స్లిమ్ బీజిల్స్‌తో వస్తోన్న ఈ డిస్‌ప్లే 91.27% హయ్యస్ట్ స్ర్కీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే పై భాగంలో ఏర్పాటు చేసిన వాటర్ డ్రాప్ నాట్చ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అటాచ్ అయి ఉంటుంది. 19:5:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉన్న ఈ డిస్‌ప్లే హై-క్వాలిటీ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

 

 

ఫ్రంట్ కెమెరా విత్ ఏఐ ఫేస్ షేపర్..

ఫ్రంట్ కెమెరా విత్ ఏఐ ఫేస్ షేపర్..

సెల్ఫీ ప్రియులను ఉద్దేశించి వివో తన వీ11 ప్రో డివైస్‌లో శక్తివంతమైన 25 మెగా పిక్సల్ సూపర్-హై-రిసల్యూషన్ కెమెరాను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలో లోడ్ చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ షేపర్ టెక్నాలజీ సుపీరియర్ ఫోటో క్వాలిటీతో సహజసిద్థమైన క్లియర్ సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తుంది.

డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరా

డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరా

వివో వీ11 ప్రోలో ఎక్విప్ చేసిన 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా నైట్ ఫోటోగ్రఫీకి ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుంది. ప్రైమరీ కెమెరాలో ఎక్విప్ చేసిన f/1.8 అపెర్చుర్ ఇంకా 1.28μm పిక్సల్స్ ఫోటోసెన్సిటివిటీని మరింత యాంప్లిఫై చేస్తాయి.

 

 

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ఏఐఈ ప్రాసెసర్...

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ఏఐఈ ప్రాసెసర్...

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి వివో వీ11 ప్రో డివైస్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ఏఐఈ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌తో కంభైన్ చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ.. ఫోన్ బ్యాటరీ, కంప్యూటింగ్ ఇంకా గ్రాఫిక్స్ విభాగాలను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్‌తో పాటు 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్లను వివో పొందుపరిచింది.

 

 

ఫన్‌టచ్ 4.5 ఓఎస్

ఫన్‌టచ్ 4.5 ఓఎస్

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫన్‌టచ్ 4.5 ఓఎస్ పై వివో వీ11 ప్రో రన్ అవుతుంది. ఈ ప్లాట్‌‌ఫామ్‌లోని జోవీ ఆర్టిఫీఫియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ సీపీయూ ఇంకా మెమురీ రిసోర్సులను చక్కగా ఉపయోగించుకుంటూ ఫోన్ పై ఒత్తిడి పడకుండా చూస్తుంది.

 

 

డ్యుయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్...

డ్యుయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్...

వివో వీ11 ప్రోలో లోడ్ చేసిన 3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ డ్యుయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. భద్రత రిత్యా ఈ బ్యాటరీకి 9 లేయర్ ప్రొటెక్షన్‌ను వివో కల్పించింది. ఈ డ్యుయల్ ఇంజిన్ టెక్నాలజీ బ్యాటరీ మెరుపు వేగంతో ఛార్జ్ చేయగలుగుతుంది.

ఫేస్ యాక్సిస్ విత్ ఇన్‌ఫ్రారెడ్ లైట్..

ఫేస్ యాక్సిస్ విత్ ఇన్‌ఫ్రారెడ్ లైట్..

సెక్యూరిటీకి మరింత ప్రాధాన్యతను కల్పించిన వివో తన వీ11 ప్రో డివైస్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొటెక్షన్‌తో పాటు ఫేస్ యాక్సిస్ ఆప్షన్‌ను కూడా కల్పించింది. డివైస్‌లో లోడ్ చేసిన ఐఆర్ సెన్సార్ ఆధారంగా ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. చిమ్మ చీకట్లోనూ ఈ సెన్సార్ యూజర్ ఫేస్ ఐడీని గుర్తించగలుగుతుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ మోడ్..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ మోడ్..

వివో వీ11 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు ఏఐ గేమ్ మోడ్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. గేమ్ ఆడుతున్నపుడు ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే అంతరాయంలేని గేమింగ్‌ను యూజర్ ఆస్వాదించవచ్చు. ఇదే సమయంలో గేమ్ అసిస్ట్, గేమ్ పిక్షర్ ఇన్ పిక్షర్ వంటి ఫీచర్స్ ద్వారా గేమ్ ఆడుతూనే చాట్ చేసుకునే వీలుంటుంది.

 

 

జోవి అసిస్టెంట్

జోవి అసిస్టెంట్

వివో తన వీ11 ప్రో డివైస్ ద్వారా జోవి ఏఐ అసిస్టెంట్ వంటి విప్లవాత్మక టూల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు ఈ టూల్ సహాయ పడుతుంది.

Best Mobiles in India

English summary
11 reasons to buy the Vivo V11 Pro.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X