వాట్సప్.. వాట్సప్.. వాట్సప్..

Posted By:

వాట్సప్... వాట్సప్... వాట్సప్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పదం వినిపిస్తోంది.. అవును నిజమే వాట్సప్ కష్టమర్ల ను అంతగా ఆకట్టుకుంటోంది..అయితే కొత్త కొత్త టెక్నాలజీని ముందుకు వస్తుండటంతో వాట్సప్ కూడా తన కష్టమర్ల కోసం కొత్త కొత్త పీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ వచ్చినాక ఇప్పటికే దాదాపు 95 శాతం మంది యూత్ వాట్సప్ నే వాడుతున్నారు. అలాంటి వాట్సప్ పలు సరికొత్త ఫీచర్లతో నిండిన లేటెస్టు వర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 'మార్క్ .యాజ్ అన్ రీడ్', 'కస్టమ్ నోటిఫికేషన్స్' వంటి ఫీచర్లు వాట్స్ యాప్ కు వచ్చి చేరాయి. ఇప్పుడున్న వీ2.12.189 వర్షన్ నుంచి స్మార్ట్ ఫోన్ యూజర్లు వీ2.12.194కు అప్ డేట్ అయితే, ఈ కొత్త ఫీచర్లు వాడుకోవచ్చని సంస్థ తెలిపింది.

వాట్సప్.. వాట్సప్.. వాట్సప్..

read more ఫన్నీ ఫన్నీగా ఉందామా

కంపెనీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఓ గ్రూప్ లేదా వ్యక్తుల కాంటాక్టులను తమకు నచ్చినట్టుగా మేనేజ్ చేసుకోవచ్చని, ఇందుకోసం మీడియా బాక్స్ కింద గ్రూప్ డీటెయిల్స్ పేజీలోకి వెళ్లి సెట్టింగ్స్ మార్చుకోవాల్సి వుంటుందని వెల్లడించింది. ఇందులో భాగంగా 'మ్యూట్ చాట్', 'టోన్స్', 'వైబ్రేషన్ లెంగ్త్', 'పాపప్ నోటిఫికేషన్స్' తదితరాలను సెట్ చేసుకోవచ్చని తెలిపింది. వీటితో పాటు యూజర్లు ఎంతో కాలంగా అడుగుతున్న 'అన్ రీడ్' ఆప్షన్ ను కూడా అందిస్తున్నట్టు తెలిపింది. ఓ నోటిఫికేషన్ లేదా చాట్ మెసేజ్ పై వేలిని అదిమిపెట్టడం ద్వారా అన్ రీడ్ ఫీచరును పొందవచ్చని.. అయితే, ఇది మెసేజ్ పంపిన వారి స్టేటస్ కు వర్తించదని వెల్లడించింది. వీటితో పాటు తాజా వర్షన్ ద్వారా తక్కువ డేటా ఖర్చవుతుందని, వాయిస్ కాల్స్ కు కూడా సాధారణ పరిస్థితులతో పోలిస్తే తక్కువ డేటా తీసుకుంటుందని, గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ను తిరిగి అందిస్తున్నామని పేర్కొంది. సో మీరు కూడా ఈ ఫీచర్లను తొందరగా మీ ముబైల్ లోకి లాగేసుకోండి.

Read more about:
English summary
5 new WhatsApp features you don’t know about
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting