వన్‌ప్లస్ OxygenOSలో 5 బెస్ట్ ఫీచర్లు ఇవే !

Written By:

స్మార్ట్‌ఫోన్‌కి ప్రాణవాయువు ఆపరేటింగ్ సిస్టం అనేది అందరికీ తెలిసిన విషయమే. హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్ లు సరిగా లేకుంటే స్మార్ట్‌ఫోన్ అంత ఆసక్తికరంగా ఉండదు. ఇంటిలిజెంట్ యూజర్లు మంచి అనుభూతిని పొందాలంటే సాఫ్ట్‌వేర్ అనేది చాలా కీలకం. అయితే ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లలో అలాంటి ఫీచర్లు ఏమైనా ఉన్నాయా అనే సందేహం చాలామందికి రావచ్చు. అయితే కొన్ని ఫోన్లు అలాంటి సాఫ్ట్ వేర్లతో దూసుకుపోతున్నాయి. వీటిల్లో వన్ ప్లస్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు ఆకంపెనీ ఆపరేటింగ్ సిస్టంతో మంచి పనితీరును కనబరుస్తున్నాయి. ఆండ్రాయిడ్ వర్షన్ తో పాటు కంపెనీ నుంచి వచ్చిన ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం ఇప్పుడు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూజర్లకు మంచి అనుభూతిని అందిస్తోంది. ఈ కొత్త ఓఎస్‌ను వన్‌ప్లస్ 5టీకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ఫోన్ వాడుతున్న యూజర్లు ఈ ఓఎస్ గురించిన సమాచారం, కొత్తగా యాడ్ అయిన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Redmi 5 రాకతో తగ్గిన Redmi 4 స్మార్ట్‌ఫోన్ ధర

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Face Unlock

వన్‌ప్లస్ 5టీ లేటెస్ట్ వర్షన్ ఆక్సిజన్ ఓఎస్ మీద రన్ అవుతుంది. ఇది ఫేస్ అన్ లాక్ ఫీచర్ ని సపోర్ట్ చేస్తుంది. కాగా ఇది కొత్తగా యాడ్ అయిన ఫీచర్.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కేవలం ఫోన్ ని చూస్తూనే అన్ లాక్ తీయవచ్చు. ఆండ్రాయిడ్ మార్కెట్లో దూసుకుపోతున్న ఫేస్ రికాగ్నిషేన్ టెక్నాలజీ కి ఇది ప్రత్యామ్నాయంగా వచ్చింది. ఇది అత్యంత వేగంగా మీ ఫోన్‌ని అన్‌లాక్ చేస్తుంది.

OnePlus Switch

ఈ ఓఎస్ లో వచ్చిన మరొక అద్భుత ఫీచర్ ఇది. దీని ద్వారా మీరు మీ పాత ఫోన్ నుంచి వేరే వన్ ప్లస్ ఫోన్లోకి మారాలనుకున్నప్పుడు మీ కాంటాక్ట్స్, అలాగే ఫోటోలు, వీడియోలు, ఇతర మెమొరీలను కూడా వెంట తీసుకెళ్లవచ్చు. అంటే పాత ఫోన్ నుంచి మీరు నేరుగా కొత్త ఫోన్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రాసెస్ ద్వారా దీన్ని మీరు సాధించవచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్లో ఉచితంగా ఇన్ స్టాల్ అయిన migration app ద్వారా క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసుకోవాలి. అప్పుడు మీరు మీ ఫైల్స్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీని మీద ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి. Wi-Fi history, Camera settings, Apps dataతో పాటు ఇతర ఫీచర్లు కూడా ట్రాన్స్ ఫర్ చేసుకునే విధంగా వన్ ప్లస్ కసరత్తు చేస్తోంది.

Open Beta Program

వన్‌ప్లస్‌లో సాఫ్ట్‌వేర్ అనేది బిగ్ పార్ట్. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎటువంటి బగ్స్ లేకుండా మీ ఫోన్ ని సేప్ గా ఉంచుకోవచ్చు. Closed Beta, Open Beta, and Official Release లాంటి వన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్ డేట్ రూపంలో అందుతుంటాయి. ఈ ఫీచర్ ద్వారా కంపెనీ నుంచి వచ్చే ప్రతి అప్ డేట్ మీకు అత్యంత వేగంగా అందుతుంది. కంపెనీ నుంచి వచ్చే సాప్ట్ వేర్లు మీ ఫోన్లో ఈ పీచర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.

Gaming Do Not Disturb

కాగా ఈ ఓఎస్ లో కంపెనీ గేమింగ్ మీదనే ప్రముఖ దృష్టి పెట్టింది. అనేక రకాలైన గేమ్స్ మీరు ఆడుతున్న సమయంలో ఈ ఫీచర్ ద్వారా మీరు నోటిఫికేషన్లను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. మీ ఫోన్ కు వచ్చే నోటిఫికేసన్స్ పాప్ అప్ రూపంలో మీకు అందుతాయి గేమింగ్ ఎటువంటి అంతరాయం ఉండదు. ఈ ఫీచర్ మీరు సొంతం చేసుకోవాలంటే hitting Settings > Advanced > Gaming Do Not Disturb అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు యాప్స్ నోటిఫికేషన్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే మీరు ఈ ఫీచర్ ద్వారా calls and alarms మిస్ కారు.

Deeper level of customization

కాగా మార్కెట్లో ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లలో ఇటువంటి ఫీచర్లు ఉన్న ఫోన్లు తక్కువనే చెప్పాలి. ఆక్సిజన్ ఓఎస్ ఇంకా అదునాతన హంగులతో మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఎంతకంత బెస్ట్ అంటే కేవలం ఈ ఓఎస్ ఉండటం వల్లనే అని చెప్పవచ్చు. యూజర్లకు మంచి ఆండ్రాయిడ్ అనుభూతిని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 OxygenOS features that make OnePlus 5T an irresistible choice More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot