5,000mAh బ్యాట‌రీతో Oppo A77s స్మార్ట్‌ఫోన్ భార‌త మార్కెట్లో విడుద‌ల‌!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Oppo, భార‌త్‌లో త‌న ఉత్ప‌త్తుల్ని క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా మ‌రో కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆ కంపెనీ భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Oppo A77s పేరుతో కొత్త మోడ‌ల్ మొబైల్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది.

Oppo

ఈ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAMతో జత చేయబడిన స్నాప్‌డ్రాగన్ 480 SoC ప్రాసెస‌ర్ అమర్చబడింది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా, బ్యాక్‌సైడ్ 50-మెగాపిక్సెల్ AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడింది. స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Oppo A77s సన్‌సెట్ ఆరెంజ్ మరియు స్టార్రీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విక్రయించనుంది.

భారత మార్కెట్లో Oppo A77s ధర, లభ్యత:
భారతదేశంలో కొత్తగా ప్రారంభించబడిన Oppo A77s మొబైల్‌ 8GB + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో విక్రయించబడుతుంది. దీని ధ‌ర‌ను కంపెనీ రూ.17,999 గా నిర్ణ‌యించింది. ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా విక్ర‌యించ‌బ‌డుతుంది.

Oppo

ఇక క‌ల‌ర్ల విష‌యానికొస్తే.. స‌న్‌సెట్‌ ఆరెంజ్ మరియు స్టార్రి బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ మొబైల్ అక్టోబర్ 7 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్ల‌డించింది. ఈ Oppo A77s మొబైల్‌ను అర్హత కలిగిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయ‌డంతో 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది.

Oppo A77s ఫీచ‌ర్లు, స్పెసిఫికేషన్స్:
Oppo A77s మొబైల్ యొక్క స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ (720x1,612 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ప్రాసెస‌ర్ దీనికి అమ‌ర్చ‌బ‌డింది. 8GB LPDDR4x RAMతో జత చేయబడింది. Oppo A77s డ్యూయల్ సిమ్ (నానో) హ్యాండ్‌సెట్, ఇది Android 12-ఆధారిత ColorOS 12.1పై నడుస్తుంది.

Oppo

ఇక ఫొటోలు, వీడియోల విష‌యానికొస్తే.. ఈ Oppo A77s బ్యాక్‌సైడ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు f/2.4 అపెర్చర్ లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు మ‌రియు వీడియో కాలింగ్ కోసం f/2.0 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఉంది, దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మరింత విస్తరించవచ్చు.

Oppo A77sలోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్ v5.0, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. Oppo A77s బయోమెట్రిక్ భ‌ద్ర‌త కోసం ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ మొబైల్ 33W SuperVooc ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

భారతదేశంలో కొత్తగా ప్రారంభించబడిన Oppo A77s మొబైల్‌ 8GB + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో విక్రయించబడుతుంది. దీని ధ‌ర‌ను కంపెనీ రూ.17,999 గా నిర్ణ‌యించింది. ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా విక్ర‌యించ‌బ‌డుతుంది. ఈ మొబైల్ అక్టోబర్ 7 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్ల‌డించింది. ఈ Oppo A77s మొబైల్‌ను అర్హత కలిగిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయ‌డంతో 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Oppo A77s smartphone launched in india. with 5000mAh battery

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X