Home
Mobile

ఐఫోన్ 16e కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లు ఉన్న 4 ఆండ్రాయిడ్ ఫోన్లు.. ధరలు చాలా తక్కువే!

Android phones: యాపిల్ కంపెనీ ఐఫోన్ 16eని మార్కెట్లోకి వదిలింది. ఇది ఐఫోన్ SE సిరీస్‌లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని ఆశించారు. కానీ కంపెనీ వాళ్లకి షాకిచ్చింది. ఇండియాలో దీని స్టార్టింగ్ ధర అక్షరాలా రూ.59,999. అంత ధర పెట్టి కొనాలంటే చాలామంది యాపిల్ ఫ్యాన్స్‌కి ఇది నిరాశే. ఒకవేళ మీకు తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలంటే, 4 అద్భుతమైన ఆండ్రాయిడ్ ఆప్షన్లు ఉన్నాయి.

* వన్‌ప్లస్ 13R
మొదటగా వన్‌ప్లస్ 13R గురించి మాట్లాడుకుందాం. ఇది పవర్‌ఫుల్ ఫోన్. 6.77- అంగుళాల ప్రోXDR LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఇంకా 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 830 GPU తో వస్తుంది.

iPhone 16e

RAM 16GB వరకు ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్‌తో డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌గా జరిగిపోతుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా (సోనీ LYT-700 సెన్సార్), 50MP టెలిఫొటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. బ్యాటరీ 6000mAh ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది.

దీని ధర కేవలం రూ.40,000 దగ్గర ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లు తక్కువ ధరలో కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఈ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు రివ్యూలు, రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో ధరలు చేసుకొని కొనడం ఉత్తమం. ఎక్కడ చీప్‌గా దొరికితే అక్కడ కొనటం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

* గూగుల్ పిక్సెల్ 8a
Google Pixel 8a ఫోన్ ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వాళ్లకి పర్ఫెక్ట్ ఛాయిస్. 6.1- అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే సూపర్ క్లారిటీతో ఉంటుంది. గూగుల్ Tensor G3 చిప్‌తో పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. 8GB రామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ సపోర్ట్. గూగుల్ ఏకంగా 7 ఏళ్లపాటు అప్‌డేట్స్ ఇస్తుంది. దీనిలో 64MP మెయిన్ కెమెరా (OISతో), 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 13MP, 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మూత్ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీకి గ్యారెంటీ.

* శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE
శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. 6.7-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో విజువల్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. ఎక్సీనోస్ 2400e చిప్‌సెట్‌తో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 4700mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. కెమెరా సెటప్ కూడా టాప్ క్లాస్‌లో ఉంటుంది.

50MP మెయిన్ కెమెరా (OISతో), 8MP టెలిఫొటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. శామ్‌సంగ్ వన్ UI 6.1 (ఆండ్రాయిడ్ 14 బేస్డ్)తో వస్తుంది. లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లు అదనపు ఆకర్షణ.

* మోటారోలా ఎడ్జ్ 50 అల్ట్రా
మోటారోలా ఎడ్జ్ 50 అల్ట్రా 6.7-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే సూపర్ స్మూత్‌గా, బ్రైట్‌గా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 735 GPU, 12GB రామ్, 512GB స్టోరేజ్‌తో పర్ఫార్మెన్స్ విషయంలో తిరుగుండదు.

దీనిలో 50MP మెయిన్ కెమెరా (OISతో), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 64MP టెలిఫొటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50MP, సెల్ఫీలు షార్ప్‌గా వస్తాయి. 4500mAh బ్యాటరీ, 125W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

హలో UI (ఆండ్రాయిడ్ 14 ) తో నడుస్తుంది. 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు గ్యారెంటీ. మొత్తానికి ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు ఐఫోన్ 16e కంటే చాలా బెటర్ వాల్యూ ఇస్తాయి. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే డిస్‌ప్లేలు, స్ట్రాంగ్ కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్, అన్నీ తక్కువ ధరలోనే.

More from GizBot

Best Mobiles in India

English summary
4 Feature-Packed Android Phones That Offer Better Value Than the iPhone 16e
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X