8జీబి ర్యామ్, 256జీబి స్టోరేజ్‌తో హెచ్‌టీసీ ఫోన్..?

హెచ్‌టీసీ 10కు సక్సెసర్ వర్సన్‌గా రాబోతోన్న హెచ్‌టీసీ 11 ఫోన్ కు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.

8జీబి ర్యామ్, 256జీబి స్టోరేజ్‌తో హెచ్‌టీసీ ఫోన్..?

Read More : ఈ ఫోన్‌లు కొంటే రిలయన్స్ జియో ఏడాది ఉచితం..?

వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ కాబోయే ఈ సరికొత్త ఫ్లాష్‌షిప్ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న పలు ఆసక్తికర రూమర్స్‌ను ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లే‌

హెచ్‌టీసీ 11 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లే‌తో వచ్చే అవకాశం. ఈ డిస్‌ప్లే‌కు అనుసంధానించే హెచ్‌టీసీ సిగ్నేచర్ బూమ్‌సౌండ్ స్పీకర్స్ హైక్వాలిటీ మల్టీ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయి.

మెటల్ యునిబాడీ, వాటర్ - డస్ట్ రెసిస్టివిటీ

అప్‌గ్రేడ్ చేయబడిన మెటల్ యునిబాడీ, వాటర్ - డస్ట్ రెసిస్టివిటీ వంటి అంశాలు హెచ్‌టీసీ 11 స్మార్ట్‌ఫోన్‌ను ఆధునిక మార్కెట్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా నిలబెడతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా ప్రత్యేకమైన వీఆర్‌ హెడ్‌సెట్‌ను కూడా హెచ్‌టీసీ అందించబోతోంది.

డ్యుయల్ కెమెరా సెటప్‌

హెచ్‌టీసీ 11 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఎల్‌జీ జీ5, యాపిల్ ఐఫోన్ 7 ప్లస్, హువావే పీ9 ఫోన్‌ల తరహాలోనే హెచ్‌టీసీ 11 స్మార్ట్‌ఫోన్ కూడా డ్యుయల్ కెమెరా సెటప్‌తో రానుంది. తన హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను హెచ్‌టీసీ ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Android 7.0 Nougat

హెచ్‌టీసీ 11 స్మార్ట్‌ఫోన్ Android 7.0 Nougat ఆపరేటింగ్ సిస్టంతో రాబోతోంది. ఈ ఓఎస్ ఆధారంగా డిజైన్ చేసే లేటెస్ట్ వర్షన్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను హెచ్‌టీసీ 11లో నిక్షిప్తం చేయనున్నారు.

8జీబి ర్యామ్, 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్

హెచ్‌టీసీ 11 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 8జీబి ర్యామ్ సపోర్ట్‌తో కూడిన క్వాల్కమ్
స్నాప్‌డ్రాగన్ 830 సాక్‌తో లభ్యమయ్యే అవకాశం. 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశముందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Features to Expect from HTC 11. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot