సెల్ఫీ ఫోటోలకు ఈ ఫోన్ పర్‌ఫెక్ట్ ఛాయిస్

సెల్ఫీ క్రేజ్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ విభాగంలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సెల్ఫీ మానియా సరికొత్త భావవ్యక్తీకరణను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన విప్లవాత్మక కెమెరా టెక్నాలజీతో ప్రత్యేకమైన సెల్ఫీ సెంట్రిక్ ఫోన్‌లను రూపొందించి వాటిని ప్రప్రధమంగా మార్కెట్లోకి తీసుకువచ్చిన ప్రముఖ బ్రాండ్‌లలో OPPO ఒకటి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒప్పో F1, F1 Plus ..

ఒప్పో కంపెనీ తన ఎఫ్1 సిరీస్ నుంచి మార్కెట్లో లాంచ్ చేసిన F1, F1 Plus ఫోన్‌లు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో సరికొత్త ఒరవడికి నాందిపలికాయి. తన సెల్ఫీ సిరీస్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒప్పో తాజాగా A57 పేరుతో సరికొత్త సెల్ఫీ సెంట్రిక్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒక్క సెల్ఫీ కెమెరా విభాగంలో మాత్రమే కాదు హార్డ్‌వేర్ ఇంకా ఫీచర్స్ పరంగా కూడా OPPO A57 దుమ్ము రేపుతోంది. 1.4GHz స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ ఫోన్ ధర ట్యాగ్ రూ.14,990గా ఉంది. ఈ ఫోన్‌లను Flipkart, Snapdeal, Amazon.in వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఒప్పో రిటైల్ స్టోర్‌లలో కూడా విక్రయిస్తున్నారు. OPPO A57 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

OPPO A57 స్మార్ట్‌ఫోన్ విప్లవాత్మక 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఈ కెమెరాలో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన ఇమేజ్ సెన్సార్ తక్కువ వెళుతరులోనూ బెస్ట్ క్లాస్ సెల్ఫీ షాట్స్‌ను ఆఫర్ చేస్తుంది. ప్రకాశవంతమైన సెల్ఫీ షాట్‌లను ప్రొడ్యూస్ చేసే లక్ష్యంతో ఈ కెమెరా ఇతర స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో పోలిస్తే 4 రెట్లు అధికంగా ఇన్‌కమింగ్ లైట్‌ను పికప్ చేసుకుంటుంది. ఇదే సమయంలో కెమెరాలోని Beautify 4.0 మోడ్ ఫోటలకు సహజసిద్ధమైన కలర్ టోన్స్‌ను అద్దుతుంది. ఈ కెమెరా కోసం ప్రత్యేకించి palm shutter పేరుతో సరికత్త ఫీచర్‌ను ఒప్పో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే సెల్ఫీ‌లను చిత్రీకరించేకునేందుకు ప్రతిసారి షట్టర్ బటన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీ చేయిని పైకి లేపితే చాలు సెల్ఫీ దానంతటకదే క్యాప్చుర్ కాబడుతుంది.

స్టోరేజ్ పరంగానూ భేష్...

స్టోరేజ్ పరంగానూ OPPO A57 స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటోంది. 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్‌లో స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే వెసలుబాటు కూడా ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ఫోన్‌లో మొత్తం మూడు స్లాట్‌లు ఉంటాయి. అందులో రెండు స్లాట్‌లను ప్రత్యేకించే సిమ్ కార్డ్స్ కోసం మరొక స్లాట్‌ను స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవటం కోసం కేటాయించారు.

బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌

సెక్యూరిటీ పరంగానూ ఈ ఫోన్‌లో బలమైన ఫీచర్‌ను పొందుపరిచారు. OPPO A57 ఫోన్ శక్తివంతమైన బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తోంది. ఈ సెన్సార్ చాలా వేగంగా పనిచేస్తుంది. రెప్పపాటులో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

వేగవంతమైన మల్టీ టాస్కింగ్..

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి OPPO A57 ఫోన్ Android 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS 3.0 యూజర్ ఇంటర్ ఫేస్ పై రన్ అవుతుంది. ఈ యూజర్ ఫేస్‌లో పొందుపరిచిన యానిమేషన్స్ అలానే స్టాక్ ఐకాన్స్ ఆకట్టుకుంటాయి. 3జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో మల్టీటాస్కింగ్ బాగుంటుంది.

ప్రీమియమ్ మెటల్ డిజైనింగ్‌..

ప్రీమియమ్ మెటల్ డిజైనింగ్‌తో వస్తోన్న OPPO A57 స్మార్ట్ ఫోన్ స్టైల్ ఇంకా డ్యూరబులిటీ విషయంతో ఎంత మాత్రం రాజీపడలేదు. ఆధునిక లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా డిజైన్ చేయబడిన ఈ ఫోన్ సెల్ఫీ ప్రియులను సరికొత్త అంచులకు తీసుకువెళుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 features that make OPPO A57 the perfect smartphone for unstoppable selfies. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot