Home
Mobile

మైక్రోమాక్స్ రికార్డ్ సేల్, 48,000 ఫోన్‌లు విక్రయం..

సెప్టంబర్ 8న రెండవ సేల్...

By Sivanjaneyulu Bommu

Micromax Canvas Infinity పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అమెజాన్ ఇండియా వేదికగా సెప్టంబర్ 1న ఈ ఫోన్‌లకు సంబంధించి మొదటి ఫాష్ సేల్ జరిగింది. ఈ సేల్ ముగిసే నాటికి మొత్తం 48,000 ఫోన్‌లను మైక్రోమాక్స్ విక్రయించినట్లు తెలుస్తోంది.

సెప్టంబర్ 8న రెండవ సేల్

సెప్టంబర్ 8న రెండవ సేల్

bezel-less డిజైన్‌తో పాటు ఫుల్ విజన్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రోమాక్స్ ఫోన్‌ ధర కేవలం రూ.9,999 కావటంతో రెస్పాన్స్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లకు సంబంధించి తదుపరి సేల్ సెప్టంబర్ 8న జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే అమెజాన్ ఇండియాలో జరుగు తున్నాయి.

 హై-ఎండ్ కెమెరా, bezel-less డిజైన్‌, 18:9 aspect ratio డిస్‌ప్లే

హై-ఎండ్ కెమెరా, bezel-less డిజైన్‌, 18:9 aspect ratio డిస్‌ప్లే

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ఫోన్‌లో ఇన్నోవేటివ్ ఫీచర్స్‌కు తోడు హై-ఎండ్ కెమెరా, bezel-less డిజైన్‌, 18:9 aspect ratio డిస్‌ప్లే వంటి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి.

పూర్తి మెటల్‌ బాడీ...

పూర్తి మెటల్‌ బాడీ...

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ఫోన్ టాప్ ఇంకా బోటమ్ ఎడ్జెట్ తప్పితే మిగిలిన బాడీ మొత్తం పూర్తి మెటల్‌తో కవర్ అయి ఉంటుంది. బ్రష్షుడ్ మెటల్ ఫినిషింగ్ ఆకట్టుకుంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది.

5.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే...

5.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే...

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ 5.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 18:9 aspect ratioని కలిగి ఉండే ఈ డిస్‌ప్లే రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1440 x 720పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. వీడియోలను స్ట్రీమ్ చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ హైడెఫినిషన్ డిస్‌ప్లే మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

క్వాలిటీ కెమెరా..

క్వాలిటీ కెమెరా..

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ స్మార్ట్‌ఫోన్‌కు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. రియల్ టైమ్ బోకెహ్ ఎఫెక్ట్, ఆటో సీన్ డిటెక్షన్, 18:9 కెమెరా వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ కెమెరా f/2.0 apertureను కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లు...

ఇతర ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2900mAh బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ ఆన్ ద గో, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Best Mobiles in India

English summary
48,000 units of Micromax Canvas Infinity sold before Amazon ran out of stocks. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X