కొత్త టెక్నాలజీతో దూసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్లు !

Written By:

ఇప్పుడు మార్కెట్లోకి అనేక కంపెనీల నుంచి స్మార్ట్‌ఫోన్లు రయ్యిమంటూ దూసుకొస్తున్నాయి. అయితే అన్ని ఫోన్లు ఒకే మాదిరిగా కాకుండా కొత్తగా ఏం ఫీచర్స్ తో వస్తున్నాయా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. మార్కెట్ ని శాసిస్తున్న కంపెనీలు శాంసంగ్ , జియోమి, ఎల్ జి, ఆపిల్, ఇలా అనేక రకాలైన కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను సరికొత్త ఫీచర్లు జోడించి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ కొత్త ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

Read more: మీకు నచ్చిన వారితో డేటింగ్ చేయాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోమి ఎమ్5

జియోమి ఎమ్5లో కొత్తగా యుఎఫ్‌ఎస్ 2.0 స్టోరేజిని ప్రవేశపెట్టారు. దీనిద్వారా మీరు అడ్వాన్స్ సోర్టేజిని పొందవచ్చు. మీ డాటాను ఆ స్టోరేజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ఎల్ జి జి5

ఈ ఫోన్లకు షిప్ట్ డిజైన్ చేశారు.మెటాలిక్ బాడీ అలాగే మాడ్యులర్ డిజైన్, పవర్ బటన్, వంటి ప్రత్యేక ఆప్సన్స్ జత చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7ఎడ్జ్

డ్యూయెల్ ఫిక్సల్ ఆటో ఫోకస్ టెక్నాలజీని ఈ ఫోన్లలో పొందుపరిచారు. ఈ ఫీచర్ ఇంతకుముందు డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలో మాత్రమే ఉండేది.

ఎల్ జి జి5 కెమెరా

ఈ ఫోన్ లో వైడ్ యాంగిల్ కెమెరాను పొందుపరిచారు. దీని సాయంతో వైడ్ యాంగిల్ లో ఫోటోలు తీయవచ్చు. ఒకటి 16 ఎంపీ కెమెరా ఉంటే ఇంకోటి 8 ఎంపీ కెమెరా ఉంటుంది. 135 డిగ్రీల లెన్స్ తో ఫోటోలు తీయవచ్చు.

ఒప్పో బ్యాటరీస్

ఈ ఫోన్ సూపర్ ఓక్ స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ని లాంచ్ చేసింది. దీని ద్వారా 15 నిమిషాల్లో పుల్ ఛార్జింగ్ పెట్టేయవచ్చు. ఇది రానున్న ఒప్పో స్మార్ట్‌ఫోన్లలో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 5 New Smartphone Technologies introduced in February 2016
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot