ఈ జిమ్మిక్కులు విని ఫోన్‌లు కొనకండి

భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ప్రముఖ బ్రాండ్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ వాతావరణం ఏర్పడింది. మా ఫోన్ గొప్పంటే, మా పోన్ గొప్పంటూ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రకరకాల మార్కెటింగ్ ఎత్తుగడలతో వినియోగదారులకు చేరువవుతున్నాయి. తమ ఫోన్‌‌లలో గ్రేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయంటూ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా..? అవి వాస్తవాలే అయితే ఫోన్ పనితీరు ఎందుకు బాగోదు. మీరే చూడండి ఆ మార్కెటింగ్ జిమ్మిక్కులు ఏంటో..?

Read More : బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ జిమ్మిక్కులు విని ఫోన్‌లు కొనకండి

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్లు ఆక్టా‌కోర్ 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌లతో వస్తున్నాయి. ఈ ఫీచర్లను హైలెట్ చేస్తూ పలు బ్రాండ్‌లు నెటిజనులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తాయి. ఇందులో టెక్నికల్ అంశాలను పక్కన పెడితే, ఇదో పెద్ద మార్కెటింగ్ జిమ్మిక్.

ఈ జిమ్మిక్కులు విని ఫోన్‌లు కొనకండి

చాలా బ్రాండ్‌లు తమ ఫోన్‌లో ఎక్కువ మెగా పిక్సల్ కెమెరాను పొందుపరిచనట్లు చెప్పుకుంటాయి. కెమెరా పనితీరు బాగుండాలంటే మెగా పిక్సల్ ఎక్కువ ఉంటే సరిపోదు, ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది నాణ్యమైనదై ఉండాలి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, ఐఫోన్ 6ఎస్ వంటి ఫోన్‌లలో నాణ్యమైన కెమెరాను మీరు చూడొచ్చు.

ఈ జిమ్మిక్కులు విని ఫోన్‌లు కొనకండి

మార్కెట్లో లభ్యమవుతున్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు హైడెఫినిషన్ స్ర్కీన్‌లతో వస్తున్నాయి. పదేపదే ఆయా కంపెనీలు వీటి గురించి చెప్పుకుంటుంటాయి. వాస్తవానికి, ఇవన్నీ బెస్ట్ క్వాలిటీ స్ర్కీన్‌లు కాదు. స్ర్కీన్ బాగుండాలంటే మెరుగైన రిసల్యూషన్ అవసరం. అది కొన్ని ఫోన్‌లలో మాత్రమే ఉంటుంది.

ఈ జిమ్మిక్కులు విని ఫోన్‌లు కొనకండి

ర్యామ్ మెమరీ గురించి చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. ఎక్కువ ర్యామ్ మెమెరీ కలిగిన ఫోన్‌లలో గేమింగ్, మల్టీ టాస్కింగ్ బాగుంటుందా..? అంటే బాగనే ఉంటుంది. ఇదే సమయంలో 2జీబి ర్యామ్‌లతో వచ్చే ఫోన్‌లలో కూడా మల్టీ టాస్కింగ్ ఇరగదీస్తుంది. సామ్‌సంగ్, యాపిల్, సోనీ, హెచ్‌టీసీ, మోటరోలా వంటి బ్రాండెడ్ ఫోన్‌లు తక్కువ ర్యామ్‌ను కలిగి ఉన్నప్పటికి అత్యుత్తమ మల్టీ టాస్కింగ్‌ను చేరువ చేస్తాయి.

 

ఈ జిమ్మిక్కులు విని ఫోన్‌లు కొనకండి

మీ ఫోన్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ను అప్‌టుడేట్‌గా ఉంచుకునేందుకు ఎక్కువ ఫీచర్లను కలిగి ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

ఈ జిమ్మిక్కులు విని ఫోన్‌లు కొనకండి

టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటలను ఫోన్‌లను కొనేకంటే సమీపంలోని మొబైల్ స్టోర్ వద్ద వెళ్లి ఫోన్‌ను పరీక్షించి చూసిన తరువాత పనితీరును బట్టి ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 marketing gimmicks to avoid when buying a smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot