Home
Mobile

మార్కెట్‌ని షేక్ చేస్తున్న OnePlus, 4ఏళ్లలో తొలిసారిగా..

ఇండియా మార్కెట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు నంబర్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నాయి.

By Hazarath Aiah

ఇండియా మార్కెట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు నంబర్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నాయి. ఆపిల్, శాంసంగ్, షియోమి లాంటి కంపెనీలు ఈ రేసులో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఇండియా మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్లిన శాంసంగ్ కు చైనా దిగ్గజం షియోమి షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షియోమికి ఆ దేశపు కంపెనీ OnePlus షాకిచ్చింది. ఇండియాలో మోస్ట్ సేల్ బ్రాండ్ గా అవతరించింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన వన్‌ప్లస్ 6 హైఎండ్ ప్రీమియం మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. 2018 ఫస్ట్ క్వార్టర్ లో ఈ కంపెనీ ఫోన్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్ గా నిలవడం శాంసంగ్, ఆపిల్ కంపెనీలను ఆశ్యర్యానికి గురిచేసింది.

నాలుగేళ్ల కాలంలో..

నాలుగేళ్ల కాలంలో..

కేవలం నాలుగేళ్ల కాలంలో OnePlus కంపెనీ ఈ ఘనతను సాధించింది. అయితే ఈ విజయం ఒక్క రాత్రిలోనే సాధ్యం కాలేదు. నాలుగేళ్ల నుంచి తన ఉత్పత్తలతో కస్లమర్లలో నమ్మకాన్ని కల్పిస్తూ ఈ స్థాయికి చేరుకుందనే చెప్పాలి.

కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి..

కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి..

కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి సరికొత్త టెక్నాలజీతో, వినియోగదారులను ఆకట్టుకునే డిజైన్ తో చేతుల్లో ఇమిడిపోయే విదంగా ఉంటుంది. మార్కెట్లో అనేక కంపెనీలు హవా చాటుతున్న నేపథ్యంలో వాటన్నింటిని తట్టుకుని ఈ స్థాయికి చేరిందంటే దాని వెనక ఎంత శ్రమ దాగి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నమ్మకాన్ని కలిగించడానికి ..

నమ్మకాన్ని కలిగించడానికి ..

వినియోగదారుల్లో నమ్మకాన్ని కలిగించడానికి కావాల్సిన ప్రతీ అంశాన్ని వన్‌ప్లస్ అందిపుచ్చుకుని వారిలో భరోసాన్ని నింపడంలో విజయవంతమయింది. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన ఉత్పత్తుల్లో రాజీపడకుండా ప్రతి దానిలో కొత్తదనాన్ని చూపిస్తూ నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలాన్ని పొందింది.

సందేహాలను నివృత్తి చేసుకునేందుకు

సందేహాలను నివృత్తి చేసుకునేందుకు

వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఫ్యాన్ కమ్యూనిటీ పేజీని కూడా OnePlus ప్రారంభించింది. ప్రతి ఉత్పత్తిపై వినియోగదారుల నుంచి ఈ సైటు ద్వారా ఫీడ్ బ్యాక్ ను స్వీకరిస్తోంది. కంపెనీ యెక్క ఉత్పత్తులు హర్డ్ వేర్, సాప్ట్ వేర్ లపై కస్టమర్లకు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ పోతోంది. వారి సందేహాలను ఎప్పటికప్పుడూ తీర్చుకుంటూ వెళుతోంది.

వినియోగదారులను ఆకట్టుకువడానికి..

వినియోగదారులను ఆకట్టుకువడానికి..

అలాగే వినియోగదారులను ఆకట్టుకువడానికి OnePlus కంపెనీ పాప్ అప్ ఈవెంట్లను కూడా నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ల ద్వారా అభిమానలకు అలాగే వన్ ప్లస్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే ఓత్సాహికుల కోసం OnePlus షోరూంల్లో ఈ రకమైన ఈవెంట్లకు తెరలేపింది.

కాంప్లిమెంటరీ టికెట్లను..

కాంప్లిమెంటరీ టికెట్లను..

అలాగే కంపెనీ అభిమానులకు స్పెషల్ మూవీని చూసే అఫర్ ని కూడా అందిస్తూ వచ్చింది. Star Wars Jedi and Avengers లాంటి సినిమాలు OnePlus కంపెనీ Disney ఆధ్వర్యంలో వచ్చిన సంగతి తెలిసిందే. OnePlus Special Edition ఉత్పత్తులో భాగంగా వీటిని అభిమానులకు కానుకగా అందిచింది. OnePlus 6 Marvels Limited Edition లాంచింగ్ సందర్భంగా 6000 కాంప్లిమెంటరీ టికెట్లను అభిమానుకు అందించింది.

ముందు ముందు..

ముందు ముందు..

పైన పేర్కొన్న విషయాలే OnePlus కంపెనీని ఇండియాలో టాప్ మేకర్ గా నిలబెట్టాయని చెప్పవచ్చు. ముందు ముందు కూడా కంపెనీ ఇలాంటి వాటిని ఇంకా నిర్వహించి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది. రానున్న కాలంలో ఈ కంపెనీ మిగతా కంపెనీలకు గట్టి షాక్ ఇస్తుందని టెక్ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
4 years of 'Creating Together with its Fans' has brought OnePlus to the top more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X