దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఏడాదికి సగటున రెండు సార్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేసుకుంటునట్లు సర్వేలు చెబుతున్నాయి. వీరు తమ పాత ఫోన్‌లను సగం ధరకు అమ్మేయటం లేదా ఎందుకు ఉపయోగించకుండా మూలన పడేయటం వంటివి చేస్తున్నారట. పాత ఫోన్‌లను సగం ధరకు అమ్మేయటం కంటే ఇంటిలోనే ఉంచుకుని ప్రత్నామ్నాయ అవసరాలకు ఉపయోగించుకోవటం ఎంతో మేలు. కొంచం వినూత్నంగా ఆలోచించినట్లయితే మీ పాత ఫోన్‌ను అనేక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం..
ఫిట్నెస్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫిట్నెస్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు. మీ పాత డివైస్‌ను ఇలా మార్చే క్రమంలో ఫోన్‌ను మొత్తం రీఫార్మాట్ చేసి మ్యూజిక్ ఇంకా ఫిట్నస్ ట్రాకర్ యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.
జీపీఎస్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా రీఫార్మాట్ చేసి మ్యాపింగ్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోన్‌ను పూర్తిస్థాయి జీపీఎస్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.
అలారమ్ క్లాక్‌లా ఉపయోగించుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా రీఫార్మాట్ చేసి అలారమ్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోన్‌ను పూర్తిస్థాయి అలారమ్ క్లాక్‌లా ఉపయోగించుకోవచ్చు.
పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్‌లా ఉపయోగించుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్‌లా మార్చుకుని మీ కొత్త ఫోన్‌కు ఛార్జింగ్ సమకూర్చుకోవచ్చు. యూఎస్బీ ఆన్ దగో కేబుల్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.
సెక్యూరిటీ కెమెరాలా ఉపయోగించుకోవచ్చు
పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్‌లా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరాలా మార్చుకుని మీ ఇంటికి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరాలా మార్చే అనేక యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.
డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌గా ఉపయోగించుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను పలు ఫోటోగ్రఫీ యాప్స్ సహాయంతో డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌గా మార్చుకుని మీ గదికి ప్రత్యేకమైన లుక్‌ను తీసుకురావొచ్చు.
వై-ఫై ఎక్స్‌టెండర్‌లా ఉపయోగించుకోవచ్చు
ఇంట్లో వై-ఫై సమస్యలు ఉన్నట్లయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను వై-ఫై ఎక్స్‌టెండర్‌లా మార్చుకోవచ్చు. ఇందుకు కొన్ని యాప్స్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.
బేబీ మానిటర్‌లా ఉపయోగించుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను బేబీ మానిటర్‌లా ఉపయోగించుకోవచ్చు. ఇందుకు కొన్ని యాప్స్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.
పేరెంటల్ కంట్రోల్ యాప్స్
మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో పేరెంటల్ కంట్రోల్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసి పిల్లలకు ఆట వస్తువులా ఇవ్వవొచ్చు.
ల్యాప్‌టాప్‌కు టచ్‌ప్యాడ్‌లా..
మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో Gmote 2.0 అనే ఉచిత యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ల్యాప్‌టాప్‌కు టచ్‌ప్యాడ్‌లా ఉపయోగించుకోవచ్చు.
కారులో ఎంపీత్రీ ప్లేయర్‌లా ..
నిరుపయోగంగా మారిన మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కారులో ఎంపీత్రీ ప్లేయర్‌లా ఉపయోగించుకోవచ్చు.
టేబుల్ క్యాలెండర్
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అనే యాప్స్‌ను ఉపయోగించుకుని మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను పర్సనల్ టేబుల్ క్యాలెండర్‌లా ఉపయోగించుకోవచ్చు.
వీడియో కాలింగ్ కోసం ..
గూగుల్ హ్యాంగ్ అవుట్స్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌ను ఉపయోగించి మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.
యూనివర్శల్ రిమోట్ కంట్రోల్
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అనేక యాప్స్‌ను ఉపయోగించుకుని మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్శల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకోవచ్చు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.