స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి, రూ.11 వేల వరకు తగ్గిన ఫోన్ల వివరాలు ఇవే

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే మీకు సరైన అవకాశం..ఎందుకంటే దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి.

|

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే మీకు సరైన అవకాశం.. ఎందుకంటే దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. హైఎండ్ స్మార్ట్‌ఫోన్ల నుంచి లో ఎండ్ స్మార్ట్ ఫోన్ల దాకా వివరాలు భారీగా తగ్గాయి. యూజర్లను ఆకట్టుకునే క్రమంలో ఈ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, హెచ్టీసీ, వివో, మోటరోలా, నోకియా, ఆసుస్ వంటి ఎన్నో కంపెనీలు తమ ఫోన్ల ధరలను రూ. 11 వేల వరకూ తగ్గిస్తున్నట్టు ఇటీవల ప్రకటించాయి. మంచి ఫీచర్లతో తక్కువ ధరలో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక అధ్భుత అవకాశమని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఫోన్ ధర ఏ మేరకు తగ్గిందో ఓ స్మార్ట్ లుక్కేయండి.

10GB RAMతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !10GB RAMతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !

గెలాక్సీ ఎస్8 ప్లస్

గెలాక్సీ ఎస్8 ప్లస్

శాంసంగ్ తానందిస్తున్న గెలాక్సీ ఎస్8 ప్లస్ ధరను రూ. 64,900 నుంచి రూ. 53,900కు తగ్గించింది. ఆండ్రాయిడ్ ఓరియోపై పనిచేసే ఈ ఫోన్ ధరను రూ. 11 వేలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ ఫీచ‌ర్లు...

6.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌
64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఐపీ68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్
యాక్స‌ల‌రోమీట‌ర్‌, బారో మీట‌ర్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, గైరో సెన్సార్
జియో మాగ్నెటిక్ సెన్సార్‌, హాల్ సెన్సార్
హార్ట్ రేట్ సెన్సార్‌, ఆర్‌జీబీ లైట్ సెన్సార్
ఐరిస్ సెన్సార్, ప్రెష‌ర్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్8

శాంసంగ్ గెలాక్సీ ఎస్8

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ధరను రూ. 57,900 నుంచి రూ. 7,910 తగ్గిస్తూ, రూ. 49,990గా ప్రకటించింది.

6.2 ఇంచెస్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7 నౌగట్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఎస్‌ 8 లో 3,000 ఏంఏహెచ్‌ బ్యాటరీ
ఎస్‌8ప్లస్‌లో 3,500 ఏంఏహెచ్‌ బ్యాటరీ అమర్చింది.

నోకియా 8

నోకియా 8

నోకియా 8 మోడల్ పై రూ. 8 వేల తగ్గింపు. ఇప్పటివరకూ రూ. 36,999గా ఉన్న ఈ ఫోన్ ఇకపై రూ. 28,999కి లభ్యమవుతుందని తెలిపింది. 5.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ డిస్ ప్లే, 4 జీబీ రామ్, 64 జీబీ మెమొరీ దీని ప్రత్యేకతలు.

నోకియా 8 ఫీచ‌ర్లు

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

 

 హెచ్టీసీ యూ

హెచ్టీసీ యూ

హెచ్టీసీ సంస్థ తన యూ 11 ధరను రూ. 5,991 మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ ఇకపై రూ. 45,999కి లభిస్తుందని తెలిపింది. 

హెచ్‌టీసీ యు 11 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ ప్లే
2.4 గిగాహెడ్జ్‌
స్నాప్‌ డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌,
ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.1ఆపరేటింగ్ సిస్టమ్‌
2560 x 1440 రిజల్యూషన్
6జీబీ ర్యామ్
128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
2 టీబీ ఎక్స్‌పాండబుల్‌ ఇంటర్నల్‌ మొమరీ
12 ఎంపీ రియర్‌ కెమెరా,
16ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

హానర్ 8

హానర్ 8

హానర్ సంస్థ తన డ్యూయల్ కెమెరా మోడల్ హానర్ 8 ధరను రూ. 29,999 నుంచి రూ. 4 వేలు తగ్గించి రూ. 25,999గా ప్రకటించింది.

హానర్ 8 ఫీచర్లు

5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గెలాక్సీ ఏ8 ప్లస్

గెలాక్సీ ఏ8 ప్లస్

శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ ఏ8 ప్లస్ ధరను రూ. 2 వేలు తగ్గిస్తూ, రూ. 30,990గా ప్రకటించింది.

Galaxy A8+ స్పెసిఫికేషన్స్..
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (18.5:9 యాస్పెక్ట్ రేషియో), సూపర్ అమోల్డ్ ప్యానల్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ ఆక్టా కోర్ 7885 సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి,6జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 802.11ఏసీ, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

షియోమీ రెడ్ మీ 5

షియోమీ రెడ్ మీ 5

సంచలనం సృష్టించిన షియోమీ రెడ్ మీ 5 స్మార్ట్ ఫోన్ ధరను రూ. 500 తగ్గిస్తున్నట్టు షియోమీ వెల్లడించింది. 

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
3300 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో జీ5ఎస్

మోటో జీ5ఎస్

మోటో జీ5 ఎస్ మోడల్ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 4 వేలు తగ్గిస్తున్నట్టు మోటో ప్రకటించింది. రూ. 16,999గా ఉన్న ఫోన్ ఇకపై రూ. 12,999కి లభిస్తుందని తెలిపింది. 

మోటో జీ5ఎస్ ఫీచ‌ర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్.

 

నోకియా 6

నోకియా 6

నోకియా 6 ధర రూ. 2 వేలు తగ్గగా, మోటో జీ5 ప్లస్ ధర రూ. 5 వేలు, వివో వీ7 ధర రూ. 2 వేలు, ఒప్పో ఏ71 ధర రూ. 3 వేలు, నోకియా 5 ధర రూ. 1 వెయ్యి, బ్లాక్ బెర్రీ కీ వన్ ధర రూ. 4 వేలు, ఆసూస్ జెన్ ఫోన్ ధర రూ. 2 వేలు తగ్గింది. పలు రకాల కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడంతోనే పాత మోడల్ ధరలను కంపెనీలు తగ్గించాయని ఈ రంగంలోని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Best Mobiles in India

English summary
15 smartphones that received price cuts up to Rs 11,000 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X