సీసీబీ అదుపులో ఇద్దరు హ్యాకర్లు!

Posted By:

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వ్యక్తిగత మొబైల్ డేటాలను దొంగిలిస్తున్న ఇద్దరి వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పూణేకు చెందిన నిఖిల్ గిరి, వీరేంద్ర సింగ్ రావత్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. సీసీబీ పోలీసులు నిందితుల వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్‌లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ఇంకా నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు రిజిష్టర్ అయింది.

సీసీబీ అదుపులో ఇద్దరు హ్యాకర్లు!

నిందితులలో ఒకరైన నిఖిల్ గిరి బెంగుళూరు లైనిక్స్ సెక్యూరిటీ ఇంకా డిటెక్టివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. వీరేంద్ర సింగ్ రావత్ పూణేలోని మావ్రిక్ మొబైల్ సొల్యూషన్ ప్రైవేట్ లమిటెడ్ సంస్థలో పనిచేస్తున్నారు. నిఖిల్ గిరీని కలిసేందుకు ఇటీవల రావత్ బెంగుళూరుకు వచ్చారు. ఈ క్రమంలోని పోలీసులు నిఖిల్ గిరి సంస్థ పై ఆకస్మిక దాడులు జరిపి ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ప్రాథమిక విచారణలో భాగంగా నిందుతులు దేశవ్యాప్తంగా వివిధ ఫోన్ నెంబర్‌లకు సంబంధించి వ్యక్తిగత డేటాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి దొంగిలించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆధారిత మొబైల్ ఫోన్‌లను వీరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot