శ్యామ్‌సంగ్, ఎల్‌జి స్మార్ట్ ఫోన్స్ మద్య 4జి యుద్దం

ఇండియాలో మద్య తరగతి కుటుంబ ప్రజలు ఎక్కువ. వారిని దృష్టిలో పెట్టుకోని మొబైల్ ఫోన్స్‌ని తయారు చేయడంలో ఈ రెండు కంపెనీలది కూడా ప్రత్యేకమైన శైలి. ఈరోజు మనం ఎల్‌జి, శ్యామ్‌సంగ్ కంపెనీలకు సంబంధించి రెండు స్మార్ట్ పోన్స్‌ల ఫీచర్స్‌ని చూద్దాం. ఆ రెండు మోడల్స్ ఎల్‌జి ధ్రిల్స్, శ్యామ్‌సంగ్ ఎగ్జిబిట్. రెండు మోడల్స్ కూడా 4జి కేటగిరికి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్. రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా చూడడానికి కార్పోరేట్ లుక్ తోటి, చాలా అందంగా, స్టయిల్‌గా ఉన్నాయి. రెండు మొబైల్స్ కూడా టచ్ స్క్రీన్ డిప్లే మొబైల్ పోన్స్. ఎల్‌జి ధ్రిల్ డిప్లే సైజు శ్యామ్ సంగ్ ఎగ్జిబిట్‌తో పోల్చితే చాలా పెద్దది.
రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మల్టీమీడియా, ఎంటర్ట్ న్మెంట్‌ని దృష్టిలో పెట్టుకోని రూపోందించడం జరిగింది. మల్టీమీడియా ఫార్మెట్స్ అయిన MP3, MP4, WAV, WMV లాంటి వాటన్నింటిని సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు ఆడియో, వీడియో ప్లేబ్యాక్, రికార్డింగ్ ఫెసిలటీ కూడా అదనపు ప్రత్యేకం. ఇక ఎల్‌జి విషయానికి వస్తే 3డి స్క్రీన్‌ని కలిగి ఉండడంతో 3జి కంటెంట్ ప్లేబ్యాక్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. రెండు ఫోన్స్ కూడా 3.5mm ఆడియో జాక్స్‌ని కలిగి ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీరు కొంచెం నిరాశకు గురి కావాల్సి వస్తుంది. ఎల్‌జి ధ్రిల్ మాత్రం 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండగా, అదే శ్యామ్‌సంగ్ ఎగ్జిబిట్ మాత్రం 3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది.
ఎల్‌జి ధ్రిల్ 1080p వీడియో రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తే శ్యామ్‌సంగ్ ఎగ్జిబిట్ మాత్రం విజిఎ క్వాలిటీ రికార్డింగ్‌ని అందిస్తుంది. ఇక లెటేస్ట్ కమ్యానికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై లాంటి వాటిని సపోర్ట్ చేస్తాయి. శ్యామ్‌సంగ్ ఎగ్జిబిట్ ఇంటర్నెట్ డెటా ట్రాన్పర్ ఎల్‌జి ద్రిల్‌తో పోల్చితే చాలా స్పీడ్‌గా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు మొబైల్స్ ధరలు మాత్రం బయటకు వెల్లిడంచ లేదు.


Click it and Unblock the Notifications








