రెండు సిమ్‌లకే ఓహొ అంటే, మరీ నాలుగు సిమ్‌లకు..

Posted By: Staff

రెండు సిమ్‌లకే ఓహొ అంటే, మరీ నాలుగు సిమ్‌లకు..

ప్రపంచ టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతుందంటే మొన్నటి వరకు మొబైల్ మార్కెట్లో డ్యూయల్ సిమ్ ఫోన్స్ హాల్ చల్ చేశాయి. కానీ ఇప్పుడు మార్కెట్లోకి నాలుగు సిమ్‌ల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. రెండు సిమ్‌ల మొబైల్స్‌కే మార్కెట్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరి నాలుగు సిమ్‌ల మొబైల్స్ విని కళ్లు తిరుగుతున్నాయా...

ఇటీవల కాలంలో టెక్నో టెలికామ్ అనే మొబైల్ సంస్ద మార్కెట్లోకి నాలుగు సిమ్‌ల మొబైల్ పోన్స్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ని కల్పించడం వల్ల యూజర్స్ వారియొక్క మొబైల్ ఫోన్ నుండి నాలుగు నెట్ వర్క్ సర్వీసుని ఉపయోగించుకొవచ్చు. టెక్నో టెలికామ్ సంస్ద చైనా మొబైల్ సంస్ద అయినప్పటికీ మద్యతరగతి యూజర్స్‌ని దృష్టిలో పెట్టుకోని అతి తక్కువ ధరలో ఈ మొబైల్‌ని విడుదల చేయడం జరుగుతుంది.

టెక్నో టెలికామ్ విడుదల చేయనున్న ఈ మొబైల్ పేరు టి-4. నైరోబీలో ఈ మొబైల్‌ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంలో టెక్నో మార్కెటింగ్ మేనేజర్ ఆడమ్ జిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మొబైల్ విడుదలతో ప్రముఖ మొబైల్ తయారీదారులు అయిన నోకియా, శ్యామ్ సంగ్, స్పైస్, మోటరోలా లాంటి మొబైల్స్‌కు గట్టి పోటీని ఇస్తుందని తెలిపారు.

ఇండియాలో వేరు వేరు మొబైల్ తయారీదారులు ఇప్పటికే చాలా డ్యూయల్ సిమ్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. డ్యూయల్ సిమ్‌కి ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న విషయం కూడా తెలిసిందే. ఈ మొబైల్ మార్కెట్‌ని క్యాష్ చేసుకునేందుకు గాను టెక్నో టెలికామ్ సంస్ద మార్కెట్లోకి మూడు, నాలుగు సిమ్‌లు ఉపయోగించుకునే మొబైల్స్‌ని విడుదల చేస్తుంది. టెక్నో టెలికామ్ కొత్త నాలుగు సిమ్‌ల మొబైల్ కెన్యా మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 15,500వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot