Home
Mobile

2025లో రూ.12 వేలకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. గేమర్స్ అయినా, ఫొటోగ్రఫీ లవర్స్ అయినా, ఈ ఫోన్లు మీ కోసమే!

Budget smartphones: రూ.12 వేలలోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే మెరుగైన ఫీచర్లతో కూడిన ఫోన్లు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో 5G స్పీడ్, మంచి కెమెరా, స్మూత్ డిస్‌ప్లే, రోజంతా బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లలన్నీ పొందొచ్చు. మేం పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే.. ఇలా ప్రతీదీ చెక్ చేసి ఈ బడ్జెట్‌లో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్టు తయారు చేశాం.

గేమర్స్, ఫొటోగ్రఫీ లవర్స్, రెగ్యులర్ యూజర్, ఇలా అందరికీ సెటయ్యే ఫోన్స్ ఇందులో ఉన్నాయి. రూ.12,000లోపు ఫోన్‌లో 5G కనెక్టివిటీ, ల్యాగ్స్ లేకుండా హ్యాండిల్ చేయగల ప్రాసెసర్‌, క్వాలిటీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు ఉన్నవే కొనాలి. ఛార్జింగ్ ఎక్కువ వచ్చేలా చూసుకోవాలి.

5 Budget Phones Revealed  5 Standout Smartphones Under Rs 12 000 You Can Buy Right Now

* 2025లో రూ.12,000లోపు బెస్ట్ ఫోన్స్

1. మోటోరోలా G35 5G - (అమెజాన్‌లో రూ.10,499)

5G కావాలి.. కానీ బడ్జెట్ తక్కువ అనుకుంటే.. మోటోరోలా G35 5G ది బెస్ట్ ఆప్షన్. మీడియాటెక్ MT815 చిప్‌సెట్‌తో వస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ ఉంటాయి. డైలీ పనులన్నీ స్మూత్‌గా లాగించేస్తుంది. ఆండ్రాయిడ్ 14తో మోటో యూఐ ఉంటుంది.. సింపుల్ అండ్ క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ.

కెమెరాలు కూడా క్వాలిటీవి ఇచ్చారు. 50MP AI రియర్ కెమెరాతో షార్ప్ ఫోటోలు గ్యారెంటీ, 8MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకి అదిరిపోతుంది. 6.72- అంగుళాల LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో స్క్రోలింగ్, గేమింగ్ కూడా స్మూత్ గా ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీగా 5G ఫోన్ కావాలంటే ఇది సూపర్ ఛాయిస్.

2. ఐకూ Z9x 5G - (అమెజాన్‌లో రూ.11,999)

స్పీడ్ కావాలనుకునే గేమర్స్‌కు ఐకూ Z9x 5G పర్ఫెక్ట్ పిక్. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో వస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ ఉంటాయి. 6.72-అంగుళాల LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఇది వస్తోంది. ఇందులో సినిమాలు అద్భుతంగా వస్తాయి. స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

సన్‌లైట్‌లో ఉన్నా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. 50MP AI కెమెరా డీసెంట్ పిక్చర్స్ తీస్తుంది. 6000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. జస్ట్ 30 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే 10 గంటలు వాడొచ్చు. బ్యాటరీ పెద్దగా ఉన్నా ఫోన్ మాత్రం స్లిమ్ (7.99mm) అండ్ లైట్‌వెయిట్‌గా ఉంటుంది. స్టైలిష్ లుక్ కూడా ఉంది.

3. పోకో M6 ప్లస్ 5G (అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999)

పోకో M6 ప్లస్ 5G బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. కానీ ఫీచర్లు మాత్రం అదిరిపోతాయి. 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి.

ఇందులో హైలైట్ ఏంటంటే 108MP మెయిన్ కెమెరా. ఈ రేంజ్‌లో ఇంత మంచి కెమెరా అంటే మామూలు విషయం కాదు. 5030mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. హైపర్‌ఓఎస్ (ఆండ్రాయిడ్ 14 బేస్డ్) తో వస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి.

4. వివో T3x 5G (అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499)

వివో T3x 5G స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా క్లియర్ ఫొటోలు తీస్తుంది. సెకండరీ కెమెరా అంత యూజ్‌ఫుల్ కాకపోయినా సెల్ఫీ కెమెరా మాత్రం డీసెంట్‌గా ఉంటుంది.

దీని 6.7-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ సూపర్ ఉంటుంది. 6000mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేదు. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్‌ల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. స్టైలిష్ లుక్ కావాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్.

5. శామ్‌సంగ్ గెలాక్సీ F15 5G - (అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499)

శామ్‌సంగ్ లవర్స్‌కు గెలాక్సీ F15 5G బెస్ట్ ఛాయిస్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో వస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి. 6.5-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వైబ్రెంట్ కలర్స్, స్మూత్ పర్ఫార్మెన్స్ గ్యారెంటీ.

50MP మెయిన్ కెమెరా, 5MP, 2MP లెన్స్‌లు అందించారు. 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14, శామ్‌సంగ్ వన్ UIతో స్మూత్, యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ పక్కా. బోనస్ ఆప్షన్ కూడా ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ M15 5G అమెజాన్‌లో రూ.12,999కే లభిస్తోంది.

ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్, 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో విజువల్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుంది. 50MP మెయిన్ కెమెరా, 5MP సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌లు ఇచ్చారు.

13MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వన్ యూఐ (ఆండ్రాయిడ్ 14)తో వస్తుంది. నాలుగు OS అప్‌డేట్స్ ఇస్తారు, లాంగ్ టర్మ్ యూసేజ్ కి ఇది బెస్ట్ ఆప్షన్. పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ బాగా చెక్ చేసుకొని మీకు ఏది బెస్ట్‌గా నిలుస్తుందో సెలెక్ట్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Looking for best smartphones under Rs 12,000 in 2025? This guide lists top 5G phones with good cameras, displays, and battery life. Models like Motorola G35, iQOO Z9x, and more are recommended.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X