జనాభాను మించిపోనున్న మొబైల్ ఫోన్‌లు?

Posted By: Super

జనాభాను మించిపోనున్న మొబైల్ ఫోన్‌లు?

ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్టు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

మొత్తం మొబైల్ వినియోగదారుల్లో 77శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. ఒక్కో వ్యక్తి రెండు మూడు సబ్‌స్కిప్షన్లు తీసుకోవడం మామూలైపోవటంతో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య త్వరలోనే ప్రపంచ జనాభాను మించిపోతుందన్న సంకేతాలను ఈ నివేదిక సూచిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot