డిసెంబర్‌ నాటికి దేశంలో మొబైల్ యూజర్లు సంఖ్య ఎంత..?

Posted By: Staff

[caption id="attachment_6022" align="aligncenter" width="500" caption="29m subscribers opt for number portability"]

డిసెంబర్‌ నాటికి దేశంలో మొబైల్ యూజర్లు సంఖ్య ఎంత..?
[/caption]

 

న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్‌లో 94.7 లక్షల మంది కొత్తగా మొబైల్ వినియోగదారులయ్యారని టెలికాం రెగ్యులేటర్, ట్రాయ్ సోమవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం ఫోన్ వినియోగదారుల సంఖ్య 92.65 కోట్లకు చేరిందని పేర్కొంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం... నవంబర్‌లో 88.43 కోట్లుగా ఉన్న మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య డిసెంబర్‌లో 89.38 కోట్లకు చేరింది. టెలిడెన్సిటీ 76.86 శాతానికి పెరిగింది. విజిటర్ లొకేషన్ రిజిష్టర్(వీఎల్‌ఆర్) ప్రకారం, యాక్టివ్ యూజర్ల సంఖ్య 64.67 కోట్లకు చేరింది.

నవంబర్‌లో 2.58 కోట్లుగా ఉన్న మొబైల్ నంబర్ పోర్టబిలిటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య డిసెంబర్‌లో 2.92 కోట్లకు పెరిగింది. ఎంఎన్‌పీ దరఖాస్తులు అధికంగా కర్నాటక సర్కిల్‌లో వచ్చాయి. ఇక డిసెంబర్‌లో అధికంగా ఐడియా సెల్యులర్‌కు 23.8 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 10.63 కోట్లకు పెరిగింది. యూనినార్‌కు 21.2 లక్షల మంది, ఎయిర్‌టెల్‌కు 9.6 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. వొడాఫోన్, ఆర్‌కామ్‌లకు నవంబర్‌లో కంటే డిసెంబర్‌లో తక్కువ మంది కొత్త వినియోగదారులు జతైనట్లు ట్రాయ్ వెల్లడించింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting