మీ Redmi ఫోన్‌లో హీటింగ్ సమస్యా..?

ఈ ఏడాదికిగాను ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా కొనుగోలు చేసిన ఫోన్‌లలో Redmi Note 3 ఒకటి. ఐదు నెలల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 3 ఫోన్‌కు సంబంధించి రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెులస్తోంది. భారత్‌లో ఈ ఫోన్ అమ్మకాల సంఖ్య 17,50,000 మార్కును దాటినట్లు ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఐడీసీ తన నివేదికలో పేర్కొంది.

మీ Redmi ఫోన్‌లో హీటింగ్ సమస్యా..?

Read More : Jio 4జీ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న 245 స్మార్ట్‌ఫోన్‌ల కంప్లీట్ లిస్ట్

ఇటీవల కాలంలో ఈ ఫోన్‌లను వినియోగిస్తన్న చాలా మంది యూజర్లు హీటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ఛార్జ్ అవుతోన్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్స సమయంలో హీటింగ్ సమస్యలను ఫేస్ చేస్తు్న్నట్లు యూజర్లు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్‌ అయ్యే కొన్ని యాప్స్ ప్రాసెసర్ పై పరిమితికి మించి ఒత్తిడిని తీసుకురావటంతో హీటింగ్ సమస్యలను తలెత్తుంటాయి. కాబట్టి ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్ అయ్యే యాప్స్‌ను ఎప్పటికప్పుడు క్లోజ్ చేయండి. 

టిప్ 2

జీపీఎస్, వై-ఫై, డేటా వంటి కనెక్టువిటీ ఆప్షన్స్ ఎక్కువ సేపు ఆన్ చేసి ఉన్నా ఫోన్ హీటెక్కటం మొదలవుతుంది. వీటిని మీరు ఉపయోగించని పక్షంలో క్లోజ్ చేయండి. అవసరమైనపుడు మాత్రమే ఆన్ చేసుకోండి.

టిప్ 3

ఫోన్‌ను ఛార్జ్ చేసే క్రమంలో నాణ్యమైన అడాప్టర్‌ను ఉపయోగించండి. ఫోన్‌‌తో పాటుగా వచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌ను వాడటం సురక్షితమైన పద్ధతి.

టిప్ 4

ఛార్జ్ చేసే సమయంలో ఫోన్‌ కవర్‌ను తొలగించటం వల్ల వేడి ఏమైనా ఉంటే బయటకు పోతుంది. ఫోన్ ఛార్జ్ అవుతోన్న సమయంలో గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వంటివి చేయకండి.

టిప్ 5

ఫోన్ కూల్ చేయటం కోసం థర్ట్ పార్టీ యాప్స్‌ను ఆశ్రయించటం శుద్ధ దండగ. మానిటరింగ్ యాప్స్‌ను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా హీటింగ్ ఇష్యూకు కారణమవుతున్న యాప్స్‌ను గుర్తించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Quick Steps to Solve the Heating Issue in Xiaomi Redmi Note 3. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot