ఫోన్ లాక్ అయ్యిందా? ఓపెన్ చేయడం సింపుల్!

Posted By: Madhavi Lagishetty

చాలామంది తమ మొబైల్ ఫోన్లకు రకరకాల పాస్ వర్డ్ లను పెట్టుకుంటారు. తమ పర్సనల్ మ్యాటర్స్ ను ఇతరులు చెక్ చేయకుండా పాస్ వర్డ్ లను క్రియేట్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ సమాచారం సురక్షితంగా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ కు లాక్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్స్ తో వస్తుంది. దీని వల్ల యూజర్లు వారి ఫోన్ స్ర్కీన్ పలు మార్గాల ద్వారా , పిన్, పాస్ వర్డ్, పాట్రాన్, ఫింగర్ ప్రింట్ లాక్ చేసుకోవచ్చు.

ఫోన్ లాక్ అయ్యిందా? ఓపెన్ చేయడం సింపుల్!

కొన్ని అనుకోని సందర్భాల్లో మీరు పిన్ పాట్రాన్ లేదా లాక్ ను మార్చవచ్చు. తర్వాత ఫిన్ కానీ పాట్రాన్ మార్చిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు లాక్ను తెలసుకునేందుకు కొన్ని మెథడ్స్ మీకోసం అందిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెథడ్ 1....

రికవరీ మోడ్...

ఇది లాక్ స్క్రీన్ను తొలగిస్తుంది. లేదా తీసివేయడానికి ఈజీ మార్గాల్లో ఇది ఒకటని చెప్పవచ్చు. మీరు ప్యాక్టరీ రిసోర్ట్ కోసం సెట్టింగ్స్ కు వెళ్లి, మీ ఫోన్ను రీసెట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ డివైసును రికవరీ మోడ్లో ఉంచాలి.

స్టెప్ 1. ఫస్ట్, మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయాలి. రికవరీ మోడ్లోకి ఎంటర్ అవడానికి వాల్యూమ్ అప్, హోం మరియు పవర్ బటన్లను ఒకే సమయంలో ఉంచాలి.

స్టెప్2. బూట్ లోడర్ ఓపెన్ చేసిన తర్వాత, రికవరీ మోడ్ ను సెలక్ట్ చేసుకుని రికవరీ మోడ్లోకి ప్రవేశించడానికి పవర్ బటన్ను ప్రెస్ చేయాలి.

స్టెప్3. ఇప్పుడు రికవరీ మోడ్లో ఉన్నప్పుడు, డేటా/ఫ్యాక్టరీ రీసెట్ను వైప్ డాటా ఫ్యాక్టరీ సెలక్ట్ చేయడానికి వాల్యూబ్ డౌన్ బటన్ను ఉపయోగించండి. తర్వాత దాన్ని సెలక్ట్ చేసుకోండి. మీ మొబైల్ ఇప్పుడు రీబూట్ అవుతుంది.

మెథడ్2....

సేఫ్ మెడ్లో బూట్ ఫోన్ మీరు థర్డ్ పార్టీ లాక్ స్క్రీన్ను ఇన్ స్టాల్ చేయాలి. దాని పాస్ చేస్తే...ఈ మెథడ్ ఈజీ అవుతుంది. మీరు మీ ఫోన్ను స్వీచ్ ఆప్ చేయడానికి కొన్ని సెకన్ల పాటు పవర్ బటన్ను పట్టుకోవాలి. తర్వాత సేఫ్ మోడ్లోకి ఎంటర్ కావాలనుకుంటున్నట్లు నిర్దారించడానికి మీ ఫోన్ కొన్ని సెకన్ల పాటు ఆఫ్ అవుతుంది. ఈ మోడ్ లాక్ స్క్రీన్ యాప్ యొక్క డేటాను క్లియర్ చేస్తుంది. లేదా దాన్నిఅన్ ఇన్ స్టాల్ చేసి, రీబూట్ చేడయం ద్వారా సేఫ్ మోడ్ నుంచి తిరిగి బ్యాక్ అప్ చేయబడుతుంది.

ఇండియా మార్కెట్‌ని శాసిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే !

మెథడ్3....

ఆండ్రాయిడ్ డివైస్ మెనేజర్.

ఆండ్రాయిడ్ డివైస్ మెనేజర్ని ఉపయోగించడం ద్వారా మీరు లాక్ స్క్రీన్ను డిలీట్ చేయవచ్చు. మీరు మీ ఫోన్లోని గూగుల్ అకౌంట్లోకి లాగిన్ చేసినట్లయితే ఇది వర్క్ చేస్తుంది. మీరు దీనికిలోకి వెళ్లడం ద్వారా ఈ ప్రొసెస్ కొనసాగించవచ్చు.

స్టెప్1. జీమెయిల్ ఐడితో ఆండ్రాయిడ్ డివైస్ మెనేజర్ను లాగిన్ చేయండి. మీరు పాస్ వర్డ్ తో పాటు ఫోన్లో కూడా ఉపయోగిస్తారు.

స్టెప్2. డివైస్ కనెక్ట్ అయిన తర్వాత, లాక్ బటన్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత ప్రస్తుత పిన్, పాట్రన్ లేదా పాస్ వర్డ్ ను రీప్లేస్ చేయడానికి కొత్త విండోను అడుగుతుంది.

స్టెప్3. కొత్త పాస్ వర్డును టైప్ చేసి...దానిని కన్ఫర్మ్ కావాలి.

మెథడ్4....ADBని ఉపయోగించండి.

ఈ మెథడ్ కి వస్తే...అది వ్యాలిడిటి అవుతుంది. మీరు ముందుగానే USB డీబగ్గింగ్ ఆప్షన్ను ఎనేబుల్ చేశారు. మీరు ఇప్పటికే ఎనేబుల్ అయి ఉంటు..మీరు పీసీ ని మీ ఫోన్ కనెక్ట్ అయితే మీ పీసీ ADB ద్వారా కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ కమాండ్ ఫీచర్ను టైప్ చేయండి. Adb shell rm/data/system/gesture.key మరియు enterను ప్రెస్ చేయండి. ఇది మీ ఫోన్ను రీబూట్ చేస్తుంది. దీంతో మీరు మీ లాక్ స్క్రీన్ను మార్చుకోవచ్చు.

మెథడ్ 5.... మీ మొబైల్ సర్వీసును ఉపయోగించండి.

మీరు శాంసంగ్ ఫోన్లను వాడుతుంటే...ఈ ఆప్షన్ మీ కోసం...

క్రింద దశలను అనుసరించడం ద్వారా ఈ మెథడ్ కొనసాగించండి.

స్టెప్1. మీరు మీ శాంసంగ్ అకౌంట్ కు లాగిన్ అవ్వండి.

స్టెప్ 2. ఇప్పుడు నా స్క్రీన్ లాక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3 ఒకసాని కంప్లీట్ అయితే , కొత్త పిన్ ఎంటర్ చేసి లాక్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4 కొత్త పిన్ తో మీరు అన్లాక్ పిన్ మారిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
One of the main reason to apply a lock on our smartphone is to keep others away from checking our personal information. In the worst case, you could change PIN or pattern lock in some urgency and later forget it. If you have been in that situation or in that situation currently, we have compiled some tested method that you can use to bypass the lock.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot