వాయిస్ కాలింగ్ ఫీచర్లతో స్మార్ట్‌వాచీలు!

Posted By:

టెక్నాలజీ రిస్ట్ వాచీల రూపురేఖలనే మార్చేసింది. వాయిస్ కాలింగ్‌తో పాటు పలు మొబైల్ ఫీచర్లను సపోర్ట్ చేసే స్మార్ట్ వాచీలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ శీర్షికలో పొందుపరిచిన నాలుగు ప్రత్యేక స్మార్ట్ వాచీలు, స్మార్ట్‌ఫోన్‌ల తరహాలో ప్రత్యేక ఫీచర్లను కలిగి మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి.

యాపిల్ భవిష్యత్ ఆవిష్కరణకు సంబంధించి యాపిల్ ఆసియా పంపిణీ వర్గాలు కీలక సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెక్163 డాట్ కామ్ వెలువరించిన వివరాల మేరకు ఇంటెల్, యాపిల్ భాగస్వామ్యంలో బ్లూటూత్ ఆధారిత ఐవోఎస్ వాచ్ రూపుదిద్దుకుంటోంది. వాచ్ స్ర్కీన్ పరిమాణం 1.5 అంగుళాలు, ఇండియమ్ టిన్ ఆక్సైడ్‌తో డిస్‌ప్లే నిర్మాణం చేపట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాయిల్ కాలింగ్ ఫీచర్లతో స్మార్ట్‌వాచీలు!

మార్టియన్(Martian):

ఈ ప్రముఖ వాచీల తయారీ కంపెనీని 2007లో ప్రారంభించారు. ఈ సంస్థ తాజాగా డిజైన్ చేసిన వాచీ క్రిస్టల్ క్లియర్ వాయిస్ కాలింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. సిరీ ఇంకా గూగుల్ వాయస్ అసిస్టెంట్ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ ఆధారితంగా ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ధర అంచనా $249 నుంచి $299.

 

వాయిల్ కాలింగ్ ఫీచర్లతో స్మార్ట్‌వాచీలు!

కూకో వాచ్ (Cookoo Watch):

ఈ వాటర్ ప్రూఫ్ రిస్ట్ వాచ్‌ను కనెక్టీడివైజ్ సంస్థ వృద్ధి చేసింది. పొందుపరిచిన స్మార్ట్ బ్లూటూత్ అప్లికేషన్‌తో యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్, మెయిల్ ఇంకా ఇన్ కమింగ్ కాల్ అలర్ట్‌లను ఈ వాచ్ సూచిస్తుంది. ధర అంచనా $130. బ్యాటరీ మన్నికైన పనితీరును కనబరుస్తుంది.

 

వాయిల్ కాలింగ్ ఫీచర్లతో స్మార్ట్‌వాచీలు!

ఐ'ఎమ్ వాచ్ (I'm Watch):

ఈ వాచ్ ఆండ్రాయిడ్ 1.6 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.54 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం240× 240పిక్సల్స్), 64ఎంబి ర్యామ్, 4జీబి రోమ్, నాన్ రిమూవబుల్ బ్యాటరీ (బ్యాకప్ 2గంటలు, స్టాండ్‌బై మోడ్ 48 గంటలు). ఈ వాచ్‌ను యాపిల్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లకు జత చేసుకోవచ్చు. సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా ప్రత్యేక మ్యూజిక్ అప్లికేషన్‌లు వాచ్‌లో ఉన్నాయి.

 

వాయిల్ కాలింగ్ ఫీచర్లతో స్మార్ట్‌వాచీలు!

సోనీ స్మార్ట్‌వాచ్ (Sony SmartWatch):

ఆధునిక మొబైలింగ్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్‌ను సోనీ వృద్ధి చేసింది. పేరు సోనీ స్మార్ట్‌వాచ్. బ్లూటూత్ కనెక్టువిటీ ప్రత్యేక ఆకర్షణ. ఈ కనెక్టువిటీ ఫీచర్ సహాయంతో ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్‌లు: 1.3 అంగుళాల వోలెఈడి టచ్ స్ర్కీన్, డిస్ ప్లే రిసల్యూషన్128× 128పిక్సల్స్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot