అప్పుడు రూ.2000కే నోకియా 4జీ ఫోన్ ఇస్తారా..?

అలా జరిగితే 4జీ ఫీచర్ ఫోన్లను ఇండియాలో మనం చూడగలుగుతాం...

|

భారత్ వంటి ప్రముఖ మొబైల్ ఫోన్ మార్కెట్లలో తమ ఫీచర్ ఫోన్‌లకు ఇప్పటికీ డిమాండ్ ఉందని నోకియా భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే నోకియా 3310 (2017) వర్షన్‌ను కూడా ఎండబ్ల్యూసీ 2017లో హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ 2జీ కనెక్టువిటీతో మాత్రమే అందుబాటులో ఉంటుందని నోకియా లాంచ్ సమయంలోనే వెల్లడించింది.

Read More : ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్, ఆఫర్లు ఇవే..

 పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం

పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం

క్వాల్కమ్ కంపెనీ తాజాగా 205 SoCను విడుదల చేయటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌లను నోకియా వినియోగించుకోవటం మొదలు పెట్టినట్లయితే తప్పనిసరిగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్ లను ఇండియాలో మనం చూడగలుగుతాం. ఇవి కూడా అందుబాటు ధరల్లోనే లభ్యమవుతాయి.

LTE ఇంకా 4G VoLTE

LTE ఇంకా 4G VoLTE

ప్రత్యేకించి ఫీచర్ ఫోన్ల కోసం రూపొందించబడిన Qualcomm 205 SoC   LTE ఇంకా 4G VoLTE కనెక్టువిటీలను సపోర్ట్ చేస్తుంది.

 

రూ.3,500లోపు..

రూ.3,500లోపు..

రూ.3,500లోపు లభ్యమయ్యే అన్ని ఫీచర్ ఫోన్‌లలో 4జీ సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ క్వాల్కమ్ సాక్ రూపుదిదదుకుందట. ఈ చిప్‌లో ఏర్పాటు చేసిన LTE Cat. 4 మోడెమ్, 150Mbps వరకు డౌన్‌లోడ్ వేగంతో పాటు 50Mbps వరుక అప్‌లోడ్ వేగాన్ని ఆఫర్ చేయగలదని క్వాల్కమ్ చెబుతోంది. 4G VoLTE కనెక్టువిటీతో పాటు 3జీ, 2జీ
నెట్‌వర్క్‌లను కూడా ఈ చిప్ సెట్ సపోర్ట్ చేస్తుంది. 

పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరా సపోర్ట్

పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరా సపోర్ట్

డ్యుయల్ సిమ్, ANT+, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్, వై-ఫై వంటి కనెక్టువిటీ ఫీచర్లను క్వాల్కమ్ 205 సాక్ ఆఫర్ చేయగలదు. ఈ చిప్‌సెట్‌లో పొందుపరిచిన డ్యుయల్ కోర్ (క్లాక్ స్పీడ్ 1.1GHz) ప్రాసెసర్ 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరాలను సపోర్ట్ చేయగలదు.

హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌ సపోర్ట్ కూడా..

హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌ సపోర్ట్ కూడా..

లైనక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో పాటు హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌ను కూడా ఈ చిప్ సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ కొత్త చిప్‌తో కూడిన ఫీచర్ ఫోన్‌లు త్వరలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మైక్రోమాక్స్, లావా వంటి కంపెనీలు  4G VoLTE ఫీచర్ ఫోన్ లను మార్కెట్లో అనౌన్స్ చేసాయి. త్వరలో రిలయన్స్ జియో కూడా కారు చౌక 4G VoLTE ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

Best Mobiles in India

English summary
4G Nokia feature phone with Qualcomm 205 likely in the making. Read Mor in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X