Home
Mobile

స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. ఈ 5 చిట్కాలు తెలుసుకుంటే రిపేర్ షాపుకు వెళ్లాల్సిన పనే లేదు!

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాయి. కానీ వీటిని రిపేర్ చేయించాలంటే మాత్రం జేబులు గుల్ల అవ్వాల్సిందే. కంపెనీలు కొత్త ఫీచర్ల గురించి గొప్పగా చెబుతుంటాయి కానీ, మీ ఫోన్ ఎక్కువ కాలం పనిచేసేలా ఏం చేయాలో మాత్రం పెద్దగా చెప్పరు. అయినా చింతించాల్సిన అవసరం లేదు, మీ ఫోన్‌ని డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి, దాని లైఫ్ పెంచడానికి ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి.

1. ప్రొటెక్టివ్ కేస్ వాడాలి

బంపర్ కేస్ ఫోన్‌ను కింద పడినప్పుడు షాక్స్‌ని తట్టుకుని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. స్క్రీన్, కెమెరా లెన్స్‌లకు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. Spigen లేదా CASEOLOGY వంటి మంచి బ్రాండ్స్ స్టైలిష్‌గా, స్ట్రాంగ్‌గా ఉండే కేస్‌లను అందిస్తున్నాయి. మీ ఫోన్‌కి పర్ఫెక్ట్ ఫిట్ కోసం ఆయా కంపెనీ వెబ్‌సైట్‌లలో చెక్ చేయవచ్చు.

5 Expert Tips to Protect Your Smartphone and Save Big on Repairs

2. బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోవాలి

స్మార్ట్‌ఫోన్ పనితీరుకి బ్యాటరీ చాలా ముఖ్యం. బ్యాటరీ హెల్త్‌ని కాపాడుకోవడానికి ఫోన్‌ని 20% నుండి 80% మధ్యలో ఛార్జ్ చేయండి. బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు వెయిట్ చేయకండి, అలాగని 100% వరకు ఛార్జ్ చేస్తూ ఉండకండి. ఫోన్ స్పెసిఫికేషన్స్‌కి సరిపోయే ఛార్జర్ మాత్రమే వాడండి. చీప్ క్వాలిటీ, లోకల్ ఛార్జర్లు అస్సలు వద్దు.

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించాలి. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ క్లోజ్ చేయాలి. ఎక్కువ వేడి, ఎక్కువ చల్లని ప్రదేశాల్లో ఫోన్ పెట్టకూడదు. ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా కేస్ తీసేయాలి. బ్యాటరీ పనితీరు మెరుగుపరచడానికి మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి.

లొకేషన్ సర్వీసెస్, వై-ఫై, బ్లూటూత్ అవసరం లేనప్పుడు టర్న్ ఆఫ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లను క్లియర్ చేయడానికి అప్పుడప్పుడు మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు మంచి బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే.. రెడ్‌మీ నోట్ 14 ప్రో, ఒప్పో ఫైండ్ X8, వన్‌ప్లస్ 13 వంటి ఫోన్లు బెస్ట్ ఆప్షన్స్.

3. ఫోన్‌ను సరిగ్గా క్లీన్ చేయాలి

మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము, ధూళి పేరుకుపోతే ఛార్జింగ్ స్లో అవ్వడం లేదా కనెక్షన్ సరిగా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఎలా క్లీన్ చేయాలంటే ఛార్జింగ్ పోర్ట్‌లోని మురికిని తీయడానికి టూత్‌పిక్ (పళ్ల పుల్ల) వాడాలి. చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి.

కేబుల్ పిన్లను తడి Q-టిప్‌తో క్లీన్ చేయాలి. నీటిని నేరుగా ఫోన్‌పై స్ప్రే చేయవద్దు. వాటర్‌ప్రూఫ్ ఫోన్లు అయినా కొన్నిసార్లు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫోన్‌ను సేఫ్‌గా క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్ లేదా ఎలక్ట్రానిక్ క్లీనింగ్ సొల్యూషన్స్ వాడాలి. షాప్స్‌కి వెళ్లి అనుభవం ఉన్న వారితో కూడా క్లీన్ చేయించొచ్చు.

4. కింద పడకుండా జాగ్రత్తలు

కేస్ ఉన్నా, ఫోన్ కింద పడితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కోసం టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ వాడాలి. స్క్రీన్ రెస్పాన్సివ్‌నెస్‌పై ఎఫెక్ట్ చూపించకుండా మంచి క్వాలిటీ ఉన్నదాన్ని చూసి కొనాలి. పెద్ద ఫోన్‌లకు గ్రిప్ కోసం పాప్ సాకెట్ వాడాలి.

5. నీటి నుంచి రక్షణ

వర్షాకాలంలోనే కాకుండా అన్ని కాలాల్లో ఫోన్లు నీటిలో పడిపోవడం లేదా నీటి వల్ల డ్యామేజ్ అవ్వడం కామన్. IP64 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఫోన్లు కూడా ఉప్పు నీరు లేదా క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్‌లో పడితే పాడైపోయే ప్రమాదం ఉంది. భారీ వర్షాల సమయంలో వాటర్‌ప్రూఫ్ కవర్స్ వాడాలి.

ఒకవేళ మీ ఫోన్ నీటిలో పడితే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. కొన్ని గంటల తర్వాత ఆరిన తర్వాతే వాడాలి లేదా ఛార్జ్ చేయాలి. ఫోన్‌లోని తేమను పీల్చుకోవడానికి సిలికా జెల్ ప్యాకెట్స్ ఉన్న కంటైనర్‌లో ఫోన్‌ను పెట్టండి. పాత చిట్కా అయిన బియ్యం వాడటం అంత మంచిది కాదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Protect your smartphone by caring for its battery, cleaning it properly, using a case and screen protector. Prevent water and drop damage. Following these tips extends your phone's life and saves on repair costs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X